Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బుధాదిత్య రాజయోగం ప్రభావం.. ఈ 5 రాశుల కెరీర్, ధనం, అదృష్టం పరుగులు!

బుధాదిత్య రాజయోగం ప్రభావం.. ఈ 5 రాశుల కెరీర్, ధనం, అదృష్టం పరుగులు!

గ్రహాల రాకుమారుడు బుధుడు ఇప్పటికే సంచరిస్తున్న మిథున రాశిలోకి జూన్ 15న గ్రహాల రాజు సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' సాకారం కానుంది.

సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసినప్పుడు ఈ అద్భుత యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ కలయిక వల్ల కొన్ని రాశుల వారికి పట్టరాని అదృష్టం వరించడమే కాకుండా కెరీర్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం విషయాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

సూర్య, బుధుల కలయిక వల్ల ఏర్పడే బుధాదిత్య యోగం కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చేస్తుంది అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఈ అదృష్ట యోగం వల్ల విపరీతమైన ధన లాభాన్ని, విజయాన్ని అందుకోబోతున్న ఆ ఐదు రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

1.మిథున రాశి

ఈ బుధాదిత్య రాజయోగం మిథున రాశిలోనే ఏర్పడుతుండటంతో ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో మీ నాయకత్వ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగం నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం పెరగడంతో పాటు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ గ్రహాల కలయిక ఎంతో మేలు చేస్తుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సొంత ఇల్లు, భూమి లేదా కొత్త వాహనాలు కొనాలనే మీ కల నెరవేరుతుంది. తండ్రి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది, ఆయన ఇచ్చే ఆర్థిక సలహాలు మీకు బాగా కలిసివస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి స్నేహితుల సహాయంతో వ్యాపార విస్తరణ సాధ్యమవుతుంది. మీ మాటతీరుతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు.

3.కన్యా రాశి

కన్యా రాశి వారికి బుధాదిత్య యోగం వల్ల కెరీర్, ఆర్థికం, కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. పెండింగ్ పనులన్నీ వేగవంతం అవుతాయి. వ్యాపారాల నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగస్తులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల మెప్పు పొంది, పెద్ద విజయాలు సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ధన ప్రవాహం పెరగడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.

4.తులా రాశి

తులా రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అండగా నిలుస్తుంది. దైవబలంతో పనులన్నీ సజావుగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబం నుంచి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు, కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. ఆదాయ వనరులు పెరిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

5.ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ కాలం విశేష లాభాలను తెచ్చిపెడుతుంది. కార్యాలయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును అభినందిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. వివాహిత జంటల మధ్య పరస్పర అవగాహన పెరిగి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం సమకూరడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.

Peddinti Sravya, hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu