Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nag Ashwin: ఆ గ్రహాలన్నీ ఒక లైన్‌లోకి వచ్చి తిరిగేశాయి.. కేవలం 10 రోజులే షూటింగ్: నాగ్ అశ్విన్ కామెంట్స్

Nag Ashwin: ఆ గ్రహాలన్నీ ఒక లైన్‌లోకి వచ్చి తిరిగేశాయి.. కేవలం 10 రోజులే షూటింగ్: నాగ్ అశ్విన్ కామెంట్స్

Nag Ashwin: పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD' ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా సీక్వెల్ 'కల్కి 2' కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ పురోగతిపై దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇచ్చారు.

సుమ ప్రశ్నకు నాగ్ అశ్విన్ మార్క్ సమాధానం

హైదరాబాద్‌లో జరిగిన దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ 'ఐ యామ్ గేమ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నాగ్ అశ్విన్‌ను యాంకర్ సుమ 'కల్కి 2' గురించి ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. గతంలో మీరు కల్కి సీక్వెల్ తీయాలంటే గ్రహాలన్నీ ఒకే వరసలోకి రావాలని చెప్పారు కదా.. మరి ఇప్పుడు షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నించారు.

దీనికి నాగ్ అశ్విన్ తనదైన శైలిలో స్పందిస్తూ, "ఆ గ్రహాలన్నీ అలైన్ అయిపోయి ఒక రౌండ్ కూడా తిరిగేశాయి. ఇప్పుడు మళ్లీ ఇంకొక రౌండ్ తిరిగి సరిగ్గా అలైన్ అయినప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తాం" అని సరదాగా సమాధానమిచ్చారు.

ఇప్పటివరకు కేవలం 10 రోజులే షూటింగ్

'కల్కి 2' షూటింగ్ పురోగతి గురించి చెబుతూ.. ఇప్పటివరకు తాము కేవలం 10 రోజులు మాత్రమే షూటింగ్ చేశామని నాగ్ అశ్విన్ వెల్లడించారు. "ప్రభాస్ గారు పూర్తిగా ఫ్రీ అయ్యాక, ఆయన డేట్స్ దొరగ్గానే ఒకే సుదీర్ఘ షెడ్యూల్‌లో మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేస్తాం" అని స్పష్టం చేశారు.

దీంతో ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టుల వర్క్ పూర్తి చేసిన వెంటనే కల్కి 2 షూటింగ్ శరవేగంగా జరగనుందని స్పష్టమవుతోంది.

అమితాబ్-కమల్ హాసన్ కాంబో సీన్స్ షూట్ పూర్తి

మరోవైపు ఈ సీక్వెల్ కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్‌పై కొన్ని కీలకమైన సీన్స్ ఇప్పటికే చిత్రీకరించారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ హాసన్ కాంబినేషన్ మొదటి భాగంలో నేరుగా ఎదురుపడలేదు.

కానీ ఈ సీక్వెల్‌లో వారిద్దరి మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. ఫిబ్రవరిలోనే వీరిద్దరూ కలిసి కొన్ని రోజుల పాటు సెట్స్‌లో పాల్గొని వర్క్ చేశారని అమితాబ్ స్వయంగా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ వెల్లడించారు.

ప్రభాస్ చేతిలో వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు

ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మారుతి దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ 'ది రాజా సాబ్' తర్వాత ప్రభాస్ పలు భారీ చిత్రాలలో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' (Fauzi) షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా డిసెంబర్ 3న థియేటర్లలోకి రానుంది.

అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'స్పిరిట్' (Spirit) కూడా లైన్‌లో ఉంది. విష్ణు మంచు 'కన్నప్ప'లో కామియో చేయడంతో పాటు తేజ సజ్జా 'మిరాయ్'కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించారు.

క్యాస్టింగ్‌లో మార్పులు? సాయి పల్లవి, ఆలియా భట్?

కల్కి మొదటి భాగంలో సుమతిగా నటించిన దీపికా పదుకోన్ ఈ సీక్వెల్‌ నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఒక పవర్ ఫుల్ రోల్ కోసం సంప్రదింపుల్లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ తన లైనప్‌లోని సినిమాలను పూర్తి చేసి డేట్స్ కేటాయించగానే 'కల్కి 2' విజువల్ వండర్ పట్టాలెక్కనుంది.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu