Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుచ్చిబాబు టాప్ 4 డైరెక్టర్లలో ఒకడు అవుతాడు.. జాన్వీ అతన్ని తన చేతులతో నలిపేయగలదు.. సరస్వతీ పుత్రుడు: రామ్ చరణ్

బుచ్చిబాబు టాప్ 4 డైరెక్టర్లలో ఒకడు అవుతాడు.. జాన్వీ అతన్ని తన చేతులతో నలిపేయగలదు.. సరస్వతీ పుత్రుడు: రామ్ చరణ్

Ram Charan on Buchibabu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi). 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన దర్శకుడు బుచ్చిబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.

రాబోయే రోజుల్లో బుచ్చిబాబు టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియన్ సినిమాలోనే టాప్ దర్శకుడిగా ఎదుగుతాడని చరణ్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

"బుచ్చిబాబు ఒక సరస్వతీ పుత్రుడు"

ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ప్రతిభ గురించి రామ్ చరణ్ చాలా ఆసక్తికరంగా, కాస్త సరదాగా మాట్లాడారు.

"తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. రూ.100 కోట్లు రాబట్టాడు. నా మాటలు రాసి పెట్టుకోండి.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే బుచ్చిబాబు ఇండియాలోనే టాప్ 4 దర్శకులలో ఒకడిగా నిలుస్తాడు. ఆయన చూస్తే కేవలం 55 నుండి 60 కేజీల బరువు మాత్రమే ఉంటాడు. నిజం చెప్పాలంటే.. జాన్వీ కపూర్ తన చేతులతోనే అతడిని నలిపేయగలదు (నవ్వుతూ). కానీ బుచ్చిబాబుకు ఏనుగంత మైండ్ ఉంది. ప్రస్తుతం మనకున్న దర్శకులలో ఆయన అత్యంత ప్రతిభావంతుడైన 'సరస్వతీ పుత్రుడు'. అతనికి నా ఆల్ ది బెస్ట్" అని రామ్ చరణ్ అన్నారు.

బుచ్చిబాబు విషయంలో మొదటి నుంచీ రామ్ చరణ్ ఆసక్తిగానే చెబుతూ వస్తున్నారు. అతని టాలెంట్ ను ఆకాశానికెత్తుతున్నారు. ఉప్పెనతో సంచలన విజయం అందుకున్న బుచ్చిబాబు.. రెండో సినిమానే రామ్ చరణ్ లాంటి నటుడితో, పాన్ ఇండియా స్థాయి మూవీ రూపొందించడం విశేషం.

పెద్ది మూవీ విశేషాలు

పెద్ది మూవీలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటించారు. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేయగా.. వెంకట సతీష్ కిలారు తన వృద్ధి సినిమాస్ బ్యానర్లో మూవీని నిర్మించాడు. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. జూన్ 4న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఇంటర్వ్యూలో బుచ్చిబాబు గురించి రామ్ చరణ్ ఏమని ప్రశంసించారు?

బుచ్చిబాబు కేవలం 55-60 కేజీల బరువున్నా, అతనికి ఏనుగంత మైండ్ ఉందని.. రాబోయే కొన్నేళ్లలో దేశంలోని టాప్ 4 డైరెక్టర్లలో ఒకడిగా నిలుస్తాడని రామ్ చరణ్ కొనియాడారు. అంతేకాకుండా అతడిని 'సరస్వతీ పుత్రుడు' అని అభివర్ణించారు.

2. 'పెద్ది' సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు?

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

3. 'పెద్ది' సినిమా థియేటర్లలోకి ఎప్పుడు రానుంది?

ఈ భారీ పాన్-ఇండియా చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu