దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్.. భారతీయ కస్టమర్ల కోసం మే 2026 నెలకు సంబంధించి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. తన పోర్ట్‌ఫోలియోలోని వివిధ మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్ రూపంలో ఏకంగా రూ.
1,05,000 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీ..
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్యూవీ 'క్రెటా'పై ఈ నెలలో అత్యధికంగా రూ. 1.05 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఈ కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది:
1.5ఎల్ పెట్రోల్ (113 బీహెచ్పీ, 148 ఎన్ఎం)
1.5ఎల్ టర్బో పెట్రోల్ (158 బీహెచ్పీ, 253 ఎన్ఎం)
1.5ఎల్ టర్బో డీజిల్ (114 బీహెచ్పీ, 250 ఎన్ఎం)
సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుతున్న క్రెటాపై ఇంత భారీ డిస్కౌంట్ రావడం ఇదే మొదటిసారి కావచ్చు.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్..
హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ కారు అయిన గ్రాండ్ i10 నియోస్‌పై ఈ నెలలో రూ. 80,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్, స్విఫ్ట్ వంటి కార్లకు గట్టి పోటీనిచ్చే ఈ హ్యాచ్‌బ్యాక్, 1.2లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 81.8 బీహెచ్పీ పవర్‌ని, 113.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హ్యుందాయ్ ఐ20..
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో పేరున్న ఐ20 కారుపై మే నెలలో రూ. 65,000 వరకు తగ్గింపు లభిస్తోంది. టాటా ఆల్ట్రోజ్, మారుతీ సుజుకీ బాలెనోలకు పోటీగా నిలిచే ఈ కారులో 1.2లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఐవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
హ్యుందాయ్ వెర్నా..
సెడాన్ ప్రియుల కోసం హ్యుందాయ్ వెర్నాపై ₹55,000 వరకు బెనిఫిట్స్ ప్రకటించింది. హోండా సిటీ, వోక్స్‌వ్యాగన్ విర్టస్ వంటి కార్లతో పోటీపడే వెర్నా, పవర్ ఫుల్ 1.5లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (158 బీహెచ్పీ) ఆప్షన్‌తో కూడా వస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్..
మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్‌లో టాటా పంచ్‌కు గట్టి పోటీనిస్తున్న 'ఎక్స్టర్'పై రూ. 40,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. 1.2లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడిచే ఈ కారు సిటీ డ్రైవింగ్‌కు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
మీరు కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉంటే, ఈ మే నెల ఆఫర్లు మీ జేబుకు భారీగా ఆదాను ఇస్తాయి. మరిన్ని వివరాల కోసం మీకు దగ్గరలోని హ్యుందాయ్ షోరూమ్‌ను సంప్రదించవచ్చు.
Chitturi Eswara Karthikeya Sharath

