Director: సినీ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్లు చాలా తక్కువ. వాళ్ల సంఖ్యను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక తెలుగులో అయితే ఎవరున్నారా? అని ఆలోచిస్తే అందరికీ ముందుగా ఒక పేరే గుర్తుకొస్తుంది.
ఆ పేరే.. బీవీ నందిని రెడ్డి. టాలీవుడ్ లోని పాపులర్ లేడీ డైరెక్టర్. అమ్మాయిలు కూడా సినిమాలు తీయొచ్చని నేటి తరానికి చాటిన దర్శకురాలు.
ఫస్ట్ మూవీతోనే
బీవీ నందిని రెడ్డి చాలా కాలం నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన తర్వాత ఆమె మెగాఫోన్ చేతపట్టారు. డైరెక్టర్ గా తన ఫస్ట్ మూవీతోనే సంచలనం క్రియేట్ చేశారు. నందిని రెడ్డి డైరెక్టర్ గా తీసిన 'అలా మొదలైంది' మూవీ ఎంతటి బ్లాక్ బస్టరో మనకు తెలిసిందే. ఈ మూవీతో ఆమె బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.
సమంతతో మూడు
నందిని రెడ్డి ఇప్పటివరకూ ఆరు సినిమాలు తీసింది. అయితే ఇందులో మూడింట్లో సమంతనే హీరోయిన్ కావడం విశేషం. 2013లో సిద్ధార్థ్ హీరోగా నందిని రెడ్డి తెరకెక్కించిన 'జబర్దస్త్' మూవీలో సమంత హీరోయిన్. 2019లో వచ్చిన 'ఓ బేబీ' చిత్రంలో సమంతానే ప్రధాన పాత్ర పోషించింది.
ఇక ఇప్పుడు సమంతాను లీడ్ రోల్ లో పెట్టి 'మా ఇంటి బంగారం' మూవీ తీసింది నందిని రెడ్డి. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
అల్లు అర్జున్ తిట్లు
నందిని రెడ్డికి సమంతానే కాదు అల్లు అర్జున్ కూడా మంచి ఫ్రెండ్. ఓ సారి అల్లు అర్జున్ తనను తిట్టాడని నందిని రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నందిని రెడ్డి తీసిన 'జబర్దస్త్' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆడలేకపోయింది. ఈ మూవీ ఫెయిల్యూర్ తో నందిని రెడ్డి బాగా డిస్టర్బ్ అయ్యారు.
మూడు నెలలు ఇంట్లోనే
జబర్దస్త్ మూవీ ఫ్లాప్ కావడంతో నందిని రెడ్డి దాదాపు మూడు నెలల పాటు ఇంట్లోనే ఉండిపోయారంటా. ఈ విషయాన్ని నందిని గతంలో తెలిపారు. అయితే నందిని రెడ్డి గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ ఓ రోజు తనను ఇంటికి పిలిచాడు. అల్లు అర్జున్ ఇంటికి పిలిచి తిట్టాడని నందిని చెప్పారు.
ఒక్క ఫ్లాప్ కే ఇంట్లో ఉండిపోతావా? తర్వాతి మూవీ ప్లాన్ ఏం లేదా? కథ ఏంటీ? ఇప్పుడే చెప్పు అని బన్నీ తనను అడిగాడని నందిని వెల్లడించారు. అల్లు అర్జున్ మాటలు తనకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని నందిని రెడ్డి చెప్పారు.
Chandu Shanigarapu

