ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మంచి ఆదరణతో దూసుకుపోతోంది. టాప్ సీరియల్స్ లో ఒకటిగా సాగిపోతోంది.
స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో ఓ హీరోయిన్ గా అన్షు రెడ్డి నటిస్తోంది. సీరియల్ లో నర్మద క్యారెక్టర్ చేస్తున్న అన్షు.. ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. కానీ బయట మాత్రం షార్ట్ లో హల్ చల్ చేస్తోంది.
అన్షు రెడ్డి పోజులు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ ప్లే చేసే అన్షు రెడ్డి ఇవాళ (జూన్ 2) సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. బ్లాక్ షర్ట్ లో, డెనిమ్ షార్ట్ లో పొట్టి బట్టలతో అన్షు దర్శనమిచ్చింది. ''ఉన్నది ఒకటే జిందగీ'' అనే క్యాప్షన్ తో ఈ బీచ్ ఫొటోలను అన్షు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
అక్కడ చీరలో.. ఇక్కడ షార్ట్ లో
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్లో అన్షు ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. ప్రేమ క్యారెక్టర్ చేసే మరో హీరోయిన్ చుడీదార్లు వేసుకుంటుంది కానీ అన్షు మాత్రం చీరకట్టులోనే నిండుగా, పద్ధతిగా కనిపిస్తుంది. రామరాజు నడిపి కోడలుగా సంప్రదాయబద్ధమైన క్యారెక్టర్ ను కంటిన్యూ చేస్తోంది. కానీ బయట మాత్రం షార్ట్ లో కనిపించి షాకిచ్చింది. తనలో మరో యాంగిల్ కూడా ఉందని చెప్పకనే చెప్పింది.
ఫ్యాన్స్ రియాక్షన్
అన్షు రెడ్డి పోస్టుకు ఫ్యాన్స్ రియాక్టవుతున్నారు. లవ్, హార్ట్ ఎమోజీలు పెడుతున్నారు. కొందరేమో.. ''సూపర్ అక్క'', ''అన్షు అక్క వ్లాగ్స్ చేయండి'' అని కామెంట్లు పెట్టారు. ఇక ఒక యూజర్ ఏమో.. ''మీకు సారీ సే బాగుంటాయి'' అని కామెంట్ చేశారు. ఇక 'బ్యూటీఫుల్', 'గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నావ్'' అని పోస్టు చేశారు.
రామరాజు కోడలు
స్టార్ మాలో వస్తున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు రెండో కోడలు నర్మదగా అన్షు రెడ్డి నటిస్తోంది. రామరాజు కుటుంబ కథతో ఈ సీరియల్ సాగుతోంది. ఇందులో రామరాజుగా బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, అతని భార్య వేదవతిగా ఆమని నటిస్తున్నారు. ఇందులో రామరాజుకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. టీఆర్పీ రేటింగ్ లో ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది.
Chandu Shanigarapu

