Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chiranjeevi: సంకల్ప సాధకుడు మా కళ్యాణ్ బాబు: పవర్ స్టార్ బర్త్‌డే రోజు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ విషెస్

Chiranjeevi: సంకల్ప సాధకుడు మా కళ్యాణ్ బాబు: పవర్ స్టార్ బర్త్‌డే రోజు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ విషెస్

Chiranjeevi: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఎమోషనల్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

"సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు" అని అంటూ తమ్ముడిపై తనకున్న ప్రేమానురాగాలను చిరంజీవి అత్యంత ఆత్మీయంగా వ్యక్తపరిచారు.

చిన్నప్పటి నిబద్ధత.. ప్రజల పట్ల ఆరాధన

పవన్ కళ్యాణ్ కు జనం పట్ల ఉన్న అంకితభావం, చిన్నప్పటి నుంచి ఆయనలో ఉన్న క్రమశిక్షణను చిరంజీవి తన పోస్ట్‌లో గుర్తు చేసుకున్నారు. కుటుంబం మీద ఎంత ప్రేముందో, తన్ను నమ్మిన ప్రజలపైనా అంతే వాత్సల్యం పవన్‌కు ఉందంటూ కొనియాడారు.

ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసం పవన్ పడుతున్న కష్టాన్ని మనస్పూర్తిగా అభినందించారు. పాలనలో పవన్ తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

పిఠాపురం ప్రజలకు కుటుంబ సభ్యుడిలా..

రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. పిఠాపురం నుంచి ఘన విజయం సాధించి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా కాకుండా సొంత కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నారని చిరంజీవి తన ట్వీట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏళ్లుగా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన క్లిష్టమైన సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతూ మారుమూల ప్రాంతాలకు సైతం అభివృద్ధిని తీసుకెళ్తున్న తీరు తనకు ఎంతో గర్వాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

ఆంజనేయస్వామిని కోరుకుంటూ 'అన్నయ్య' ఆశీస్సులు

తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా పవన్ తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవాలని, ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, ప్రజాసేవకు పునరంకితం కావాలని తమ ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఈ పోస్ట్ చివరన "మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అన్నయ్య చిరంజీవి" అని సైన్ ఆఫ్ చేయడంతో మెగా అభిమానులు ఈ లేఖను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.

సినిమాలు, రాజకీయం.. రెండింటిలోనూ సరికొత్త రికార్డులు

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ-పర్యావరణ శాఖల బాధ్యతలను పవన్ నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఓజీ సీక్వెల్ మూవీ పనుల్లోనూ బిజీ కానున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లలోనూ గెలిచి చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పైనా తన చరిష్మాను కాపాడుకుంటున్నారు.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu