Netflix: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise) కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ఎవర్ గ్రీన్ యాక్షన్ థ్రిల్లర్ 'టాప్ గన్' (Top Gun - 1986) ఇటీవలే విజయవంతంగా 40వ వసంతంలోకి అడుగుపెట్టింది.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. అంతేకాకుండా దీనికి సీక్వెల్‌గా వచ్చి సంచలన విజయం సాధించిన 'టాప్ గన్: మావెరిక్' (Top Gun: Maverick) చిత్రాన్ని కూడా కలిపి 'డబుల్ ఫీచర్' ఈవెంట్‌గా ప్రదర్శించడంతో ఫ్యాన్స్ థియేటర్లలో పండగ చేసుకున్నారు.
అయితే ఈ క్లాసిక్ సినిమాను ఇంట్లోనే కూర్చొని ఓటీటీలో చూడాలనుకునే అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒక షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ నుండి శాశ్వతంగా వెళ్లిపోనుంది.
జూన్ 1 లోపే చూసేయండి..
మీకు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యామనే బాధ ఉంటే.. నెట్‌ఫ్లిక్స్ లో చూసేందుకు ఇదే ఆఖరి అవకాశం. జూన్ 1 నుండి 'టాప్ గన్' సినిమాను తమ స్ట్రీమింగ్ కేటలాగ్ నుండి తొలగిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
కాబట్టి 'మావెరిక్', 'గూస్'ల హై-ఫ్లయింగ్ ఏరియల్ యాక్షన్ ఎపిసోడ్స్, క్లాసిక్ సెంటిమెంట్‌ను మరోసారి స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే.. వెంటనే నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి స్ట్రీమింగ్ చేసేయండి. అయితే నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ మూవీ వెళ్లిపోయినా ప్రస్తుతం జియోహాట్‌స్టార్ లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
'టాప్ గన్' మూవీ విశేషాలు
టోనీ స్కాట్ (Tony Scott) దర్శకత్వంలో వచ్చిన ఈ టాప్ గన్ మూవీ 1980ల నాటి సినిమా రంగాన్ని, పాప్ కల్చర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ స్టైలిష్ విజువల్స్, అద్భుతమైన విమాన విన్యాసాలు, ఎప్పటికీ గుర్తిండిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రాన్ని ఒక మాస్టర్‌క్లాస్‌గా నిలిపాయి.
హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో 'టాప్ గన్' ఎప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్. సరిగ్గా 40 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం, ఇప్పటికీ సరికొత్త జనరేషన్ ఆడియన్స్‌ను కూడా అదే స్థాయిలో థ్రిల్ చేయగలగడం టామ్ క్రూజ్ రేంజ్‌కు నిదర్శనం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'టాప్ గన్' (1986) సినిమా నెట్‌ఫ్లిక్స్ నుండి ఎప్పుడు తొలగిస్తారు?
ఈ క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్ 1, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్ కేటలాగ్ నుండి తొలగించనున్నారు.
2. టాప్ గన్ మూవీ ఈ మధ్య థియేటర్లలో ఎందుకు రీ-రిలీజ్ అయింది?
ఈ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు. దీనితో పాటు దీని సీక్వెల్ 'టాప్ గన్: మావెరిక్'ను కూడా కలిపి డబుల్ ఫీచర్‌గా ప్రదర్శించారు.
3. టాప్ గన్ సినిమాను నిర్మించింది, పంపిణీ చేసింది ఎవరు?
ఈ చిత్రాన్ని డాన్ సింప్సన్/జెర్రీ బ్రక్‌హైమర్ ఫిల్మ్స్ నిర్మించగా, పారామౌంట్ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసింది.
Hari Prasad S, Hyderabad

