Nagarjuna:మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన రా అండ్ మాస్ ఎమోషనల్ డ్రామా 'లెనిన్' ప్రమోషన్స్ పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా, ఆదివారం (జూలై 5) రాత్రి తిరుపతిలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ నాగార్జున అక్కినేని.. అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా మాట్లాడాడు.
నాగార్జున స్పీచ్
లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ సినిమాపై ఇన్ సైడ్ రిపోర్ట్స్‌ను పంచుకున్నారు.
"దర్శకుడు నందు (మురళి కిషోర్) మొదట నాకు కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ప్రతీ పాత్రలో రకరకాల కోణాలున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులను ఎవరూ ఊహించలేరు. ఇది మన సీమ కథ, సీమ మట్టి కథ, సీమలో జరుగుతున్న మహాభారతం'' అని నాగార్జున చెప్పాడు.
సెట్ అవుతాడా అని భయం
''మొదట్లో అఖిల్ ఇలాంటి రా అండ్ మాస్ రోల్‌కు సెట్ అవుతాడా అని కాస్త భయపడ్డాను. కానీ సినిమా చూశాక నేనే ఆశ్చర్యపోయాను. స్క్రీన్ మీద అఖిల్ కనిపించడు.. కేవలం 'లెనిన్' మాత్రమే కనిపిస్తాడు. లెనిన్ ప్రేమను, పగను మీరు ప్రేమిస్తారు" అని తన కొడుకు అఖిల్ పై నాగ్ ప్రశంసలు కురిపించాడు.
భారతి హార్ట్ బీట్
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి చెప్తూ.. "భారతి (భాగ్యశ్రీ) పాత్ర ఈ సినిమాకు హార్ట్ బీట్ లాంటిది. అంత అందంగా, అద్భుతంగా నటించింది" అని నాగార్జున అన్నాడు. అలాగే తమన్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్, బ్రిట్టో సినిమాటోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని అప్రిషియేట్ చేశాడు.
'వస్తున్నాం.. కొడుతున్నాం'
సాధారణంగా కింగ్ నాగార్జున తానే స్వయంగా ప్రివ్యూ చూసి, అవుట్‌పుట్‌పై వంద శాతం నమ్మకం ఉన్న సినిమాలకే తన ట్రేడ్‌మార్క్ స్టేట్‌మెంట్ అయిన "వస్తున్నాం.. కొడుతున్నాం" అని చెప్తుంటాడు. గతంలో 'సోగ్గాడే చిన్ని నాయన' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆయనిలాగే చెప్పాడు.
ఇప్పుడు అఖిల్ లెనిన్ సినిమాకు కూడా కొద్దిగా మార్చి.. "ప్రేక్షక దేవుళ్ల సాక్షిగా చెబుతున్నాను.. జూలై 10 వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు" అని బల్లగుద్ది మరీ చెప్పాడు. దీంతో ఆల్రెడీ బొమ్మ సూపర్ హిట్ అని అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇంటర్వెల్, లాస్ట్ 40 నిమిషాలు ఊచకోతే!
ఈవెంట్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ (చింటు) మాట్లాడుతూ సినిమా బిజినెస్, కంటెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. "బల్లగుద్ది చెప్తున్నా.. అఖిల్ ఈసారి ఏ ఒక్కరినీ డిజప్పాయింట్ చేయడు. రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా చాలా కొత్త స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, సినిమా చివరి 40 నిమిషాలు ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యేలా ఉంటాయి" అని నాగవంశీ చెప్పాడు.
చింటూ అన్న
లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున చెప్పిన ఓ నిక్ నేమ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ''నాకో పార్ట్ నర్ ఉన్నాడు. అతనే చింటూ (నాగవంశీ) అన్న. సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంంతో ఏపీ రైట్స్ మొత్తాన్ని తానే ఓన్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు'' అని నాగార్జున చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి.
Chandu Shanigarapu

