Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అత్తింట్లో శ్రుతి గంటల పంచాయతీ పెడుతుంది. నిద్ర పోయే టైమ్ కాకుండా మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి ఎంత టైమ్ స్పెండ్ చేస్తారు అని శ్రుతి అడుగుతుంది.
దాంతో 9 గంటలు అని మనోజ్, రోహిణి చెబుతారు.
బ్రహ్మ రాక్షసి అన్న రవి
మీనా, బాలును అడిగితే.. పది గంటలు అని చెబుతుంది. దాంతో వినపడిందా, వాళ్లు దాదాపుగా రోజు మొత్తంగా కలిసి ఉంటున్నారని శ్రుతి గొడవ చేస్తుంది. ఇప్పుడు ఏమైంది రవి అని మీనా అడిగితే.. తను డబ్బింగ్ చెప్పిన సీరియల్ ప్రభావం, అందులో ఒకావిడ సరిగా కలిసి ఉండట్లేదని విడాకులు తీసుకుందట. మనం కూడా అలా అవుతావేమో అని నా మీద పడింది బ్రహ్మ రాక్షసి అని రవి అంటాడు.
మసులో ప్రేమ ఉంటే ఎంతసేపు కలిసి ఉన్నా ఏం కాదని మీనా అంటుంది. అది ఈ నైటీలోడికి లేదని, మాట్లాడితే నీ తూ.. అంటాడని శ్రుతి అంటుంది. అందుకే అందరం కలిసి హనీమూన్ టూర్‌లాగా మలేషియా వెళ్దాం అన్నాను అని బాలు టైమ్ చూసి కొడతాడు. దాంతో కరెక్ట్, మనం కూడా వెళ్దామని శ్రుతి అంటుంది. రవి కుదరదంటాడు. దాంతో తిట్టిన శ్రుతి మలేషియా రెసిపీ నేర్చుకుని వస్తానని చెప్పి రా అని శ్రుతి ఐడియా ఇస్తుంది.
దాంతో రవి సైలెంట్ అవుతాడు. శ్రుతి ట్రిప్‌కు రెడీ అవడంతో రోహిణి మరింత భయపడుతుంది. తర్వాత రవి, శ్రుతి కూడా వస్తానన్నారు. మనం అబద్ధం ఆడుతున్నామని తెలిస్తే ఎలా అని మీనా అంటుంది. మనం వెళ్లకుండా పార్లరమ్మా కచ్చితంగా ఏదో ప్లాన్ వేస్తుంది. చూడు. మనం వెళ్లకున్నా రవి, శ్రుతి హనీమూన్ వెళ్తారు. వాళ్లకు మంచి టైమ్ పాస్ అవుతుందని బాలు అంటాడు.
మీనా హనీమూన్ కోరిక
నాకు కూడా పచ్చని తోటలు చూస్తూ హనీమూన్ వెళ్లలాని ఉందని మీనా అంటుంది. ఈ సమస్యలన్నీ పోయాక మనం హనీమూన్‌కు వెళ్దామని బాలు అంటాడు. మరోవైపు విద్యకు మలేషియా టూర్ గురించి రోహిణి చెబుతుంది. ఇక నీ కథ క్లైమాక్స్‌కు వచ్చినట్లే. సింగపూర్, మలేషియా అని చెప్పొద్దే అన్నా. అవే ఇప్పుడు నీ మెడకు సమస్యల్లా చుట్టుకున్నాయని విద్య అంటుంది. నాన్న జైల్లో ఉన్నాడంటే ఏ గొడవ ఉండదనుకున్నా. కానీ, ఇప్పుడు నేనే జైళ్లో కూర్చొనే పరిస్థితి వచ్చిందని రోహిణి అంటుంది.
నీ భయం చూస్తుంటే క్రైమ్ థ్రిల్లర్ సీరియల్‌లా ఉందని, ఈ సమయంలో కాళ్ల మీద పడి నిజం చెప్పేసేయ్ అని విద్య అంటుంది. కల్పన విషయంలో నిన్ను మీ అత్త కొట్టింది కదా అని విద్య గుర్తు చేస్తే.. అవును ఆరోజు మిస్ అయింది కానీ దెబ్బ మాత్రం మర్చిపోలేదు. ఒకరోజు ఆవిడ సంగతి కూడా చూస్తాను అని అత్త ప్రభావతిపై పగ తీర్చుకుంటానని చెబుతుంది రోహిణి. ముందు నీ సంగతి చూసుకో. తర్వాత విలన్ అవుదువు అని విద్య అంటుంది.
ఈ సమస్యకు ఐడియా వచ్చింది. ముందు మటన్ కొట్టు మాణిక్యాన్ని పిలువు అని రోహిణి చెబుతుంది. కట్ చేస్తే మటన్ కొట్టు మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు. రోహిణిని చూసి మాణిక్యం పారిపోతానంటాడు. రోహిణిని చూస్తే క్రిమినల్ అవుతానని అయిపోతానని అనిపిస్తుందని భయపడతాడు. ఒకసారి నేను చెప్పింది వినండి అని ఒక ప్లాన్ చెబుతుంది రోహిణి. అదంతా విన్న మాణిక్యం చేయలేనంటాడు. దయచేసి హెల్ప్ పేయమని రోహిణి ఎమోషనల్‌గా కన్నీళ్లు పెట్టుకుని డ్రామా చేస్తుంది.
సత్యం ఇంటికి కానిస్టేబుల్
సరే చూస్తే జాలేస్తుంది. ఈ ఒక్కసారికి చేస్తాను అని మాణిక్యం వెళ్లిపోతాడు. మరోవైపు సత్యం ఇంటికి కానిస్టేబుల్ వస్తాడు. అతన్ని చూస్తూ మనోజ్ భయపడిపోయి అందరిని పిలుస్తాడు. తానేం చేయలేదంటాడు. పోలీసులు వచ్చారంటే అది బాలుకోసమే అని ప్రభావతి మళ్లీ తన బుద్ధి చూపిస్తుంది. నీ మీదే కంప్లైంట్ ఇచ్చాను. నోరు అదుపులో పెట్టుకోవట్లేదని బాలు కౌంటర్ ఇస్తాడు. పాస్‌పోర్ట్ అప్లై చేశారుగా అని కానిస్టేబుల్ చెప్పడంతో వెరిఫికేషన్ కోసం అనుకుంటా అని రవి అంటాడు.
అందరూ ఒకేసారి అప్లై చేశారేంటీ, ఏదైనా ఫ్రాడ్ చేశారా అని కానిస్టేబుల్ అడుగుతాడు. మలేషియా టూర్ వెళ్తున్నామని, రోహిణి వాళ్ల నాన్న అక్కడ ఉంటారని చెబుతారు. పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఏం లేవని చెబుతారు. అంతలోనే మటన్ కొట్టు మాణిక్యం సత్యం ఇంటికి వస్తాడు. పోలీస్‌ను చూసి మాణిక్యం భయపడిపోతాడు. తర్వాత నేను వెళ్లి క్లియరెన్స్ ఇస్తానని కానిస్టేబుల్ వెళ్లిపోతాడు.
రోహిణి వాళ్ల నాన్న చనిపోయాడని, అస్థికలు తెచ్చానని చూపిస్తాడు మటన్ కొట్టు మాణిక్యం. మీ నాన్నను జైళ్లో అతి క్రూరంగా కక్ష్య కట్టి చంపేశారమ్మా అని మాణిక్యం చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. నాన్న అంటూ అరిచి రోహిణి కిందపడిపోతుంది. నీళ్లు కొట్టి లేపుతారు. రోహిణి ఏడుస్తుంది. రోహిణి వాళ్ల నాన్న శత్రువులు జైళ్లో ఉన్నారని, మర్డర్ అనే విషయం బయటకు రాకుండా హార్ట్ ఎటాక్ అని చెప్పి చంపారు. నన్ను పిలిచి అస్థికలు చేతిలో పెట్టారని మాణిక్యం అంటాడు.
కోర్టులో ఆస్తి కేసు
ఆస్తుల లెక్క తేల్చకుండానే పోయాడా అని ప్రభావతి ఫీల్ అవుతుంది. నువ్వు మనోజ్ వెళ్లాలేమో అని సత్యం అంటాడు. నేను మీరు కూడా వెళ్లాలండి, వాళ్ల పార్టనర్లతో మాట్లాడి రోహిణి వారసురాలు కాబట్టి ఆస్తులు రాయించుకుని తీసుకురావాలి అని ప్రభావతి అంటుంది. ఛీ.. నీ ఆస్తి తగిలెయ్య, నీ వల్లే కదా లేని నాన్నను చంపేశాను అని రోహిణి అనుకుంటుంది. మాణిక్యంకు సైగ చేస్తుంది.
ఆపండి. అస్థికలు ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఏం చేస్తారు. ఆస్తి కోసమే ఆయన్ను అక్కడ చంపేశారు. మీరు వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు. రోహిణిని చంపేస్తారు అని మాణిక్యం అంటుంది. దాంతో కోపంగా ఆస్తులు రావా అని మాణిక్యం కాలర్ పట్టుకుని నిలదీస్తుంది ప్రభావతి. చంపేస్తానని తిడుతుంది. ప్రభావతి భయంతో ఆస్తులు వస్తాయి. కోర్టులో కేసులు వేశాం అని మాణిక్యం అంటాడు. కేసు ఎప్పుడు గెలుస్తామని ప్రభావతి అంటుంది.
ఎహే ఆపండి అత్తయ్య. మీదో గోల. నాన్న పోయాడని నేను ఏడుస్తుంటే ఆస్తి కోసం అడుగుతారని. పోతే పోయాయి ఆస్తులు అని రోహిణ అత్తపై తిరగబడుతుంది. ఆస్తులు వస్తాయనుకుంటే బూడిద వచ్చిందని ప్రభావతి కూడా రివర్స్ అవుతుంది. రోహిణి ఏడుస్తుంటే మనోజ్ ఓదారుస్తాడు. అస్థికలు ఇక్కడ గోదావరిలో కలపాలని, అది ఆయన చివరి కోరిక అని మాణిక్యం చెబుతాడు. మనం మలేషియా వెళ్లట్లేదురా. టూర్ క్యాన్సిల్ అని సత్యం అంటాడు.
రోహిణి కన్నీళ్ల డ్రామా
రోహిణి సంతోషిస్తుంది. బాలు, మీనా చూసుకుంటారు. ఇక నా పాత్ర ముగిసిపోయిందని మాణిక్యం వెళ్లిపోతాడు. అయ్యో అమ్మా నీ నోట్లో బూడిద కొట్టారే అమ్మా. మలేషియా పేరు ఎత్తకుండా నాటకం ఆడారే అమ్మా. అదే విధి ఆడిన వింత నాటకమే అమ్మా అని బాలు డ్రామా చేస్తాడు. మరోవైపు రోహిణి ఏడుస్తుంటే తనకు తండ్రిలా చూసుకుంటానని చెబుతాడు మనోజ్. ఏం జరిగినా నీకు తనతో ఉంటానని అంటాడు.
ఫోన్ కాల్ రావడంతో మనోజ్ వెళ్లిపోతాడు. రోహిణికి విద్య కాల్ చేసి ఏమైందని అడిగితే.. మలేషియా టూర్ ప్లాన్ క్యాన్సిల్ చేశారని చెబుతుంది. నీ కథలు రోజు రోజు డేంజరస్ అవుతున్నాయి. ఆస్తులు కోర్టు కేసులో ఉన్నాయని చెప్పావంటే నీ అబద్ధాలకు లైఫ్ లాంగ్ టైమ్ ఉందన్నట్లే అని విద్య అంటుంది. ఆ బాలు, మీనా చేతిలో పడకుంటే చాలని రోహిణి అనుకుంటుంది.
మరోవైపు రాత్రి రోహిణి తండ్రి గురించి బాలు, మీనా మాట్లాడుకుంటారు. విధిరాత అని మీనా అంటే.. లేదు రోహిణియే తండ్రిని చంపేసింది. నమ్మాలో వద్దో అని డౌట్ పడతాడు. జైళ్లో చనిపోతే ముందు ఇంట్లోవాళ్లకు చెబుతారు. హత్య జరిగితే ఆఫీసర్ల ఉద్యోగాలు పోతాయి. వాళ్లే అన్ని చేసి బూడిద పంపిస్తారా. అక్కడ చట్టాలు తెలియదని పార్లరమ్మా ఏది చెప్పిన నమ్మాల్సి వస్తుంది. పార్లరమ్మా చాలా తెలివిగా ఫ్రాడ్ చేస్తుంది. ఒకదానికోటి కథలు అల్లుతుంది అని బాలు అంటాడు.
రహస్యం బయటపెడతా..
రోహిణి చెప్పిన వాటన్నింటి గురించి చెబుతాడు బాలు. మీనా కూడా నిజమే అంటుంది. ఈసారి తెలివిగా పార్లరమ్మా రహస్యాన్ని బయటపెట్టాలి అని బాలు అంటాడు. సరే పాలు తాగి పడుకోండని మీనా అంటే.. ఊరికే ఎలా పడుకుంటాను. దగ్గరికి రా అని బాలు అంటాడు. మరుసటి రోజు ఉదయం రోహిణి తండ్రి చనిపోయిన విషయం గురించి కామాక్షి, ప్రభావతి మాట్లాడుకుంటారు.
కోర్టులో ఆస్తులు అంటే జరిగే పనులు కాదు. రోహిణి ఆస్తి మీద ఆశలు పెట్టుకోకు అని కామాక్షి చెబుతుంది. మరోవైపు మీనా ఇంటికి చింతామణి వస్తుంది. మీనా జీవితం మలుపు తిప్పే పునాది వేయబోతున్నాను. మీనా అత్తగారిని నా గ్రిప్‌లోకి తెచ్చుకోబోతున్నాను అని చింతామణి అంటుంది. వెళ్లి ప్రభావతిని కలుస్తుంది చింతామణి.
ప్రభావతి నాట్యం గురించి గొప్పగా చెబుతుంది. చింతామణే నాట్యం నేర్చుకుంటానని చెబుతుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

