ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎం4ఎం (M4M - Motive for Murder)' చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం "M4M (Motive for Murder)" పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదల కానుంది.
5 భాషల్లో రిలీజ్
ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో నిర్మించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ (McWin Group USA) సహకారంతో ఎం4ఎం సినిమాను రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR Inox Pictures) సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది.
పాన్ ఇండియా స్థాయిలో
అమెరికాలో విడుదల బాధ్యతలను టెక్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (TekFlix Entertainment), నార్త్ ఇండియా రిలీజ్ హక్కులను జేవీఈఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ (JVEL Entertainment) సంస్థలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో "ఎం4ఎం" చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శన
థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ప్రముఖ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పాలయిస్ సీ థియేటర్(Palais C Theatre)లో ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా, ముంబైలోని ఐఎమ్‌పీపీఏ ప్రీవ్యూ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఇలా ప్రదర్శించిన ఎం4ఎం సినిమాకు సినీ వర్గాల నుంచి మంచి స్పందన లభించింది.
హీరోయిన్ జో శర్మా ప్రమోషన్స్
ఇక హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్‌లో విస్తృతంగా నిర్వహించిన ప్రమోషన్ టూర్ చిత్రానికి మరింత ప్రచారం తీసుకువచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
దర్శక నిర్మాత కామెంట్స్
"మే 8న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే మా సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడటం గర్వకారణం. ఎం4ఎం ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి" అని దర్శక నిర్మాత మోహన్ వడ్లపట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలుగులో హీరోయిన్‌గా అమెరికన్ నటి
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉత్కంఠభరిత అనుభూతికి గురిచేసే తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా "ఎం4ఎం" ప్రత్యేక గుర్తింపు పొందుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అలాగే, తెలుగు సస్పెన్స్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అయిన ఎం4ఎం సినిమాలో అమెరికన్ నటి జో శర్మా హీరోయిన్‌గా చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

