Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IGNOU Admissions 2026 : ఇగ్నోలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు - దరఖాస్తు గడువు పొడిగింపు

IGNOU Admissions 2026 : ఇగ్నోలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు - దరఖాస్తు గడువు పొడిగింపు

IGNOU July 2026 Admissions : దూర విద్యలో ఉన్నత చదువులు చదవాలనుకునే అభ్యర్థులకు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జులై 2026 అడ్మిషన్ సైకిల్ పరిధిలోని పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. డిగ్రీ, పీజీతో పాటు వివిధ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు సెప్టెంబర్ 15, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇగ్నో అధికారిక అడ్మిషన్ పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఈ పెంచిన దరఖాస్తు గడువు కేవలం యూజీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులకు మాత్రమే వర్తిస్తుంది. సర్టిఫికేట్ ప్రోగ్రాములకు ఈ గడువు పెంపు వర్తించదు.

  • బ్యాచిలర్ డిగ్రీలు : బీఏ , బీకాం, బీసీఏ , బీబీఏ మొదలైన డిగ్రీ కోర్సులు.
  • మాస్టర్ డిగ్రీలు : ఎంఏ, ఎంకాం , ఎంసీఏ, ఎంబీఏ , ఎంఎస్సీ (MSc) తదితర పీజీ కోర్సులు.
  • పీజీ డిప్లొమా కోర్సులు : విభిన్న స్పెషలైజేషన్లలో అందుబాటులో ఉన్న పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లు.
  • డిప్లొమా కోర్సులు : పలు రకాల వృత్తి నైపుణ్యం ఆధారిత డిప్లొమా కోర్సులు.

దరఖాస్తు విధానం….

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ఇగ్నో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు అభ్యర్థులు తమ APAAR ID ని సిద్ధంగా ఉంచుకోవాలని ఇగ్నో సూచించింది.

  • మొదట ఇగ్నో అధికారిక అడ్మిషన్ పోర్టల్ ignouadmission.samarth.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • ఆన్‌లైన్ పోర్టల్‌లో కొత్తగా రిజిస్టర్ చేసుకుని, మీరు చేరాలనుకుంటున్న కోర్సు, యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ మొదలైన ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.
  • వివరాలు నమోదు చేశాక 'SUBMIT' బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌కు అడ్మిషన్ లాగిన్ వివరాలు వస్తాయి.
  • ఆ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లతో పోర్టల్‌లోకి లాగిన్ అయి దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత, విద్యా సంబంధిత సమాచారాన్ని నింపాలి.
  • విశ్వవిద్యాలయం సూచించిన ఫార్మాట్ మరియు సైజులో ఫొటో, సంతకం, కేటగిరీ సర్టిఫికేట్, గుర్తింపు కార్డ్ (ఫొటో ఐడీ) తదితర ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • అధికారికంగా అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్ మోడ్స్ (నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్) ద్వారా నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి.
  • అప్లికేషన్‌ను ఫైనల్ సబ్మిట్ చేసేముందు 'Preview' ఆప్షన్ ద్వారా మీరు నమోదు చేసిన ప్రతీ వివరాలు కచ్చితంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
  • దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తు కాపీని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసి భద్రపరుచుకోవాలి.

దరఖాస్తు సమయంలో నమోదు చేసే వివరాల పట్ల అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఇగ్నో స్పష్టం చేసింది. ఒక్కసారి చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ రీఫండ్ చేయరు. కాబట్టి దరఖాస్తు సబ్మిట్ చేసే ముందే ధ్రువపత్రాలు, వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడం ఉత్తమం. ఈ ఆన్‌లైన్ కోర్సుల ప్రవేశాలకు 2026 సెప్టెంబర్ 15ను చివరి తేదీగా నిర్ణయించారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఇగ్నో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu