Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై అభ్యంతరాలు ఉన్నాయా? ఇలా కంప్లైంట్ చేయండి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై అభ్యంతరాలు ఉన్నాయా? ఇలా కంప్లైంట్ చేయండి

తెలంగాణ హౌసింగ్ బోర్డు.. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్‌లో ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రా ద్వారా ఎంపికైన అర్హులైన లబ్ధిదారుల జాబితాపై ప్రజలు తమ అభ్యంతరాలను (Objections) తెలియజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది.

లాటరీ ద్వారా ఎంపికైన అభ్యర్థులలో ఎవరైనా అనర్హులు ఉన్నా, డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నా లేదా నిబంధనలు ఉల్లంఘించి ప్లాట్లు పొందినా, వారిపై అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని హౌసింగ్ బోర్డు తెలిపింది.

అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov.in పోర్టల్‌ను సందర్శించి, ఎంపికైన లబ్ధిదారుల వివరాల పక్కన ఉన్న 'Object' (అభ్యంతరం) ఆప్షన్‌పై క్లిక్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. అభ్యంతరాలను సమర్పించడానికి సెప్టెంబర్ 4 ను చివరి తేదీగా గృహనిర్మాణ మండలి వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా ఎంపికైన లబ్ధిదారుల పేరు, తండ్రి/భర్త పేరు, చిరునామా, ప్రాంతం, సెలక్షన్ స్టేటస్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతి లబ్ధిదారుని వివరాల పక్కన 'ఆబ్జెక్ట్' (object) అనే ట్యాబ్ ఏర్పాటు చేశారు.

దరఖాస్తుదారుడికి లేదా వారి కుటుంబ సభ్యులకు కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదు. గతంలో ప్రభుత్వ రీత్యా ఎలాంటి ఉచిత/సబ్సిడీ గృహ సదుపాయం పొంది ఉండకూడదు. దరఖాస్తుదారుడు సదరు నియోజకవర్గానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి.

ప్రస్తుతం హౌసింగ్ బోర్డు అధికారులు లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత, అర్హులైన అభ్యర్థులకు వారం రోజుల్లో ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్లు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

16 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 7,340 ఫ్లాట్ల కోసం మొత్తం 60,000 కంటే ఎక్కువ దరఖాస్తులు రాగా, ఆగస్టు 28 నుండి 31 వరకు పారదర్శకంగా లాటరీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. మరో 4 నియోజకవర్గాలైన ఎల్.బి. నగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్టలోని 1,920 ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 3 తుది గడువుగా నిర్ణయించారు.

Anand Sai, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu