Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IRCTC Andaman Tour : ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ టూర్ ప్యాకేజీ.. ఈ నెలలోనే

IRCTC Andaman Tour : ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ టూర్ ప్యాకేజీ.. ఈ నెలలోనే

ఆర్‌సీటీసీ మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో చాలా ప్రదేశాలు చూసేందుకు అవకాశం కల్పిస్తోంది. చాలామంది అండమాన్‌ దీవులకు వెళ్లాలి అనుకుంటారు. కానీ ఒక్కరిగా వెళ్లడం కష్టం అనిపిస్తుంది.

అలాంటివారు ఐఆర్‌సీటీసీలోని ప్యాకేజీలను ఉపయోగించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ AMAZING ANDAMAN WITH BARATANG EX HYDERABAD టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆరు రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. సెప్టెంబర్ 26వ తేదీన ప్రారంభం అవుతుంది. పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్, నీల్, బరాటాంగ్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా టూర్ ఉంటుంది.

ఏ రోజు ఎలా?

డే 1 హైదరాబాద్‌లో విమానం ఎక్కే సమయానికి 2 గంటల ముందే విమానాశ్రయం రావాలి. విమానం ఎక్కి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత హోటల్‌కు వెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ చేసి మధ్యాహ్న భోజనం తర్వాత శ్రీ విజయపురం(పోర్ట్ బ్లెయిర్)లోని ఫ్లాగ్ పాయింట్‌ను సందర్శించి, సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షోతో కూడిన సెల్యులార్ జైలు మ్యూజియానికి వెళ్తారు. రాత్రి భోజనం చేసి పోర్ట్ బ్లెయిర్‌లోనే స్టే చేస్తారు.

డే 2 పోర్ట్ బ్లెయిర్‌లో చెక్ అవుట్ చేసి క్రూయిజ్ సమయాల ప్రకారం ప్యాక్ చేసిన అల్పాహారంతో హేవ్‌లాక్‌కు బయలుదేరుతారు. హేవ్‌లాక్‌కు చేరుకున్నాక హోటల్‌లో చెక్-ఇన్, మధ్యాహ్న భోజనం తర్వాత రాధానగర్ బీచ్‌ను సందర్శిస్తారు. రాత్రి భోజనం చేసిన హోటల్‌లో చేస్తారు.

డే 3 హోటల్‌లో అల్పాహారం చేసి వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపం కోసం ఎలిఫెంట్ బీచ్‌కు వెళ్తారు. రాత్రి బస కోసం హోటల్‌కు తిరిగి వస్తారు. హోటల్‌లో రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

డే 4 అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి కాలా పత్తర్ బీచ్‌కు వెళ్తారు. ఆ తర్వాత క్రూయిజ్ సమయం ప్రకారం నీల్ ద్వీపానికి తీసుకెళ్తారు. అక్కడకు చేరుకున్నాక హోటల్‌లో చెక్ ఇన్ చేయండి. సాయంత్రం సూర్యాస్తమయం కోసం సీతాపూర్ బీచ్ అండ్ లక్ష్మణ్‌పూర్ బీచ్‌లను సందర్శించండి. హోటల్‌లో రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

డే 5 అల్పాహారం తర్వాత చెక్ అవుట్ చేసి, భరత్‌నగర్ బీచ్‌ను సందర్శిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుంటారు. సాయంత్రం విశ్రాంతి తీసుకుని.. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం చేస్తారు. అక్కడే స్టే.

డే 6 అల్పాహారం చేసి.. ఆ తర్వాత బరాటాంగ్ పర్యటనకు వెళ్తారు. రాత్రి బస పోర్ట్ బ్లెయిర్‌లోనే ఉంటుంది.

డే 7 హోటల్‌లో అల్పాహారం చేసి ఉదయాన్నే హోటల్ నుండి చెక్-అవుట్ చేస్తారు. ఉదయం 07:55 గంటలకు విమానాశ్రయంలో దింపుతారు. ఉదయం 09:55 గంటలకు విమానం ఎక్కుతారు. దీంతో అండమాన్ పర్యటన ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు

సింగిల్ ఆక్యుపెన్సీ రూ.87,700, డబుల్ ఆక్యుపెన్సీ రూ.67, 300, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.65, 200, చైల్డ్ విత్ బెడ్ రూ.57,450, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.53, 350గా ఉంది.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com వెళ్లండి.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu