Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nagabandham Tickets: ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాకు తొలి రోజు నుంచే బంపర్ ఆఫర్

Nagabandham Tickets: ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాకు తొలి రోజు నుంచే బంపర్ ఆఫర్

Nagabandham Tickets: భారీ కాన్వాస్, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) తో వస్తున్న మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ త్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' (Nagabandham: The Secret Treasure).

ఎన్నో అంచనాల మధ్య రేపు (జులై 3, శుక్రవారం) వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేటైంది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ప్రేక్షకులను ఆకర్షించడానికి టికెట్లపై ఆఫర్ తో వస్తుండటం విశేషం.

బాలీవుడ్ ట్రెండ్ ఫాలో అవుతున్న టాలీవుడ్

బాలీవుడ్‌లో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి 'బై వన్ గెట్ వన్' (BOGO) ఆఫర్స్ ఇవ్వడం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నాగబంధం మేకర్స్ కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

సినిమా రిలీజైన ఫస్ట్ డే (జులై 3) నుంచే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని అనౌన్స్ చేశారు. అయితే ఈ క్రేజీ ఆఫర్ కేవలం హిందీ వెర్షన్‌కు మాత్రమే వర్తిస్తుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ స్ట్రాటజీ నార్త్‌లో బాక్సాఫీస్ నంబర్స్‌ను ఏమేరకు పెంచుతుందో చూడాలి.

విరాట్ కర్ణ డ్యూయల్ షేడ్స్.. అదరగొట్టే కాస్టింగ్

డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా (Abhishek Nama) తన సెకండ్ డైరెక్షనల్ వెంచర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం, బ్రహ్మ కమలం, నాగ సాధువుల చుట్టూ తిరిగే ఒక పవర్‌ఫుల్ స్టోరీతో ఈ సినిమాను తీశారు.

రీసెంట్‌గా రిలీజైన టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు.

విరాట్ కర్ణ డ్యుయల్ రోల్

ఈ సినిమాలో యంగ్ హీరో విరాట్ కర్ణ (Virat Karrna) మెయిన్ లీడ్‌గా నటిస్తున్నాడు. ఒక సాధారణ వ్యక్తి, అలాగే లార్డ్ శివ లాంటి రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో అతను కనిపించబోతున్నాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ గ్లామర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ లాంటి సీనియర్ యాక్టర్స్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ ప్లే చేయడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.

సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, జునైద్-అభే అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయని చెబుతున్నారు. ఎన్ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సుమారు 3 గంటల 5 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తున్న ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్‌కు ఒక మంచి విజువల్ అనుభూతిని ఇవ్వడం పక్కా.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu