Exam OTT: అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న కొత్త తమిళ ఒరిజినల్ సిరీస్ 'ఎగ్జామ్'పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 15న ఈ సస్పెన్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సినీ ప్రముఖులు ఈ ప్రాజెక్ట్ పై తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను, పరిశ్రమను విశేషంగా ఆకట్టుకుంది.
నాని రియాక్షన్
తమిళ సస్పెన్స్ డ్రామా 'ఎగ్జామ్' సిరీస్ రిలీజ్ కోసం నేచురల్ స్టార్ నాని ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాడు. ఈ సిరీస్ గురించి అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. "ఎగ్జామ్ సిరీస్ లో అత్యంత ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నారు" అని నాని పేర్కొంటూ, ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న టీమ్ కృషిని అభినందించాడు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
సెలబ్రిటీల రియాక్షన్
ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఎగ్జామ్ సిరీస్ సూపర్ సక్సెస్ కావాలని ఎస్.జె.సూర్య కోరుకున్నాడు. అలాగే 'సుజల్: ది వోర్టెక్స్ సీజన్ 2' ఫేమ్ సంయుక్త విశ్వనాథన్ ఈ సిరీస్ పై తన స్పందనను తెలియజేసింది. ఇది వాల్‌వాచర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న మరో అద్భుతమైన కంటెంట్ అని, చూసేందుకు వేచి ఉండలేకపోతున్నానని ఆమె పేర్కొంది.
ఐశ్వర్య రాజేష్ కూడా
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఐశ్వర్య రాజేష్ కూడా ఎగ్జామ్ సిరీస్ పై కామెంట్లు చేసింది. ఈ సస్పెన్స్ డ్రామా కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుందని ఆమె పేర్కొంది. 'ఇన్స్పెక్టర్ రిషి' ఫేమ్ సునయన కూడా ఈ సిరీస్ కోసం తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
ఎగ్జామ్ గురించి..
పుష్కర్, గాయత్రి నిర్మిస్తున్న ఈ ఎగ్జామ్ సిరీస్ కు ఎ. సర్కునం రచన, దర్శకత్వం వహిస్తున్నారు. వాల్‌వాచర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సస్పెన్స్ డ్రామాను రూపొందించారు. దుషారా విజయన్, అదితి బాలన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ లో నటుడు అబ్బాస్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
240 దేశాల్లో
'ఎగ్జామ్' సిరీస్ మే 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా, ఆంగ్లంతో సహా 15 భాషల్లో సబ్‌టైటిల్స్ ను ప్రైమ్ వీడియో అందిస్తోంది.
దక్షిణాది సినిమాలకు, వెబ్ సిరీస్ లకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేస్తారు. ముఖ్యంగా థ్రిల్లర్, సస్పెన్స్ డ్రామాలు తెలుగులో మంచి విజయాన్ని సాధిస్తాయి. 'ఎగ్జామ్' సిరీస్ లోని బలమైన నటీనటుల బృందం, పుష్కర్-గాయత్రి లాంటి అనుభవజ్ఞులైన నిర్మాతలు ఈ సిరీస్ ను మరో స్థాయికి తీసుకెళ్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే అంచనాలున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'ఎగ్జామ్' వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదల కానుంది?
జవాబు: ఈ సిరీస్ మే 15న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
ప్రశ్న: ఈ సిరీస్ ను ఎవరు నిర్మిస్తున్నారు?
జవాబు: పుష్కర్, గాయత్రి వాల్‌వాచర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సిరీస్ ను నిర్మించారు.
ప్రశ్న: 'ఎగ్జామ్' సిరీస్ ఏయే భాషల్లో అందుబాటులో ఉంటుంది?
జవాబు: ఈ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Chandu Shanigarapu

