Manchu Manoj About Dasari Narayanarao Ghat Memorial: దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై సోషల్ మీడియాలో యాంకర్ గౌతమి ఓ వీడియో షేర్ చేశారు.
ఆ వీడియో చూస్తే అక్కడి వాతావరణం, ఆ ఘాట్ స్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో వచ్చిన కొన్ని గంటల్లో 'రా కింగ్' స్టార్ మంచి మనోజ్ స్పందించారు.
దాసరి నారాయణరావు ఘాట్‌ను సందర్శించి
అంతేకాకుండా మంచు మనోజ్ స్వయంగా దాసరి నారాయణరావు ఘాట్‌ను సందర్శించి, ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని మంచు మనోజ్ ఇలా చాటుకున్నారు.
నిజంగా చాలా బాధ కలిగింది
దాసరి నారాయణరావు ఘాట్ పరిస్థితిపై సోషల్ మీడియాలో మనోజ్ మంచు స్పందిస్తూ.. ''దాసరి గారి ఘాట్ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి నిజంగా చాలా బాధ కలిగింది. దాసరి నారాయణరావు గారు తరతరాలకు స్ఫూర్తినిచ్చి, తెలుగు సినిమాకు ఎంతో దోహదపడ్డారు. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. నా వంతుగా నేను చేయగలిగి సహాయం చేస్తానని హామీ ఇస్తున్నాను' అని ట్వీట్ వేశారు.
నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడకు వచ్చాను
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మంచు మనోజ్ తన సినిమా షూటింగ్‌కి వెళ్లే కంటే ముందు ఉదయం 7:00 గంటల కల్లా తన బృంద సభ్యులతో కలిసి దాసరి ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. "మూడు, నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడకు వచ్చాను. ప్రస్తుతం ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్ని చూసి చాలా బాధపడ్డాను" అని అన్నారు.
ఆ దృశ్యాలు చూసి తట్టుకోలేకపోయాను
"చిత్రపురి కాలనీ దాటుతుండగా, ఆయన విగ్రహం కనిపించి ఘాట్ గుర్తొచ్చింది. ఆ వీడియా మా టీం నాకు చూపించడంతో అసలు విషయం తెలిసింది. ఆ దృశ్యాలు నన్ను తీవ్రంగా బాధించాయి. నేను తట్టుకోలేకపోయాను. అందుకే దీనికి ప్రాధాన్యతనిచ్చి, నా షూటింగ్‌కు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చాను" అని తెలిపారు మంచు మనోజ్.
ఐక్య ధైర్య సేనా సమితి వెనుక ఉన్న స్ఫూర్తి
ఆ తర్వాత మనోజ్ తన టీంతో కలిసి ఘాట్ చుట్టూ పేరుకుపోయిన ఎండుటాకులు, చెత్తను తొలగిస్తూ ఘాట్ ప్రాంతమంతటినీ శుభ్రం చేశారు. మనోజ్, మౌనిక ఇటీవల ప్రారంభించిన 'ఐక్య ధైర్య సేనా సమితి' అనే సామాజిక సేవా ఉద్యమం వెనుక ఉన్న ఉన్నత స్ఫూర్తిని ఈ చర్య ప్రతిబింబిస్తుంది.
వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా
ఇదిలా ఉంటే, ఈ మధ్య మంచు మనోజ్ రక్తదాన శిబిరాలు, సహాయ కార్యక్రమాలు, మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించడం అందరికీ తెలిసిందే. ఐక్య ధైర్య సేన సమితి ద్వారా వాయిస్ లెస్‌కి వాయిస్‌గా నిలుస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు మనోజ్ మంచు. ఇప్పుడు మనోజ్ దాసరి నారాయణరావు గారి ఘాట్‌ని సందర్శించడం ఆయన నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుంది.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

