Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kiran Abbavaram: ఆ రీల్స్ చూస్తే భయం వేస్తోంది.. శ్మశానంలో ఏంటీ.. వాళ్లు లేచొస్తే ప్రాబ్లం కదా: కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: ఆ రీల్స్ చూస్తే భయం వేస్తోంది.. శ్మశానంలో ఏంటీ.. వాళ్లు లేచొస్తే ప్రాబ్లం కదా: కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో ఫుల్ సందడి నెలకొంది. అక్కినేని అఖిల్ మూవీ లెనిన్ రూ.100 కోట్ల క్లబ్ లో చేరగా.. తాజాగా కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ ఏమో రూ.50 కోట్లను అందుకుంది.

ఓ డిఫరెంట్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో అదరగొడుతోంది.

కిరణ్ అబ్బవరం కామెంట్లు

చెన్నై లవ్ స్టోరీ మూవీ రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా సినిమా టీమ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించింది. ఇవాళ (ఆగస్టు 1) జరిగిన ఈ ఈవెంట్లో మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. స్పీచ్ ఇస్తూ ఎమోషనల్ అయిన హీరో.. మధ్యలో కామెడీ కూడా చేశాడు. అతని కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

శ్మశానంలో రీల్స్ ఏంటీ?

కిరణ్ అబ్బవరం తన సినిమాకు వస్తున్న ఆదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ''చాలా మంది రీల్స్ చేస్తున్నారు. అయితే కొన్ని రీల్స్ చూస్తుంటే భయం వేస్తోంది. శ్మశానానికి వెళ్లి చేస్తున్నారు. జాగ్రత్తమ్మా. వాళ్లు లేచొస్తే మళ్లీ ప్రాబ్లం అవుతుంది. అక్కడికి వెళ్లిపోయి రీల్స్ చేస్తున్నారు. వాళ్ల బాధంతా చెప్పుకుంటున్నారు'' అని కిరణ్ అబ్బవరం నవ్వేవాడు. వెనుకాలే ఉన్న హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా నవ్వేశారు.

ఆ సీన్

చెన్నై లవ్ స్టోరీ సినిమాలో శ్మశానంలో ఓ సీన్ ఉంటుంది. హీరోను హీరోయిన్ ఎంతో ప్రేమిస్తుంది. కానీ పెళ్లి చేసుకునే టైమ్ కు ముందు హీరో యాక్సిడెంట్లో చనిపోతాడు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన హీరోయిన్ ఫుల్ గా మందు తాగుతుంది. శ్మశానంలోని హీరో సమాధి వద్దకు వెళ్లి.. ''నాకు నువ్వు కావాలి లే'' అని అరుస్తూ ఏడుస్తుంది. ఇప్పుడు ఈ సీన్ కు రీల్స్ చేస్తున్నారని తాజాగా కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.

చెన్నై లవ్ స్టోరీ హిట్

కిరణ్ అబ్బవరం వరుస హిట్లతో జోరుమీదున్నాడు. 'క' మూవీతో కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్.. ఆ తర్వాత 'కే ర్యాంప్'తో దూకుడు కొనసాగించాడు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు.

చెన్నై లవ్ స్టోరీ ఓ డిఫరెంట్ మూవీగా తెరకెక్కింది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఆత్మ కాన్సెప్ట్ బాగా వర్కౌంట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక క్లైమాక్స్ అయితే కన్నీళ్లు తెప్పించేలా ఉందని ఆడియన్స్ అంటున్నారు.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu