Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kavya Kalyanram: కాల భైరవతో రిలేషన్షిప్ కన్ఫమ్ చేసిన బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Kavya Kalyanram: కాల భైరవతో రిలేషన్షిప్ కన్ఫమ్ చేసిన బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Kavya Kalyanram Kala Bhairava: టాలీవుడ్‌లో మరో క్యూట్ లవ్ స్టోరీ అధికారికంగా బయటపడింది. గడిచిన కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో ప్రచారంలో ఉన్న రూమర్లకు ముగింపు పలుకుతూ 'బలగం' హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్, ప్రముఖ యువ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం.

కీరవాణి కుమారుడైన కాల భైరవ (Kaala Bhairava)తో తన ప్రేమను ధ్రువీకరించారు.

సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ కలిసి ఉన్న క్యూట్ ఫొటోలను షేర్ చేస్తూ తన లవ్ లైఫ్ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. దీంతో కాల భైరవ - కావ్య జంటకు టాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు.

'ఎల్లో పేపర్ డైసీ లభించింది'.. హృదయానికి హత్తుకునే పోస్ట్

కావ్య కళ్యాణ్‌రామ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో కాల భైరవతో ఉన్న ప్రత్యేక ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఆమె జోడించిన క్యాప్షన్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. "లైఫ్ అప్‌డేట్: నాకు నా 'ఎల్లో పేపర్ డైసీ' దొరికింది. మన జీవితంలోకి కొందరు వ్యక్తులు వచ్చాక.. మనం దేవుడికి అత్యంత ప్రియమైన వాళ్లమని అనిపిస్తుంది. సరైన వ్యక్తి మన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు, ప్రతిదీ ఎంతో అందంగా కనిపిస్తుంది" అని రాసుకొచ్చారు.

అంతేకాకుండా.. "నా సాధారణ రోజులను కూడా అందంగా మార్చి, నన్ను ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిగా మార్చినందుకు ధన్యవాదాలు. 'వద్దు' అని చెప్పినా కూడా నాకు డైట్ కోక్ కావాలని నీకు తెలిసిన ఈ బంధం ఇలాగే ఎన్నో ఏళ్లు సాగాలని కోరుకుంటున్నాను" అంటూ కాల భైరవపై తనకున్న కేరింగ్ అండ్ లవ్‌ను వ్యక్తపరిచారు.

బాలనటి నుంచి స్టార్ హీరోయిన్‌గా కావ్య.. హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కాల భైరవ

కావ్య కళ్యాణ్‌రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'గంగోత్రి', 'ఠాగూర్', 'బాలు' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి అలరించారు. ఆ తర్వాత 'మసూదా' చిత్రంతో హీరోయిన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చి, 'బలగం' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

మరోవైపు కాల భైరవ టాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన సంగీత దర్శకుల్లో ఒకరిగా రాణిస్తున్నారు. 'మత్తు వదలరా', 'కార్తికేయ 2' వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించడమే కాకుండా, 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రంలోని 'నాటు నాటు' పాటను పాడి అంతర్జాతీయ ఆస్కార్ వేదికపై భారతదేశ కీర్తిని చాటారు.

పెళ్లి ఎప్పుడు? నెటిజన్లలో పెరిగిన ఉత్కంఠ

ఈ లవ్ పోస్ట్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఈ కొత్త జంటకు కామెంట్ల రూపంలో అభినందనలు తెలుపుతున్నారు. తమ బంధాన్ని అధికారికం చేయడంతో, వీరి వివాహం ఎప్పుడు ఉండబోతుందనే దానిపై ఇప్పుడు నెటిజన్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu