Dailyhunt
Illu Illalu Pillalu May 2 Episode: శ్రీవల్లిని పగ తీర్చుకోమన్న భాగ్యం- ప్రేమ నగలు తాకట్టు- అది తెలిసి సేనాపతి ప్లాన్!

Illu Illalu Pillalu May 2 Episode: శ్రీవల్లిని పగ తీర్చుకోమన్న భాగ్యం- ప్రేమ నగలు తాకట్టు- అది తెలిసి సేనాపతి ప్లాన్!

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్‌ను తన పుట్టింట్లో వదిలేసి రమ్మని ప్రేమ అంటుంది. నీకు నా మీద కోపం ిఉందని, అందుకే తల తుడవట్లేదని ప్రేమ అలుగుతుంది.

కోపం లేదని రాత్రే చెప్పాను కదే అని ధీరజ్ అంటాడు. అయినా ప్రేమ వినదు. తల నొప్పిగా ఉన్న నేనే తుడుచుకుంటాను అని కావాలనే నటిస్తుంది ప్రేమ.

డబ్బు కట్టి కారు తీసుకుంటాం

నేను తుడుస్తానే అంటూ ధీరజ్ బతిమిలాడుతాడు. కాసేపు ఆటపట్టించి తర్వాత ధీరజ్‌తో తన తల తుడుచుపించుకుంటుంది. ఇంతలో ధీరజ్‌కు ఒకతను కాల్ చేసి 20 వేలు కట్టి కారు బుక్ చేసుకున్నారుగా, కారు రెడీగా ఉందని, రేపటిలోగా డౌన్ పేమెంట్ కట్టి కారుతీసుకెళ్లకుంటే మీరు కట్టిన ప్రీ బుకింగ్ డబ్బు, కారు బుకింగ్ కూడా క్యాన్సిల్ అవుతుందని చెబుతాడు. అమౌంట్ అడ్జస్ట్ కాలేదు, క్యాన్సిల్ చేయండని ధీరజ్ అంటాడు.

ఒక్క నిమిషం ఉండరా అని ఫోన్ తీసుకున్న ప్రేమ బుకింగ్ క్యాన్సిల్ చేయొద్దు. రేపటిలోపు డబ్బు కట్టి కారు తీసుకుంటామని చెబుతుంది. నా ఫ్రెండ్స్ ఎవరిని అయినా అడిగి 2 లక్షలు తీసుకుంటానని ప్రేమ చెబుతుంది. కష్టాల్లో పడే ఎలాంటి రిస్క్ తీసుకోకు అని ధీరజ్ వెళ్లిపోతాడు. ఈ నగలు బ్యాంక్‌లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తాను. నువ్వు మాత్రం అందరిలో అవమానపడకూడదు. తలెత్తుకుని తిరగాలని ప్రేమ అనుకుంటుంది.

మరోవైపు ఇడ్లీ బాబాయ్ తనను తాను కొరడాతో కొట్టుకుంటాడు. అది చూసిన భాగ్యం ఎందుకు కొట్టుకుంటున్నావని అడుగుతుంది. బాడీని దెబ్బలకు రెడీ చేస్తున్నానని, శ్రీవల్లి తల్లి అని అబద్ధం చెప్పావ్. అది మాములు బాంబా అని ఇడ్లీ బాబాయ్ అంటాడు. నీ దిక్కుమాలిన ఏడుపు ఆపకుంటే నేనే నిన్ను కొల్లబొడుత్తాను అని భాగ్యం అంటుంది. ఇంతలో భాగ్యంకు శ్రీవల్లి కాల్ చేస్తుంది. భాగ్యం లిఫ్ట్ చేయడంతోనే బెల్ కొడుతుంది వల్లి.

పగ తీర్చుకోమన్నా భాగ్యం

తనకు మావయ్య రామరాజు ఈ బెల్ గిఫ్ట్‌గా ఇచ్చాడని, కాలు కింద పెట్టకుండా చూసుకోమ్మని ఆర్డర్ వేశారని శ్రీవల్లి చెబుతుంది. ఆ ప్రేమ, నర్మదలను ఆరేసుకునేందుకు ఆ బెల్ నీకు బ్రహ్మాస్త్రమే. వాళ్లతో ఆడుకోవాలిగా అని భాగ్యం అంటుంది. వాళ్లతో పెట్టుకుంటే మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తుందే అని శ్రీవల్లి అంటుంది. అలా అయితే నేను చూసుకుంటాగా. ఈగో రుణం అస్సలు ఉంచుకోకూడదని భాగ్యం అంటుంది.

నేను చూసుకుంటాను, చెలరేగిపో, ప్రేమ, నర్మదలపై పగ తీర్చుకో అని భాగ్యం అంటుంది. సరేనని శ్రీవల్లి అంటుంది. ఇంతలో చందు వచ్చి ఏం కావాలన్న మా అమ్మను అడుగు అంటాడు. ఎందుకు సలహాలు ఇవ్వడానికి మా అమ్మ ఉందిగా అని వల్లి అంటుంది. చందు చూడటంతో సరే బా, అత్తయ్యనే అడుగుతానంటుంది వల్లి. రైస్ మిల్లుకు వెళ్తున్నా. ఏమైనా తీసుకురావాలా అని చందు అడిగితే.. హల్వా తీసుకురా బా. ఐ లవ్యూ బా అని శ్రీవల్లి చెబుతుంది.

మరోవైపు బ్యాంక్‌కు వెళ్లిన ప్రేమ నగలు తాకట్టు పెడుతుంది. మీరు భద్రావతి మేనకోడలుగా, మీరు కోటీశ్వరులుగా. రెండు లక్షల కోసం నగలు తాకట్టు పెట్టడం ఏంటని బ్యాంక్ అతను అడుగుతాడు. నాకు మ్యారేజ్ అయింది, పర్సనల్ నీడ్స్ ఉన్నాయి, వెంటనే కావాలి, త్వరగా చూడమని చెబుతుంది ప్రేమ. పది నిమిషాలు పడుతుంది. బయట వెయిట్ చేయండని అతను అంటాడు. ప్రేమ బయటకు వెళ్లడంతో ఫోన్ తీస్తాడు బ్యాంక్ అతను.

2 రోజుల్లో బెయిల్

మరోవైపు లాయర్‌ను కలిసిన భద్రావతి తన మేనల్లుడిని బయటకు తీసుకురావడం గురించి ఆవేదనగా చెబుతుంది. రెండే రెండు రోజుల్లో మీవాడికి బెయిల్ తీసుకొస్తానని లాయర్ అంటాడు. సేనాపతి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతారు. ఇంతలో సేనాపతికి కాల్ చేసిన బ్యాంక్ అతను కాల్ చేసి మీ కూతురు నగలు తాకట్టు పెట్టేందుకు వచ్చిందని చెబుతాడు.

మేము హైదరాబాద్‌లో ఉన్నాం. వచ్చేసరికి రాత్రి అవుతుంది. మీరు ఎలాగైనా రేపటి వరకు వెయిట్ చేయించండి. రేపు బ్యాంక్‌కు రమ్మని చెప్పండి. మిగతాదంతా నేను చూసుకుంటాను అని సేనాపతి తన ప్లాన్ చెబుతాడు. అలాగే అని మేనేజర్ అంటాడు. ధీరజ్ గాడే ప్రేమను నగలు తాకట్టు పెట్టమని చెప్పి ఉంటాడు. ఒకేసారి ఈ అబ్బా కొడుకుల గొంతులు మన చేతికి దొరికాయిరా అని భద్రావతి అంటుంది.

మరోవైపు రెండు లక్షల కోసం ఫ్రెండ్స్‌ను అడుగుతాడు. ఫైనాన్స్ తీసుకోవచ్చు గానీ 10 రూపాయల వడ్డి అని వారు చెబుతారు. అంత వద్దనుకున్న ధీరజ్ ప్రేమకు కాల్ చేసి ఎక్కడున్నావని అడుగుతాడు. బ్యాంక్‌లో ఉన్నానని చెప్పిన ప్రేమ అయ్యో నోరు జారేసానా అనుకుంటుంది. బ్యాంక్‌కు ఎందుకు వెళ్లావని ధీరజ్ అడిగితే.. బ్యాంక్ పక్కనున్న మా ఫ్రెండ్ ఇంటికి, దాదాపు డబ్బు అరెంజ్ అయినట్లే అని ప్రేమ చెబుతుంది.

డబ్బు గురించి అడిగిన ధీరజ్

ఆ సంతోషంతో నువ్వు అక్కడే ఉండు. నేను పక్కనే ఉన్నా. వచ్చేస్తున్నా అని ధీరజ్ అంటాడు. దాంతో వెంటనే వెళ్లాలని ప్రేమ అనుకుంటుంది. బ్యాంక్ అతన్ని కలిసి అర్జంట్‌గా మనీ కావాలని ప్రేమ అడిగితే.. చాలా మంది డబ్బు కోసం వచ్చారు. మీరు రేపు ఉదయం రండి అని చెబుతాడు అతను. మళ్లీ ధీరజ్ కాల్ చేయడంతో సరే రేపు వస్తాను అని వెళ్లిపోతుంది ప్రేమ.

ధీరజ్‌ను ప్రేమ కలుస్తుంది. ఇక్కడ బ్యాంక్స్ తప్పా ఇళ్లు లేవుగా అని ధీరజ్ అంటాడు. నేను కేవలం ల్యాండ్ మార్క్ కోసం చెప్పాను అని ప్రేమ అంటుంది. మరి అమౌంట్ ఏమైందని ధీరజ్ అడిగితే.. ప్రేమ ఆలోచిస్తుంది. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu