Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CM Vijay: సీఎం అవుతానని విజయ్‌కు ముందే తెలుసా.. వైరల్‌గా ఆ సినిమాలోని కారు నంబర్ ప్లేట్‌.. దళపతి టైమ్ ట్రావెల్!

CM Vijay: సీఎం అవుతానని విజయ్‌కు ముందే తెలుసా.. వైరల్‌గా ఆ సినిమాలోని కారు నంబర్ ప్లేట్‌.. దళపతి టైమ్ ట్రావెల్!

CM Vijay: స్టార్ హీరో దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాలను పూర్తిగా మార్చేశాడు. కొత్తగా స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ద్వారా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి, ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకున్నాడు.

మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే అత్యధిక సీట్లు సాధించిన విజయ్ సీఎం కుర్చీపై కూర్చోవడానికి సిద్ధమవుతున్నాడు.

రాజకీయాల్లో విజయ్

తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఈ పరిణామాలను గమనించిన అభిమానులు, విజయ్ ఈ విజయాన్ని రెండేళ్ల క్రితమే అంచనా వేశాడా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ 2024లో మాత్రమే టీవీకే పార్టీని అధికారికంగా స్థాపించాడు. కానీ, అంతకుముందే ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆశించాడు.

ఆ కారు నంబర్

2024లో విడుదలైన 'గోట్' (GOAT) సినిమాలో విజయ్ నడిపే కారు నంబర్ ప్లేట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఒక సీన్ మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజయ్ కారు నడుపుతున్న ఒక సన్నివేశంలో, కారు నంబర్ ప్లేట్ స్పష్టంగా 'TN 07 CM 2026' అని కనిపిస్తుంది. CM 2026 అని ఉండటంతో విజయ్ 2026లో సీఎం అవుతానని ముందే ఊహించారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

టైమ్ ట్రావెల్

ఇప్పుడు సీఎం పదవి చేపట్టడానికి విజయ్ సిద్ధమైన నేపథ్యంలో గోట్ మూవీలోని కారు క్లిప్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. "అద్భుతమైన డీటైలింగ్", "సరిగ్గా సమయం వచ్చేసరికి తన ఆశయాన్ని నిజం చేసుకున్నారు", ''విజయ్ టైమ్ ట్రావెలర్'' అని పోస్టులు పెడుతున్నారు. ఇకపై ఐపీఎల్ విజేతలను కూడా విజయ్ ముందే చెప్పాలని కొందరు సరదాగా వ్యాఖ్యానించారు.

విజయ్ విజయభేరి

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ విజయభేరి మోగించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. 234 స్థానాలున్న అసెంబ్లీలో 108 స్థానాలను గెలుచుకుంది. మెజారిటీ మార్కుకు అవసరమైన 118 స్థానాలకు 10 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో ఇతర పార్టీల మద్దతును కూడగట్టేందుకు విజయ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరోవైపు విజయ్ చివరి చిత్రంగా చెప్పుకుంటున్న 'జాన నాయగన్' (Jana Nayagan) ఇంకా విడుదల కాలేదు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) దీనికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: తమిళనాడు ఎన్నికల్లో TVK పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంది?

సమాధానం: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ మొత్తం 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ప్రశ్న: 'గోట్' సినిమాలో విజయ్ కారు నంబర్ ప్లేట్ ప్రాముఖ్యత ఏమిటి?

సమాధానం: 'గోట్' చిత్రంలో విజయ్ నడిపే కారు నంబర్ ప్లేట్ 'TN 07 CM 2026' అని ఉంటుంది. ఇది 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ముందే సూచించిందని అభిమానులు నమ్ముతున్నారు.

ప్రశ్న: టీవీకే పార్టీ ఏయే పార్టీలను వెనక్కి నెట్టింది?

సమాధానం: TVK పార్టీ డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) వంటి దశాబ్దాల కాలంగా అధికారంలో ఉన్న ప్రధాన పార్టీలను వెనక్కి నెట్టింది.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu