Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Family electric car : ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ వేరియంట్లు, వాటి ధరలు, వాటి ఫీచర్లు..

Family electric car : ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ వేరియంట్లు, వాటి ధరలు, వాటి ఫీచర్లు..

భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. దినదినాభివృద్ధి చెందుతున్న ఈవీ విభాగంలో పెద్ద కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 'హెక్టర్ టోమాహాక్ ఈవీ'ని విపణిలోకి తీసుకొచ్చింది.

5-సీటర్, 7-సీటర్ లేఅవుట్లలో లభించే ఈ ప్రీమియం ఎస్‌యూవీని ఎక్సైట్ , ఎక్స్‌క్లూజివ్, ఎస్సెన్స్ అనే మూడు వేరియంట్లలో ఆవిష్కరించారు. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ.19.5 లక్షలుగా ఉన్నప్పటికీ, ఎంజీ ప్రత్యేకంగా అందిస్తున్న 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) పథకం ద్వారా ప్రారంభ ధర ఏకంగా రూ.13.99 లక్షలకే అందుబాటులోకి రావడం విశేషం.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం లేదా తిరుపతి వైపు సుదీర్ఘ ప్రయాణాలు చేసే తెలుగు రాష్ట్రాల వాహనదారులకు ఛార్జింగ్ భయాలు లేకుండా 517 కిలోమీటర్ల రేంజ్ సామర్థ్యంతో ఈ వాహనాన్ని రూపొందించారు.

రూ.4.9 అద్దెతో బ్యాటరీ స్కీమ్!

ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు వ్యయాన్ని తగ్గించేందుకు ఎంజీ 'బీఏఏఎస్' నమూనాను అమలు చేస్తోంది. ఈ విధానంలో ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ బ్యాటరీ మినహాయించి వాహనాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రయాణించే ప్రతి కిలోమీటర్‌కు రూ.4.9 చొప్పున మాత్రమే బ్యాటరీ రెంటల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్ కింద 7-సీటర్ ఎక్సైట్ వేరియంట్ ధర రూ.13.99 లక్షలు కాగా, నార్మల్ కొనుగోలు ధర రూ.19.5 లక్షలుగా నిర్ణయించారు. ఎక్స్‌క్లూజివ్ 7-సీటర్ మోడల్ బీఏఏఎస్ కింద రూ.15.99 లక్షలు (నార్మల్ ధర రూ.22 లక్షలు) లభిస్తుంది. ఇక టాప్ వేరియంట్ ఎస్సెన్స్ 5-సీటర్ బీఏఏఎస్ ధర రూ.16.99 లక్షలు (నార్మల్ రూ.23 లక్షలు), 7-సీటర్ మోడల్ బీఏఏఎస్ ధర రూ.17.49 లక్షలు (నార్మల్ రూ.23.5 లక్షలు)గా ఉన్నాయి.

69.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్.. 517 కిలోమీటర్ల రేంజ్!

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, అన్ని వేరియంట్లలోనూ 69.2 kWh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఫ్రంట్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 204 బీహెచ్​పీ పవర్, 310 ఎన్​ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిమిషానికి 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8.2 సెకన్లలో అందుకోగలదు.

సింగిల్ ఛార్జింగ్‌పై ఎంఐడీసీ సర్టిఫై చేసిన 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 90 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 35 నిమిషాల్లో 30 నుంచి 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఇంట్లో వాడే 7.4 kW ఏసీ ఛార్జర్ వాడితే 10 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 12.5 గంటల సమయం పడుతుంది.

ఎక్సైట్ : రూ.19.5 లక్షలు (నార్మల్) / రూ.13.99 లక్షలు (బీఏఏఎస్)

బేస్ వేరియంట్ అయిన ఎక్సైట్‌లోనే ఎంజీ పలు కీలక భద్రతా, కంఫర్ట్ ఫీచర్లను అందించింది.

  • 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్​ విత్ ఈబీడీ, ఈఎస్​పీ, ట్రాక్షన్ కంట్రోల్
  • ఆల్-ఫోర్ డిస్క్ బ్రేక్స్, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా
  • 12.8-ఇంచుల టచ్‌స్క్రీన్, 8.8-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే
  • వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఏఐ వాయిస్ అసిస్టెంట్
  • ల్యాదరెట్ సీట్లు, 'ప్రో పెట్' మోడ్, ఎకో/నార్మల్/స్పోర్ట్స్/కస్టమ్ డ్రైవ్ మోడ్‌లు
  • 18-ఇంచుల అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్, ఇల్యూమినేటెడ్ ఎంజీ లోగో

ఎక్స్‌క్లూజివ్ : రూ.22 లక్షలు (నార్మల్) / రూ.15.99 లక్షలు (బీఏఏఎస్)

ఎంజీ హెక్టర్ టోమాహాక్ ఈవీ ఎక్సైట్ ఫీచర్లకు అదనంగా ప్రయాణంలో మరింత లగ్జరీ అనుభూతిని ఇచ్చే ఫీచర్లను ఇందులో చేర్చారు.

ట్రాన్స్‌పరెంట్ ఛాసిస్ వ్యూతో కూడిన 360-డిగ్రీ కెమెరా

పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు

50డబ్ల్యూ కూల్డ్ వైర్‌లెస్ ఛార్జర్, బ్లూ యాంబియంట్ లైటింగ్

ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, పవర్డ్ టెయిల్‌గేట్

ఎస్సెన్స్ : రూ.23 లక్షలు (5-సీటర్) / రూ.23.5 లక్షలు (7-సీటర్)

అధునాతన టెక్నాలజీ ప్రియుల కోసం ఈ టాప్ మోడల్‌ను తీర్చిదిద్దారు.

లెవెల్-2 అడాస్ , అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్

15.6-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్

10-స్పీకర్ల ఇన్‌ఫినిటీ సౌండ్ సిస్టమ్, 256-కలర్ యాంబియంట్ లైటింగ్

డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్

వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్), వెహికల్-టు-వెహికల్ (వీ2వీ), వెహికల్-టు-హోమ్ (వీ2హెచ్) ఛార్జింగ్ సపోర్ట్

రెడ్ బ్రేక్ కాలిపర్స్, వెనుక కిటికీలకు సన్‌షేడ్స్.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu