Dailyhunt
ఈ ఒక్క చిన్న మొక్క పురోగతికి అడ్డంకులను తొలగిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది.. లాభాలు, ఏ దిశలో ఉండాలో తెలుసుకోండి!

ఈ ఒక్క చిన్న మొక్క పురోగతికి అడ్డంకులను తొలగిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది.. లాభాలు, ఏ దిశలో ఉండాలో తెలుసుకోండి!

చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. దాని వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే ఇంట్లో ఉన్న సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి.

ప్రతికూల శక్తి కూడా తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. నిజానికి ఈ ఒక్క మొక్క అద్భుతాన్ని చేస్తుంది. చాలా మంది ఇళ్లల్లో అనేక మొక్కలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఒక్క మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ మొక్క వలన ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంటికి అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది.

పైగా ఈ మొక్క అందాన్ని రెట్టింపు చేయడానికి, సంపదను పెంచడానికి కూడా సహాయపడుతుంది. అదే కలబంద మొక్క. కలబంద మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. వ్యాపారంలో, వృత్తిపరంగా కూడా అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. కలబంద మొక్క ఇంట్లో ఉంటే అడ్డంకులు అన్నీ తొలగిపోయి పురోగతిని చూడొచ్చు. అయితే కలబందకు సంబంధించి పాటించాల్సిన పరిహారాలు, ఏ దిశలో ఉండాలి వంటి విషయాలను కూడా తెలుసుకుందాం.

కలబంద మొక్కతో విజయాలు, ప్రమోషన్లు.. కెరీర్‌లో అద్భుత మార్పులు రావచ్చు

చాలా మంది కష్టపడి పని చేస్తూ ఉంటారు, కానీ ఫలితం ఉండదు. అలాంటప్పుడు వాస్తు ప్రకారం ఇంటి పడమర దిశలో కలబంద మొక్కను పెట్టండి. ఇది కెరీర్‌లో మంచి మార్పులను తీసుకు వస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది. అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రమోషన్లు కూడా రావచ్చు.

ప్రేమ జీవితం, వైవాహిక సంతోషం:

భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, ప్రేమికులు సంతోషంగా ఉండాలని అనుకుంటే కలబంద మొక్క అద్భుతంగా పని చేస్తుంది. కలబంద మొక్కను ఇంటి ఉత్తరం వైపు పెట్టండి. తూర్పు సూర్యుడి దిశ. ఈ దిశలో కలబంద మొక్క ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమనురాగాలు పెరుగుతాయి. బంధం బలంగా, దృఢంగా ఉంటుంది.

కలబంద మొక్కతో ఆర్థిక లాభాలు:

ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, డబ్బు వృథా అవుతున్నా, అప్పులు వంటి ఇబ్బందులు ఉన్నా కలబంద మొక్కను బాల్కనీలో లేదా గార్డెన్‌లో పెంచండి. ఇది ప్రతికూల శక్తిని తొలగించి ఇంటిని ప్రశాంతంగా ఉంచుతుంది. ఆర్థికపరంగా ప్రయోజనాలు కలుగుతాయి. అప్పుల బాధల నుంచి కూడా బయటపడే వీలుంది.

కలబంద మొక్కను ఏ దిశలో నాటకూడదు?

కలబంద మొక్కను ఎప్పుడూ సరైన దిశలో ఉంచాలి. ఎప్పుడూ కూడా కలబంద మొక్కను వాయువ్య దిశలో పెట్టకూడదు. అలా చేస్తే జీవితంలో ఇబ్బందులు వస్తాయి. ప్రతికూల శక్తితో కూడా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పినట్లు అనుసరిస్తే చక్కటి మార్పులను చూసే అవకాశం ఉంది.

Peddinti Sravya, hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu