Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీ ఇంట ఎప్పుడూ సిరిసంపదలు ఉండాలా? ఈ మూడు అలవాట్లు మార్చుకోండి!

మీ ఇంట ఎప్పుడూ సిరిసంపదలు ఉండాలా? ఈ మూడు అలవాట్లు మార్చుకోండి!

చార్య చాణక్యుని భారతీయ చరిత్రలో అత్య గొప్ప అర్థశాస్త్రవేత్తగా, దూరదృష్టి గల నీతిజ్ఞుడిగా కొలుస్తారు. తన అసాధారణ రాజకీయ చతురతతో సాధారణ బాలుడైన చంద్రగుప్తుడిని మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా చేసిన ఘనత ఆయనది.

శతాబ్దాలు గడిచినా, నేటి ఆధునిక కాలంలోనూ చాణక్య నీతులు మానవ జీవితానికి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ధన సంపాదన, కుటుంబ నిర్వహణ, సంపద నిలకడ గురించి ఆయన చెప్పిన సూత్రాలు నేటికీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

లక్ష్మీదేవి ఎంతో చంచలమైనదానిగా చెబుతారు. అంటే ఆమె ఎప్పుడూ ఒకచోట స్థిరంగా ఉండదనే అంటారు. అయితే, కొన్ని ప్రత్యేకమైన వాతావరణం, సత్ప్రవర్తన ఉన్న ఇళ్లలో మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువై ఉంటుందని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టం చేశారు. ఆ అదృష్టకరమైన పరిస్థితులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

విద్వాంసులకు గౌరవం - మూర్ఖులకు తావు లేదు

ఓ ప్రసిద్ధ శ్లోకం ప్రకారం, ఏ సమాజంలో లేదా కుటుంబంలో మూర్ఖులను, అర్హత లేనివారిని తలకెక్కించుకోరో, ఎక్కడ విద్వాంసులు, జ్ఞానుల మాటలకు విలువ ఇస్తారో అక్కడ సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. మంచి చెడులను బేరీజు వేయలేని వారిని ప్రోత్సహించని చోట లక్ష్మీదేవి స్వయంగా అడుగుపెడుతుంది.

అన్నపూర్ణను గౌరవించడం

చాణక్య ప్రకారం, ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు. ఏ ఇంట్లో అయితే ధాన్యాన్ని భద్రంగా దాచుకుంటారో, అన్నాన్ని దైవంతో సమానంగా భావించి గౌరవిస్తారో ఆ ఇంట దరిద్రం దరిచేరదు. ఆహారాన్ని అవమానించే చోట సిరిసంపదలు ఆవిరైపోతాయి.

అన్యోన్య కుటుంబ జీవితం

భార్యాభర్తల మధ్య సఖ్యత లేని కుటుంబంలో ఎప్పుడూ అశాంతి తాండవిస్తుంది. ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు, పరస్పర కలహాలు ఉంటాయో అక్కడి నుంచి లక్ష్మీదేవి వెంటనే నిష్క్రమిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత, ప్రశాంతత ఉన్న ఇళ్లే దేవతలు నివసించే నిజమైన ఆలయాలు.

లక్ష్మీదేవి ఎందుకు ఆగ్రహిస్తుంది?

అదే విధంగా కొన్ని దురలవాట్లు ఉన్నవారి ఇళ్ల నుంచి లక్ష్మీదేవి శాశ్వతంగా దూరమవుతుందని చాణక్య హెచ్చరిస్తున్నారు.

అపరిశుభ్రత, బద్ధకం: ఎవరైతే ఎప్పుడూ మురికి బట్టలు వేసుకుంటారో, దంతాల శుభ్రత పాటించరో, సూర్యోదయమైన తర్వాత కూడా నిద్రలేవరో వారిపై లక్ష్మీదేవికి ఎప్పుడూ ఆగ్రహమే ఉంటుంది. ఎంతటి విద్వాంసుడైనా ఈ అలవాట్లు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

కఠినమైన మాటలు: తోటివారిని ఎల్లప్పుడూ అవమానించేలా మాట్లాడేవారు, అహంకారంతో ప్రవర్తించేవారి దగ్గర ధనం ఎక్కువ కాలం నిలవదు. మధురమైన మాటలు లేని చోట సంపద కరిగిపోతుంది.

అధర్మ మార్గంలో సంపాదన: మోసం, దగా, ఇతరులను కష్టపెట్టి సంపాదించిన సొమ్ము ఎవరికీ శాశ్వతంగా మిగల్లేదు. ఆ అధర్మపు ధనమే చివరికి మనిషి సర్వనాశనానికి దారితీస్తుంది.

Peddinti Sravya, hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu