Dailyhunt
Illu Illalu Pillalu May 5 Episode: మూర్ఖపు తండ్రి-రామరాజుపై నోరుజారిన సాగర్-5 లక్షలు కట్టి వెళ్లమన్న ధీరజ్-నర్మద సీరియస్

Illu Illalu Pillalu May 5 Episode: మూర్ఖపు తండ్రి-రామరాజుపై నోరుజారిన సాగర్-5 లక్షలు కట్టి వెళ్లమన్న ధీరజ్-నర్మద సీరియస్

Illu Illalu Pillalu May 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో వల్లిని ప్రేమ, నర్మద కలిసి ఓ ఆటాడుకుంటారు. ఇక సాగర్ ను రామరాజు రోడ్డు మీదే అవమానిస్తాడు.

దీంతో సాగర్ బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోతానంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 5 ఎపిసోడ్ లో చూద్దాం.

సాగర్ సీరియస్

మేం ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాం అమ్మ. నర్మద పదా అని సాగర్ అనగానే అందరూ షాక్ అవుతారు. మాట్లాడితే చాలు ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటావ్, ఏమైందిరా? అని వేదవతి అడుగుతుంది. ప్రతిసారి మీ ఆయనే నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నాడు. కన్నకొడుకు విషయంలో నడిరోడ్డు మీద ఆయన చేసిన ఘన కార్యం చెప్పలేదా అని సాగర్ సీరియస్ అవుతాడు.

మీరో గొప్ప తండ్రి

అప్పుడే రోడ్డుపై సాగర్ ను రామరాజు అన్న మాటలను తిరుపతి చెప్తాడు. ఎంత దారుణంగా మాట్లాడాడో అని సాగర్ అంటాడు. నేను మాట్లాడిన దాంట్లో తప్పేముందిరా? ఉన్న విషయమే కదా మాట్లాడానని రామరాజు అంటాడు. అయ్యా, రామరాజు గారు మీకో దండం. నాకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ ఓ స్థాయిలో ఉండాలని ఆ రోజు అలా మాట్లాడా. దొబ్బిపొడిచి మాట్లాడుతున్న మీరో గొప్ప తండ్రి అని సాగర్ గట్టిగా మాట్లాడతాడు.

మూర్ఖపు తండ్రి

నోర్మూసుకుని పదా అని నర్మద చేయి పట్టుకుని లాక్కెళ్తాడు సాగర్. వేదవతి అడ్డుకుంటుంది. ఆయనకు నేనంటే ఇష్టం లేదు. ఫస్ట్ జీతంతో బట్టలు తెస్తే తగలబెట్టేసిన బండరాయి ఈయన. సాటి ఉద్యోగుల ముందు అవమానించిన మూర్ఖపు తండ్రి అని సాగర్ నోరు జారతాడు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని రామరాజు వార్నింగ్ ఇస్తాడు.

నాన్న కోపం కూడా ప్రేమేరా అని చందు నచ్చజెప్పాలని చూస్తాడు. కానీ సాగర్ వినడు. రామరాజును మాటలు అంటూనే ఉంటాడు. నర్మద వస్తున్నావా? వెళ్లిపోమంటావా? అని సాగర్ అడుగుతాడు. నందనవనం లాంటి ఇల్లును మూడు ముక్కలు చేస్తావా? మాకు కడుపు కోత పెడతావా? అని వేదవతి ఫీల్ అవుతుంది.

రూ.5 లక్షలు కట్టి

వెళ్లిపోతే వెళ్లిపోని అమ్మ. రోజుకు నాలుగు సార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోతానని బెదిరిస్తున్నాడని ధీరజ్ షాక్ ఇస్తాడు. ఆ దేవుడు వచ్చి బతిమిలాడిన రానని సాగర్ అంటాడు. ఇంకా రెచ్చగొడుతున్నావేంటీ అని ధీరజ్ తో ప్రేమ అంటుంది. నాన్నకు ఇవ్వాల్సిన రూ.5 లక్షలు వడ్డితో సహా కట్టేసి వెళ్లిపో అని ధీరజ్ బాంబ్ పేలుస్తాడు.

టైమ్ ఇవ్వమని

రైస్ మిల్ లో నేను చాలా ఏళ్లు జీతం లేకుండా పనిచేశా. అవి లెక్కేస్తే రూ.5 లక్షల పైనే వస్తాయని సాగర్ అంటాడు. చిన్నప్పటి నుంచి నీ ఖర్చులు రూ.50 లక్షల పైనే ఉంటాయి, మరి అవి కడతావా నువ్వు అని ధీరజ్ కౌంటర్ వేస్తాడు. నాన్నకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వెళ్లిపో. నాన్న అంతే కదా అని ధీరజ్ అడిగితే.. అంతే అని రామరాజు అంటాడు. కచ్చితంగా కడతాను, నాకు టైమ్ ఇవ్వండని సాగర్ అడుగుతాడు.

ఇప్పుడే నిన్ను నమ్మట్లేదు. తర్వాత ఏ డబ్బు అన్నావంటే ఎలా అని రామరాజు అంటాడు. నువ్వు గుమ్మం దాటాలంటే ఇప్పుడు రూ.5 లక్షలు కట్టాల్సిందేనని ధీరజ్ అంటాడు. రూ.5 లక్షలు కట్టిన తర్వాతే వెళ్తానని సాగర్ లోపలికి వెళ్లిపోతాడు. అన్నయ్యను ఆపడం కోసమే డబ్బుల ప్రస్తావన తీసుకొచ్చానని ధీరజ్ చెప్తాడు.

భాగ్యం చేపల పులుసు

సీన్ భాగ్యం ఇంటికి మారుతుంది. భాగ్యం చేపల పులుసు చేస్తుంది. సూపర్ అంటూ ఇడ్లీ బాబాయ్ లాగించేస్తాడు. అప్పుడే తల్లికి శ్రీవల్లి కాల్ చేస్తుంది. నేను కడుపుతో ఉన్నా కదా గుడ్లు, పీతల కూర తినాలని ఉందని వల్లి చెప్తుంది. పంపిస్తానని భాగ్యం అంటుంది. ఇంట్లో జరిగిన గొడవ గురించి భాగ్యానికి వల్లి వివరంగా చెప్తుంది.

చందు ఫైర్

అమ్మడు నిజంగానే కడుపుతో ఉందని సంబరపడిపోతోంది. అది అబద్ధమని తెలిసిన రోజు తట్టుకోలేని బాధ పడుతుందని ఇడ్లీ బాబాయ్ ఫీల్ అవుతాడు. నేను ఏం చేసినా లోక కల్యాణం కోసమేనని భాగ్యం బిల్డప్ ఇస్తుంది. మరోవైపు ఇంట్లో గొడవను భాగ్యానికి చెప్పినందుకు వల్లిపై చందు సీరియస్ అవుతాడు.

నాన్న మాటలతో

గదిలోకి వెళ్లిన సాగర్ పై నర్మద సీరియస్ అవుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మా నాన్న చెప్పాడు కదా అని నర్మద అడుగుతుంది. మంచి సలహా ఇస్తే తప్పేంటని సాగర్ అంటాడు. కుటుంబం ముక్కలు కావడమేనా మంచి సలహా అని నర్మద ఫైర్ అవుతుంది. నా గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాడని తండ్రిపై సాగర్ మరోసారి మండిపడతాడు.

సాగర్ నువ్వు మా నాన్న మాటలకు ఇన్ ఫ్ల్యూయెన్స్ అయి గొడవలు పెడుతున్నావని నర్మద అంటుంది. ఈ మాటలను బయట నుంచి రఘురాం, వేదవతి, ధీరజ్, ప్రేమ వింటారు.

ధీరజ్ కు థ్యాంక్స్

గదిలో కూర్చుని ప్రేమ ఏడుస్తుంటుంది. ధీరజ్ కు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. నాకు దగ్గరైన వాళ్లు దూరమవుతారన్న ఆలోచనను నేను తట్టుకోలేను. నర్మద అక్క గుమ్మం దాటి వెళ్లిపోతుందేమోనన్న భయంతో గుండె వేగంగా కొట్టుకుంటుందని ప్రేమ అనడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu