Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- షాక్ మీద షాక్- దోషులుగా కార్తీక్, దీప- తల్లి ప్లాన్ చెడగొట్టిన సూరజ్

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2- షాక్ మీద షాక్- దోషులుగా కార్తీక్, దీప- తల్లి ప్లాన్ చెడగొట్టిన సూరజ్

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో నా భర్త చావుకు మీరందరు దోషులే అని మాలిని అంటుంది. జరిగింది ఏనాడు నువ్వు ఒప్పుకున్నావ్.

అన్నీ వదిలేసి మేము వచ్చాం. కానీ, నువ్వు నీ పగ కోసం నీ కొడుకును వాడుకున్నావని శివ నారాయణ అంటాడు.

స్నేహితుడుకే వెన్నుపోటు పొడిచావ్

అవును, తన తల్లికి జరిగిన అన్యాయానికి నా కొడుకు బదులు తీర్చుకున్నాడు. నిన్ను నమ్మిన స్నేహితుడుకే వెన్నుపోటు పొడిచావ్. కూతురుతో కేసు పెట్టించావ్. అప్పుడు నీకు ఏం లేదు. పోయేందుకు పెద్దగా పరువు లేదు. నీ అన్న భర్త చావుకు నువ్వే కారణం అని సుమిత్రను అంటుంది మాలిని. చెప్పింది ఎన్నిసార్లు చెబుతావ్. మనం అనుకుంటే కాదు దేవుడు ఉన్నాడని దశరథ్ అంటాడు.

ఏం మేనకోడలా ఇంకా అలాగే ఉన్నావ్. తల తిరుగుతూ ఉంటుందే. నాది మోసం కాదు న్యాయం. నా తండ్రి చేసినదానికి నాకు శిక్ష ఏంటీ అనుకోకు. తండ్రులు ఆస్తులు ఎలా వస్తాయో అలాగే ఇది. నీతో కూడా నాకు శత్రుత్వం ఉంది. కేవలం నువ్వు సుమిత్ర కూతురువి కాబట్టే నీకు ఈ శిక్ష లేదంటే నిన్ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అని మాలిని అంటుంది.

నాది అదే పద్ధతి. నా తల్లిదండ్రుల శత్రువులు నాకు శత్రువులే అని జ్యోత్స్న అంటుంది. ఇక నీ జీవితం నవ్వులపాలు అయినట్లే. ఈసారి నీ కుటుంబం అనుభవించాలి. చెడ్డవాళ్లను చెడ్డదారిలోనే తిప్పికొట్టాలంటారుగా. అందుకే మోసాన్ని మోసంతోనే కొట్టాను అని మాలిని అంటుంది. సూరజ్ దగ్గరికి కార్తీక్ కోపంగా వెళ్తాడు.

సూరజ్ కాలర్ పట్టుకుని

కాలర్ పట్టుకుని ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందా. ఒక ఆడపిల్ల ఆశలతో ఆడుకునే హక్కు నీకెవరు ఇచ్చారు. మా మావయ్య మా అత్తను ప్రేమించాడు. ఇంటికి తీసుకొచ్చి దేవతలా చూసుకుంటున్నాడు. వీడు అందరితో ఆడుకున్నాడు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నాడు అని కార్తీక్ అంటాడు.

థ్యాంక్స్ బ్రదర్. నేను జరిగింది అంతా విన్నాను. జరిగింది మొత్తం తెలుసు. నేను మీ జీవితాల్లోకి నా తండ్రి చావుకు పగ తీర్చుకునేందుకే వచ్చాను అని సూరజ్ అంటాడు. అంతా షాక్ అవుతారు. నా తల్లి నాతో ఏం చేయమని చెప్పిందో అదే చేశాను. నేను మీకు థ్యాంక్స్ ఎందుకు చెప్పానంటే.. మీరే లేకుంటే నేను జ్యోత్స్న జీవితంలోకి వచ్చేవాన్నే కాదు. శివ నారాయణ ఇంట్లో అడుగుపెట్టేవాన్నే కాదు అని అంతటికి కారణం కార్తీక్, దీప అన్నట్లుగా చెబుతాడు సూరజ్.

మీరే లేకుంటే నేనే జ్యోత్స్నకు సరైన జోడీ అని ఎవరు అనుకునేవారు కాదు. మీరే లేకుంటే నేను అనాథ అని నమ్మేవారు కాదు. అసలు దీనంతటికి కారణం మీరే అని సూరజ్ పెద్ద బాంబ్ పేలుస్తాడు. మీరు అంటే కార్తీక్ దీప, అదే అన్నయ్య వదినా. మీ ఇద్దరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని సూరజ్ అంటాడు. దాంతో కార్తీక్, దీప దోషులుగా నిలబడిపోతారు.

దోషులుగా కార్తీక్, దీప

నన్ను జ్యోత్స్నను కాపాడటం అబద్ధాలే కాదా అని శ్రీధర్ అంటే.. కాదు అవకాశాలు. మిమ్మల్ని ఫాలో అవుతున్నా నాకు దొరికిన అవకాశాలు. వాటన్నింటికి కార్తీక్, దీపలకే థ్యాంక్స్ చెప్పాలని సూరజ్ అంటాడు. అవమానంతో చస్తావా. ఎక్కడికైనా పోతావో నీ ఇష్టం. జరిగింది తలుచుకుని హాయిగా ఏడుస్తూ బతకొచ్చు అని సూరజ్‌ను తీసుకెళ్తుంది మాలిని.

సూరజ్ అని జ్యోత్స్న పిలుస్తుంది. సూరజ్ ఆగుతాడు. సూరజ్ పదా అని మాలిని తీసుకెళ్తుంది. సుమిత్ర కళ్లు తిరిగిపడిపోతుంది. కార్తీక్‌ను చేయి తీయమంటాడు శివ నారాయణ. నా కోడలిని మీరు తాకొద్దంటాడు. సుమిత్రను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. దక్షిణామూర్తి ఇంటికి మాలిని, సూరజ్ వెళ్తారు. సూరజ్, జ్యోత్స్నకు దిష్టి తీయమంటాడు దక్షిణామూర్తి.

జ్యోత్స్న ఎక్కడా. నా మీద అలిగిందా అని అడుగుతాడు. జ్యోత్స్న రాలేదని మాలిని అంటుంది. పెళ్లి జరగలేదు, తాళి కట్టలేదని మాలిని అంటుంది. మనం ఏమనుకున్నాం. వీడి మీదున్న ప్రేమతో జ్యోత్స్న మనింటికి రావాలనుకుందాం కదా. ఇదే కదా ప్లాన్ అని దక్షిణామూర్తి అంటాడు. ప్లాన్ మారిందని మాలిని అంటే.. ఇది నా ప్లాన్. నేనే మార్చానని సూరజ్ అంటాడు.

మాలిని ప్లాన్ చెడగొట్టిన సూరజ్

వీడు మండపానికి వెళ్లడానికి ముందే ప్లాన్ మార్చినట్లు చెప్పాడని మాలిని అంటుంది. నువ్వు వద్దని చెప్పాలిగా అని దక్షిణామూర్తి అంటాడు. నేను సుమిత్ర కూతురును ఇంటికి కోడలిగా తెచ్చుకుని నరకయాతన పెట్టాలనుకున్నాను. కానీ వీడు నిర్ణయం మార్చుకుని నా ప్లాన్ చెడగొట్టాడు అని మాలిని మనసులో అనుకుంటుంది. అంటే మాలిని ప్లాన్‌నే సూరజ్ చెడగొట్టాడని తెలుస్తోంది.

మనకు కావాల్సింది శివ నారాయణకు అవమానం కదా. పరువు తీస్తే ప్రాణం పోయినట్లే కదా అని దక్షిణామూర్తి అంటాడు. నేను పెళ్లి చేసుకున్నా జ్యోత్స్న రాదు. సుమిత్ర అత్త రానివ్వదని సూరజ్ అంటాడు. ఇదంతా మీరు మీ స్వార్థం కోసమే చేసినట్లుంది. ఇప్పుడు నా కూతురు నా ఇంటికి ఎలా వస్తుంది అని దక్షిణామూర్తి అంటాడు.

సుమిత్ర కుటుంబం అంతా కూతురును తీసుకుని మనింటి వాకిట్లో నిలబడతారు. అందరూ వస్తారని మాలిని అంటుంది. కూతురు పెళ్లి ఆగిపోయింది కదా. సుమిత్ర ఎంత బాధపడుతుందో అని దక్షిణామూర్తి అంటాడు. వెళ్లి భర్త కృష్ణమూర్తికి దీపం పెడుతుంది. భర్తకు ఎక్కించి సుమిత్ర భర్త లేకుంటే ఇంటికి వస్తుందని, మనం వాళ్ల బతుకుల మీద కొట్టాలని మాలిని అంటుంది.

కృష్ణమూర్తి చావుకు కారణం మాలినియే

శివ నారాయణకు ఒక్కడే కొడుకు వాడు లేకుంటే. ఇలా చేయు లేకుంటే నువ్వు దద్దమ్మవని నా నాన్న ముందు నిలబడు అని మాలిని అంటుంది. సుమిత్ర చచ్చినదాంతో సమానం. దాన్ని వదిలేయమని కృష్ణమూర్తి అంటాడు. భర్త ఫొటో చూస్తూ ఏంటీ కృష్ణమూర్తి చూస్తున్నావ్. ఆరోజు ఏం జరిగిందనేది మనిద్దరికి మాత్రమే తెలుసు అని మాలిని అంటుంది.

నీ చావు నీ చెల్లి వల్లే జరిగిందని నమ్మించడానికి నేను చాలా చేయాల్సి వచ్చింది అని గతం గుర్తు చేసుకుంటుంది. సుమిత్ర వదినకు కాళ్లు పోయాయని కృష్ణమూర్తి చెబితే.. అదేంటీ దశరథ్ చనిపోలేదా అని మాలిని అంటుంది. అంటే, ఎవరికి తెలియకుండా మాలినీయే యాక్సిడెంట్ చేయిస్తుంది. తన భర్త, సూరజ్ తండ్రి చావుకు కారణం మాలినియే అని తెలుస్తోంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu