Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kia Sorento : 7 సీటర్ కియా సోరెంటో లాంచ్​ డేట్ ఫిక్స్- గ్రాండ్ ఎంట్రీ ఆరోజే..

Kia Sorento : 7 సీటర్ కియా సోరెంటో లాంచ్​ డేట్ ఫిక్స్- గ్రాండ్ ఎంట్రీ ఆరోజే..

భారతీయ ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించేందుకు దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా సిద్ధమైంది. ఆటోమొబైల్ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫ్లాగ్‌షిప్ 3-రో ఎస్‌యూవీ 'కియా సోరెంటో'ని సెప్టెంబర్ 4న భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.

ఈ మేరకు టీజర్‌ను కూడా విడుదల చేసి, ప్రచారాన్ని వేగవంతం చేసింది.

భారత్‌లో ప్రస్తుతం ఉన్న పాపులర్ మోడల్ 'సెల్టోస్' కంటే పైస్థానంలో ఈ కొత్త సోరెంటో నిలవనుంది. లగ్జరీ ఎస్‌యూవీ విపణిలో కియా స్థానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లోకి వచ్చాక స్కోడా కోడియాక్, వోక్స్‌వ్యాగన్ టైరాన్, హోండా జెడ్​ఆర్-వీ వంటి ప్రీమియం మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

కియా సోరెంటో ఎస్​యూవీ బుకింగ్స్ షురూ..

కియా సోరెంటోకు సంబంధించి అఫీషియల్​ బుకింగ్స్​ సైతం ప్రారంభమయ్యాయి. షోరూమ్‌లను బట్టి ఈ అడ్వాన్స్ టోకెన్ మొత్తం మారుతోంది. కొందరు డీలర్లు రూ. 51,000 తీసుకుంటుండగా, మరికొందరు రూ. 1 లక్ష వరకు కోరుతున్నారు. అయితే కొనుగోలుదారులు ఏదైనా అడ్వాన్స్ చెల్లించే ముందు సదరు డీలర్‌షిప్ వద్ద రీఫండ్ నిబంధనలు, బుకింగ్ షరతులను స్పష్టంగా సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సెప్టెంబర్​ లాంచ్ అనంతరం అక్టోబర్ నాటికి ఈ కియా సోరెంటో కార్ల డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని డీలర్ వర్గాలు చెబుతుండగా, వాహనానికి ఉన్న గిరాకీని బట్టి 6 నుంచి 8 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

కియా సోరెంటో- మేడ్ ఇన్ ఇండియా అసెంబ్లింగ్!

భారత్‌లో కియా సోరెంటోను స్థానికంగా అసెంబుల్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల ఈ ప్రీమియం 3-రో ఎస్‌యూవీని పోటీదారులకు సవాలు విసిరేలా ఆకర్షణీయమైన ధరకే అందించేందుకు కియాకు వీలవుతుంది. కంపెనీ ఇంకా అధికారిక ధరను వెల్లడించలేదు.

కియా సోరెంటో- స్ట్రాంగ్ హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు..

ఇంజిన్ విభాగంలో కియా ఇండియా అధికారిక వివరాలు వెల్లడించనప్పటికీ, విదేశాల్లో సక్సెస్ అయిన 'స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్', 'డీజిల్' మోడళ్లను ఇక్కడా తీసుకొచ్చే అవకాశం ఉంది.

హైబ్రిడ్ మోడల్: గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ విత్ ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ కలిపి 230 హెచ్​పీ పవర్, 380 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

డీజిల్ మోడల్: 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ సుమారు 202 హెచ్​పీ పవర్, 440 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది.

అంతర్జాతీయంగా ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ రూపాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ, భారత్‌కు ఏ వెర్షన్ తెస్తారనేది ఇంకా వేచి చూడాలి.

సోరెంటో విభిన్న కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా వేర్వేరు సీటింగ్ ఆప్షన్లతో రానుంది. వేరియంట్‌ను బట్టి 5-సీటర్, 6-సీటర్, 7-సీటర్ లేఅవుట్లలో ఇది లభించే అవకాశం ఉంది. కుటుంబంతో ప్రయాణించే వారికే కాకుండా, సుదీర్ఘ ప్రయాణాలు చేసే లాంగ్-టూర్ ప్రియులకు ఇది సరైన ఎంపికగా నిలవనుంది.

సెప్టెంబర్ 4న జరగబోయే ఈ కియా సోరెంటో ఎస్​యూవీ లాంచ్ భారత ఆటో పరిశ్రమలో సరికొత్త పోటీకి తెరలేపడం ఖాయం.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu