Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
GT vs RR : వైభవ్ సూర్యవంశీని​ ఔట్​ చేస్తే ఫైనల్​కే! గిల్​ వ్యూహం ఏంటి? నేడే ఐపీఎల్​ 2026 క్వాలిఫైయర్ 2

GT vs RR : వైభవ్ సూర్యవంశీని​ ఔట్​ చేస్తే ఫైనల్​కే! గిల్​ వ్యూహం ఏంటి? నేడే ఐపీఎల్​ 2026 క్వాలిఫైయర్ 2

IPL 2026 qualifier 2 : ఐపీఎల్​ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026 ఎడిషన్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చండీగఢ్​ వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్​ మధ్య క్వాలిఫైయర్​ 2 జరగనుంది.

ఇందులో గెలిచిన జట్టు ఆదివారం జరగనున్న ఫైనల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్​లో అందరి చూపు యంగ్​ గన్ వైభవ్​ సూర్యవంశీపైనే ఉంది. బుధవారం ఎస్​ఆర్​హెచ్​తో జరిగిన మ్యాచ్​లో ఈ 15ఏళ్ల బుడ్డోడి బ్యాటింగ్​కి అందరు ఫిదా అయిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ కీలక మ్యాచ్​ వెదర్​ రిపోర్టు, పిచ్​ రిపోర్టు, ఇరు జట్ల స్టాట్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

ఐపీఎల్​ 2026 క్వాలిఫైయర్​ 2- ఎప్పుడు? ఎక్కడ?

చంఢీగఢ్​లోని మహారాజ యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జీటీ వర్సెస్​ ఆర్​ఆర్​ మధ్య క్వాలిఫైయర్-2 జరగనుంది. జియో హాట్​స్టార్​లో లైవ్​ చూడవచ్చు.

ఐపీఎల్​ 2026 క్వాలిఫైయర్ 2- వెదర్​ రిపోర్టు ఏంటి?

చండీగఢ్​లో వాతావరణం వేడిగా ఉండనుంది. కానీ మధ్యాహ్నం నాటికి స్వల్పంగా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మ్యాచ్​ నాటికి పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు అని వెదర్​ రిపోర్టు సూచిస్తోంది.

ఐపీఎల్​ 2026 క్వాలిఫైయర్ 2- పిచ్​ రిపోర్టు ఏంటి?

జీటీ వర్సెస్​ ఆర్​ఆర్​ మ్యాచ్​ జరిగే ఈ పిచ్​ బౌన్స్​కి, పేస్​కి సహకరించవచ్చు. పిచ్​పై స్వల్పంగా ఉన్న గడ్డి వల్ల బౌలర్లకు అధిక పేస్​ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ బాల్ పాతదయ్యే కొద్ది బ్యాటర్లు విజృంభించే అవకాశం ఉంది.

ఐపీఎల్​ 2026 క్వాలిఫైయర్ 2- జీటీ వర్సెస్​ ఆర్​ఆర్​ స్టాట్స్..

గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇప్పటివరకు 10 మ్యాచులు జరిగాయి. వీటిల్లో జీటీ 7సార్లు, ఆర్​ఆర్​ 3సార్లు గెలిచాయి. అయితే గత 4 మ్యాచుల్లో మాత్రం రెండు జట్లు 2-2 విజయాలతో సమానంగా ఉన్నాయి.

ఐపీఎల్​ 2026 క్వాలిఫైయర్ 2- వైభవ్​ సూర్యవంశీని ఆపితే చాలు!

ఎలిమినేటర్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై 97 రన్స్​ చేసి రాజస్థాన్ రాయల్స్​ గెలుపునకు బాట వేసిన వైభవ్​ సూర్యవంశీపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది! 15ఏళ్ల పిల్లోడిని కట్టడి చేయడంలో ఎస్​ఆర్​హెచ్​ బౌలర్లు డీలా పడ్డారు. మరి గుజరాత్​ టైటాన్స్​ ఏం చేస్తుందో? అతడిని ఎలా ఔట్​ చేస్తుందో? ఎలాంటి వ్యూహం రచిస్తోందో? అన్న ఆసక్తి నెలకొంది. పరిస్థితి ఎలా ఉందంటే.. వైభవ్​ సూర్యవంశీని త్వరగా ఔట్​ చేస్తే చాలు గుజరాత్​ టైటాన్స్ ఐపీఎల్​ 2026 ఫైనల్​కి వెళ్లిపోతుంది అని క్రికెట్​ అభిమానులు భావిస్తున్నారు.

అయితే, సూర్యవంశీ ఒక్కడే కాదు.. పేసర్​ జోఫ్రా ఆర్చర్​ సైతం జట్టు గెలుపుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్​, వికెట్లతోనే కాదు.. అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాటింగ్​తోనూ సత్తా చాటుతున్నాడు.

అటు గుజరాత్​ టైటాన్స్ పేపర్​ మీద చూసుకుంటే పటిష్టంగానే ఉంది. టాప్​-3 బ్యాటర్లు బీభత్సమైన ఫామ్​లో ఉన్నారు. సిరాజ్, రబాడా, రషీద్​లతో బౌలింగ్​ యూనిట్​ సైతం బలంగానే ఉంది.

అయితే, గుజరాత్​ టైటాన్స్..​ టాప్​-3 బ్యాటర్ల మీదే అధికంగా డిపెండ్​ అవుతోంది! ఈ లీగ్​లో ఈ జట్టు సాధించిన స్కోర్​లో సాయి సుదర్శన్, శుభ్​మాన్​ గిల్​, జాస్​ బట్లర్​ల వాటానే దాదాపు 70శాతం వరకు ఉంటుంది! వీరు త్వరగా ఔట్​ అయితే, ఇక జీటీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టు. మిడిల్​ ఆర్డర్​ రాణించడమే లేదు. ఆర్సీబీతో జరిగిన క్వాలిఫైయర్ 1లో ఇది స్పష్టంగా కనిపించింది.

మరీ ముఖ్యంగా గిల్​పై ఆర్చర్​కి మంచి రికార్డే ఉంది. 7 టీ20 ఇన్నింగ్స్​ల్లో గిల్​ని ఆర్చర్​ మూడుసార్లు ఔట్​ చేశాడు. అతనిపై గిల్​ స్ట్రైక్​ రేట్​ 120గా ఉంది. యావరేజ్ కేవలం 7.2! ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి జరగనున్న క్వాలిఫైయర్​ 2లో వీరి మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.

ఐపీఎల్​ 2026 క్వాలిఫైయర్ 2- జీటీ వర్సెస్​ ఆర్​ఆర్​ జట్లు (అంచనా)..

రాజస్థాన్ రాయల్స్- యశస్వీ జైస్వాల్, వైభవ్​ సూర్యవంశీ, ధ్రువ్​ జురేల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), దొనొవాన్ ఫెర్రెరా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, యష్ రాజ్ పుంజ, బ్రిజేష్ శర్మ, సుశాంత్​ మిశ్రా/ తుషార్ దేశ్​పాండే/ రవి బిష్ణోయి.

గుజరాత్ టైటాన్స్- సాయి సుదర్శన్, శుభ్​మాన్ గిల్ (కెప్టెన్), జాస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, రాహుల్​ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్/ సాయి కిషోర్, కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu