Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Malayalam Horror Thrillers OTT: ఓటీటీలో వణుకు పుట్టించే మలయాళ హారర్ థ్రిల్లర్స్.. మిస్సవ్వకూడని ఓ సినిమా, సిరీస్

Malayalam Horror Thrillers OTT: ఓటీటీలో వణుకు పుట్టించే మలయాళ హారర్ థ్రిల్లర్స్.. మిస్సవ్వకూడని ఓ సినిమా, సిరీస్

Malayalam Horror Thrillers OTT: హారర్, మిస్టరీ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి వీకెండ్ వినోదం కోసం సరికొత్త ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు గుండె గుభేల్మనేలా చేసే ఆ రెండు సరికొత్త మలయాళ కంటెంట్ వివరాలు ఇవే.

1. కరక్కం (Karakkam) - SonyLIV

శ్రీనాథ్ బాసి, ఫెమినా జార్జ్, ప్రవీణ్, అభిరామ్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రల్లో నటించిన కరక్కం చిత్రం ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంలోనే ఫస్ట్ మ్యూజికల్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది.

సినిమా కథ

కరక్కం మూవీ స్టోరీ డిఫరెంట్ గా ఉంది. అల్లరిచిల్లరిగా తిరిగే ధనుష్, ఖాజా అనే ఇద్దరు యువకులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో గొడవపడతారు. ఫుల్ గా తాగి పడుకోవడానికి చర్చి శ్మశాన వాటికకు వెళ్తారు. అక్కడి అయిదు సమాధులపై ఉన్న ఇత్తడి సిలువలను దొంగతనం చేస్తారు.

అప్పుడు ఆ అయిదు ఆత్మలు బయటకు వస్తాయి. అవి మ్యూజిక్, డ్యాన్స్ చేస్తూ కలర్ ఫుల్ గా ఉండే ఆత్మలు. ఈ ఆత్మలు కలిసి ధనుష్, ఖాజాను వెంబడిస్తాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఆత్మల గతం ఏంటీ? అన్నది కరక్కం మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.

ఎందుకు చూడాలి?

గాల్లో తేలే దెయ్యాలు కాకుండా, నటీనటుల సహజ సిద్ధమైన నటన, రియలిస్టిక్ లొకేషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మిమ్మల్ని సీట్లో నుంచి కదలకుండా చేస్తుంది. దీనికి తోడు తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండటం వల్ల ఎలాంటి సబ్‌టైటిల్స్ ఇబ్బంది లేకుండా హ్యాపీగా చూసేయవచ్చు.

2. ముత్తశ్శి (Muthassi) - ZEE5 (Web Series)

హారర్ మిస్టరీ వెబ్ సిరీస్ ముత్తశ్వి జీ5 (ZEE5) లో అందుబాటులో ఉంది. ఇందులో లీలా, అమిత్, అఖిల తదితరులు నటించారు.

సిరీస్ కథ

లీల అనే యువతి, రాజన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక శాపగ్రస్తమైన గ్రామంలో ఉండే వారి పాతకాలపు పెద్ద మేడలోకి కాపురానికి వస్తుంది. ఆ భయంకరమైన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచే లీలకు ఎన్నో అనుమానాలు, వింత అనుభవాలు ఎదురవుతుంటాయి.

అదే సమయంలో.. ఒకప్పుడు ఆ ఊరిని శపించిన చేతబడి చేసే 'ముత్తశ్శి' భయంకరమైన రూపంతో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.లీలా గర్భం దాల్చి శ్రీకుట్టన్ అనే బాబు పుట్టిన తర్వాత.. ముత్తశ్శి ఆ బాబును తన తదుపరి వారసుడిగా చూస్తూ వింత పనులు చేయడం ప్రారంభించడంతో కథ మలుపు తిరుగుతుంది.

ఆ తర్వాత ఆ బాబు ప్రవర్తనలో అత్యంత భయానకమైన మార్పులు చోటుచేసుకోవడంతో లీల తీవ్ర ఆందోళనకు గురవుతుంది.చివరకు తన బిడ్డను కాపాడుకోవడానికి లీల ఆ ముత్తశ్శి వెనుక ఉన్న భయంకరమైన గతాన్ని, రహస్యాలను ఎలా ఛేదించింది అనేదే ఈ మిస్టికల్ ఫోక్ హారర్ కథ.

ఎందుకు చూడాలి?

కేరళ సాంప్రదాయ కట్టుబాట్లు, పాతకాలపు భవనాల్లో ఉండే గూస్‌బంప్స్ తెప్పించే వాతావరణాన్ని ఈ సిరీస్‌లో అద్భుతంగా చూపించారు. సాధారణ సినిమాల కంటే వెబ్ సిరీస్ కావడం వల్ల ప్రతి ఎపిసోడ్ ఎండ్‌లో ఇచ్చే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ట్విస్టులు 'నెక్స్ట్ ఏం జరుగుతుంది?' అనే క్యూరియాసిటీని పెంచుతాయి. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu