Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mamitha Baiju: నెలలోనే 3 సినిమాలు- వరుసగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు- మమితా బైజు హిస్టరీ- మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!

Mamitha Baiju: నెలలోనే 3 సినిమాలు- వరుసగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు- మమితా బైజు హిస్టరీ- మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!

Mamitha Baiju: మలయాళ కుట్టి, 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) హిస్టరీ క్రియేట్ చేసింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరే హీరోయిన్ కు సాధ్యంకాని అరుదైన బాక్సాఫీస్ రికార్డును నెలకొల్పింది.

కేవలం 29 రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు భాషల్లోని వరుస చిత్రాలతో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ సాధించి హ్యాట్రిక్ విక్టరీలను ఖాతాలో వేసుకుంది.

మమితా బైజు బాక్సాఫీస్ సునామీ

'ప్రేమలు' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు.. తక్కువ సమయంలోనే సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. జూలై 23 నుంచి ఆగస్టు 21 వరకు విడుదలైన ఆమె మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను సాధించాయి.

జన నాయగన్ (Jana Nayagan)

దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్ జూలై 23, 2026న విడుదలైంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మమితా బైజు కీలక పాత్ర పోషించింది.

విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons)

సూర్య కథానాయకుడిగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఆగస్టు 14, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.240 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇందులో మమితా బైజు హీరోయిన్ గా అదరగొట్టింది.

బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)

నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం బెత్తెహేమ్ కుటుంబ యూనిట్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఆగస్టు 21, 2026న రిలీజై ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వారం రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ మైలురాయిని చేరుకుంది. సినిమాలో హీరోయిన్ గా మమితా బైజు క్యూట్ యాక్టింగ్ తో మెప్పించింది.

అదే కలిసి వచ్చిందా?

వాస్తవానికి దళపతి విజయ్ 'జన నాయగన్' చిత్రం ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ కారణాల వల్ల జూలై 23కి వాయిదా పడింది. ఈ రిలీజ్ పోస్ట్‌పోన్‌మెంట్ మమితా బైజుకు అనుకోకుండా ఒక పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది.

జూలై 23 నుంచి ఆగస్టు 21 వరకు ఉన్న సరిగ్గా 29 రోజుల వ్యవధిలో ఈ మూడు చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. మూడూ రూ.200 కోట్ల మార్క్‌ను దాటడంతో భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఏకైక నటిగా మమితా హిస్టరీ క్రియేట్ చేసింది.

పక్కింటి అమ్మాయి ఇమేజ్

సాయి పల్లవి తర్వాత మలయాళం నుంచి వచ్చి తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలను అంతలా గెలుచుకున్న నటి మమితా బైజు. ఆమె సహజ నటన, ఎక్స్‌ప్రెషన్స్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆమెకు విపరీతమైన ఆడియన్స్ కనెక్టివిటీని ఇచ్చాయి.

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, 'జన నాయగన్' వంటి భారీ మాస్ యాక్షన్ డ్రామా, 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' వంటి కంటెంట్-ఓరియెంటెడ్ ఫ్యామిలీ సినిమాలను ఎంచుకోవడం ద్వారా ఆమె తన మార్కెట్ రేంజ్‌ను పెంచుకుంది.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu