Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Morning meditation : 'ఒక్క నిమిషం' మెడిటేషన్​.. మీ జీవితాన్నే మార్చేస్తుంది!

Morning meditation : 'ఒక్క నిమిషం' మెడిటేషన్​.. మీ జీవితాన్నే మార్చేస్తుంది!

చాలామంది ఉదయం లేవగానే మొబైల్ నోటిఫికేషన్లు చూడటం, ఆ రోజు చేయాల్సిన పనుల గురించి టెన్షన్ పడుతూ.. రోజును ఒత్తిడితో ప్రారంభిస్తారు. ఇది ఆ రోజంతటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

అయితే, మానసిక ప్రశాంతత కోసం గంటల తరబడి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే కేవలం 'ఒక్క నిమిషం' పాటు చేసే మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ మీ మైండ్, బాడీని సానుకూలంగా మార్చగలదు. ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచి, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడానికి 1 మినిట్​ మెడిటేషన్ ఎంతో ఉపయోగపడుతుంది!

ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం వేళలు ఒక రేస్‌లా అనిపిస్తాయి. కానీ ఆ హడావుడిని తగ్గించి, రోజును మీ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ఒక్క నిమిషం నిశ్శబ్దం చాలు!

ఈ చిన్న అలవాటు వల్ల కలిగే 8 ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి..

ఒక్క నిమిషం ధ్యానంతో కలిగే 8 అద్భుత ప్రయోజనాలు..

1. సానుకూలమైన ప్రారంభం : ఉదయాన్నే కాసేపు నిశ్శబ్దంగా ఉండటం వల్ల మనసుకు స్పష్టత లభిస్తుంది. హడావుడి, ఒత్తిడి స్థానంలో ప్రశాంతత వచ్చి చేరుతుంది. ఈ సానుకూల ఆలోచనా విధానం రోజంతా మీరు ఎదుర్కొనే పరిస్థితులను హ్యాండిల్ చేయడానికి సహాయపడుతుంది.

2. మెరుగైన ఏకాగ్రత : ఒక్క నిమిషం పాటు లోతైన శ్వాస తీసుకోవడం వల్ల మెదడులోని అనవసర ఆలోచనలు తొలగిపోతాయి. దీనివల్ల ఆఫీస్ లేదా ఇంటి పనులపై శ్రద్ధ పెట్టడం, మీ లక్ష్యాలను సరిగ్గా ప్లాన్ చేసుకోవడం సులువవుతుంది.

3. మూడ్ మెరుగుపడుతుంది : శ్వాసపై ధ్యాస పెట్టడం లేదా జీవితంలో ఉన్న మంచి విషయాల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల ఎమోషనల్ బ్యాలెన్స్ లభిస్తుంది. ఇది మీ మూడ్‌ని రోజంతా హ్యాపీగా ఉంచుతుంది.

4. ఉదయపు గందరగోళానికి బ్రేక్ : సమయంతో చేసే యుద్ధానికి ఈ ఒక్క నిమిషం ఒక శక్తివంతమైన విరామంలా పనిచేస్తుంది! దీనివల్ల పనులను కంగారు పడకుండా, ప్రశాంతంగా పూర్తి చేసుకోగలరు.

5. అతిగా ఆలోచించడాన్ని అడ్డుకుంటుంది : నిద్ర లేవగానే ఆ రోజు గురించిన ఆందోళనలు, భయాలు మిమ్మల్ని చుట్టుముడుతుంటే.. ఈ ఒక్క నిమిషం నిశ్శబ్దం వాటికి బ్రేక్ వేస్తుంది. ఆలోచనలు మిమ్మల్ని నియంత్రించక ముందే మీరు వాటిని శాంతింపజేయవచ్చు.

6. మనసు, భావోద్వేగాల మేల్కొలుపు : చాలామంది కేవలం శరీరాన్ని మాత్రమే నిద్ర లేపుతారు, కానీ మనసును పట్టించుకోరు. ఈ మైండ్‌ఫుల్ మూమెంట్ మీ మనసును, భావోద్వేగాలను ఆ రోజుకు సిద్ధం చేసి, మీ అంతరాత్మతో కనెక్ట్ చేస్తుంది.

7. రియాక్షన్ కాదు.. ప్లానింగ్‌తో మొదలు : నిద్ర లేవగానే మెసేజ్‌లు, ఈమెయిల్స్ లేదా డెడ్‌లైన్లకు స్పందిస్తూ ఒత్తిడికి గురికాకుండా.. మీ రోజును మీకు నచ్చినట్లుగా, ఒక స్పష్టమైన లక్ష్యంతో ప్రారంభించేలా చేస్తుంది.

8. సహజమైన శక్తి లభిస్తుంది : ఉదయాన్నే యాక్టివ్‌గా ఉండటానికి కాఫీ, టీలపై మాత్రమే ఆధారపడకుండా.. లోతైన శ్వాస ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచి, సహజంగానే శరీరాన్ని అలర్ట్‌గా, ఉత్సాహంగా మార్చుకోవచ్చు.

ఒక్క నిమిషం అనేది చాలా చిన్న సమయంగా అనిపించవచ్చు. కానీ, దీనిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకుంటే, అది మీ మానసిక ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా మారి రోజంతా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu