Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Christopher Nolan Odyssey: క్రిస్టోఫర్ నోలన్ కు దారుణ అవమానం.. ఒడిస్సీ ట్రైలర్ డిస్‌లైకుల రికార్డు.. నెట్టింట ట్రోల్స్

Christopher Nolan Odyssey: క్రిస్టోఫర్ నోలన్ కు దారుణ అవమానం.. ఒడిస్సీ ట్రైలర్ డిస్‌లైకుల రికార్డు.. నెట్టింట ట్రోల్స్

Christopher Nolan Odyssey: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఆయన లైనప్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఒడిస్సీ' (Odyssey) జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే తాజాగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ నెట్టింట తీవ్రమైన బ్యాక్‌లాష్ ఎదుర్కుంటోంది.

నోలన్ కు అవమానం

ఒడిస్సీ ట్రైలర్ కు వస్తున్న నెగెటివ్ రెస్పాన్స్ తో క్రిస్టోఫర్ నోలన్ కు దారుణమైన అవమానం కలిగింది. ఈ లెజండరీ డైరెక్టర్ కెరీర్ లోనే ఇది అత్యధిక డిస్‌లైకులు పొందిన ట్రైలర్ గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. జూలై 1న రిలీజైన ఒడిస్సీ ఫైనల్ ట్రైలర్ కు ఇప్పటివరకూ 53 వేలకు పైగా లైైక్స్ రాగా.. డిస్‌లైక్స్ మాత్రం ఏకంగా 3 లక్షలకు పైగా ఉన్నాయి. డిస్‌లైకుల శాతం ఏకంగా 85 శాతం ఉండటం గమనార్హం.

స్నో వైట్ తర్వాత

2025లో వచ్చిన డిస్నీమూవీ స్నోవైట్ తర్వాత అత్యధిక డిస్‌లైకులు పొందిన మూవీగా ఒడిస్సీ నిలిచిందని మూవీ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. స్నో వైట్ మూవీకి 90 శాతానికి పైగా డిస్‌లైకులు వచ్చాయి. ఇప్పుడు ఒడిస్సీ ట్రైలర్ కూడా అదే బాటలో సాగుతుంది. ఈ ట్రైలర్ కు తీవ్రమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి.

నోలన్ కెరీర్‌లోనే అత్యంత ఘోరమైన డిస్‌లైకుల రికార్డును ఈ ట్రైలర్ మూటగట్టుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

అసలు కారణం ఏంటి?

సాధారణంగా క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ లైకులు రావడం చూస్తుంటాం. కానీ, 'ఒడిస్సీ' ఫైనల్ ట్రైలర్‌కు మాత్రం యూట్యూబ్‌లో ఎక్కువ డిస్‌లైకులు వస్తున్నాయి. గంటగంటకూ ఈ డిస్‌లైకుల సంఖ్య మరింత వేగంగా పెరుగుతోంది. ఈ స్థాయి నెగిటివిటీకి ప్రధాన కారణం సినిమాలో చేసిన పాత్రల ఎంపికేనని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు.

గ్రీక్ పురాణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. నేటి ఆధునిక 'వోకిజం' (జాత్యహంకారం, లైంగిక వివక్ష, సామాజిక అసమానతల పట్ల అప్రమత్తంగా ఉండటం) భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కథలోని మూల పాత్రల ప్రాధాన్యతను పక్కనపెట్టి, కేవలం జాతి వైవిధ్యం చూపించాలనే తాపత్రయంతో మల్టీ రేషియల్ యాక్టర్లను ఎంపిక చేయడం చాలా ఆర్టిఫిషియల్‌గా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నోలన్‌కు బిగ్గెస్ట్ ఛాలెంజ్

విజువల్ వండర్స్‌ను, క్లిష్టమైన మైండ్-బెండింగ్ స్క్రీన్‌ప్లేను నమ్ముకునే క్రిస్టోఫర్ నోలన్.. ఈసారి కాస్టింగ్ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఆయనకు పెద్ద మైనస్‌గా మారేలా కనిపిస్తున్నాయి. జూలై 17న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ఈ నెగిటివిటీని దాటుకుని బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు రాణిస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఒకవేళ థియేటర్లలో కంటెంట్ చాలా అద్భుతంగా ఉండి, మౌత్ టాక్ పాజిటివ్‌గా వస్తే తప్ప, ఈ 'వోక్' వివాదం నుండి సినిమా గట్టెక్కడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu