Dailyhunt
Exam Dates : తెలంగాణలో పలు పోటీ పరీక్షల ముఖ్యమైన తేదీలు.. డేట్స్ దగ్గరపడుతున్నాయ్!

Exam Dates : తెలంగాణలో పలు పోటీ పరీక్షల ముఖ్యమైన తేదీలు.. డేట్స్ దగ్గరపడుతున్నాయ్!

తెలంగాణలో విద్యార్థుల కోసం 2026 ప్రవేశ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మీరు మీ క్యాలెండర్‌పై ఈ తేదీలను మార్క్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్‌ ప్లాన్ చేసుకోవాలి.

టీజీ ఈఏపీ సెట్, టీజీ లాసెట్ లాంటి పరీక్షలు త్వరలో జరగనున్నాయి. వీటికి సంబంధించి అప్లికేషన్ తేదీలు కూడా దగ్గర పడుతున్నాయి.

  • టీజీ ఈఏపీసెట్(ఎంపీసీ)-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 4-పరీక్ష తేదీ 2026 మే 9, 10, 11
  • టీజీ ఈఏపీసెట్(బైపీసీ)-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 4-పరీక్ష తేదీ 2026 మే 4, 5
  • టీజీ ఎడ్‌సెట్-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 15-పరీక్ష తేదీ 2026 మే 15
  • టీజీ ఈసెట్-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 18-పరీక్ష తేదీ 2026 మే 15
  • టీజీ లాసెట్(3ఏళ్లు)-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 10-పరీక్ష తేదీ 2026 మే 18
  • టీజీ లాసెట్(5ఏళ్లు)-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 10-పరీక్ష తేదీ 2026 మే 18
  • టీజీ పీఈసెట్-దరఖాస్తు చివరితేదీ మే 5-పరీక్ష తేదీ 2026 మే 18
  • టీజీ పాలిసెట్-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 20-పరీక్ష తేదీ 2026 మే 13
  • టీజీ పీజీఈసెట్-దరఖాస్తు చివరితేదీ మే 6-పరీక్ష తేదీ 2026 మే 28

టీజీ లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

ఉస్మానియా విశ్వవిద్యాలయం టీజీ లాసెట్ 2026 దరఖాస్తు గడువును, ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగించింది. టీజీ లాసెట్ దరఖాస్తు పత్రాన్ని ఇంకా పూరించని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ lawcet.tgche.ac.in ను సందర్శించవచ్చు. విద్యార్థులు LAWCET 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను గడువు తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో అసంపూర్ణంగా ఉన్న దరఖాస్తులు తిరస్కరిస్తారు.

తెలంగాణలోని సంబంధిత కళాశాలల్లో 3-సంవత్సరాల, 5-సంవత్సరాల LLB కోర్సులలో ప్రవేశాల కోసం అధికారులు TS LAWCET 2026 పరీక్షను నిర్వహిస్తున్నారు. దరఖాస్తు పత్రాన్ని పూరించాలనుకునే విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఆ తర్వాత తమ వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలను ఉపయోగించి దరఖాస్తు పత్రాన్ని పూరించాలి.

ఎలా అప్లై చేయాలి?

TS LAWCET దరఖాస్తు పత్రాన్ని పూరించడానికి విద్యార్థులు ఈ క్రింది దశలను పాటించాలి:

  • lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • "Apply Online for TS LAWCET 2026" పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
  • పేరు, విద్యార్హతలు, ఇతర వివరాల వంటి సమాచారాన్ని పూరించండి.
  • ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
  • తర్వాత అప్లికేషన్ పూర్తి చేయండి.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu