ఒప్పో తన పాపులర్ ఎఫ్-సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఒప్పో ఎఫ్33, ఒప్పో ఎఫ్33 ప్రోలను త్వరలో భారత్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్‌ల గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, టిప్‌స్టర్ సంజు చౌదరి దీనికి సంబంధించిన మార్కెటింగ్ పోస్టర్‌ను షేర్ చేస్తూ..
లాంచ్ తేదీ, ధర, కీలక స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. గత ఏడాది వచ్చిన ఎఫ్31 ప్రోకు సక్సెసర్‌గా రాబోతున్న ఈ ఒప్పో ఎఫ్33 ప్రో.. భారీ బ్యాటరీ, సరికొత్త డిజైన్‌తో అలరించనుంది.
ఒప్పో ఎఫ్33 ప్రో- భారత్‌లో ధర, లాంచ్ డేట్..
లీక్ అయిన సమాచారం ప్రకారం, ఒప్పో ఎఫ్33 ప్రో ఏప్రిల్ 14న భారతదేశంలో విడుదల కానుంది. దీని ధర రూ. 35,000 లోపు ఉంటుందని అంచనా. పోలిక కోసం చూస్తే, గత మోడల్ ఒప్పో ఎఫ్31 ప్రో (8GB+128GB) రూ. 26,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అంటే కొత్త మోడల్ ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఒప్పో ఎఫ్33 ప్రో- డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ..
ఒప్పో ఎఫ్33 ప్రోలో 6.57- ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లేని అందించబోతున్నారు. ఈ ఫోన్ ప్రధాన హైలైట్ ఏంటంటే.. దీనికి ఐపీ69కే రేటింగ్ ఉంది. అంటే ఇది ధూళి, నీటి నుంచి అత్యున్నత స్థాయి రక్షణను ఇస్తుంది. ఇది 194 గ్రాముల బరువుతో ఉండబోతోంది.
ఒప్పో ఎఫ్33 ప్రో- పర్ఫార్మెన్స్, ప్రాసెసర్..
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ 6360 మ్యాక్స్ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సమాచారం. ప్రస్తుత మోడల్ ఎఫ్31 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్ ఉండగా, కొత్త మోడల్‌లో ప్రాసెసర్ పరంగా మార్పులు కనిపిస్తున్నాయి.
ఒప్పో ఎఫ్33 ప్రో- కెమెరా ఫీచర్లు..
కెమెరా విభాగంలో ఒప్పో ఎఫ్33 ప్రో సరికొత్త అప్‌గ్రేడ్స్‌తో రానుంది:
రియర్ కెమెరా: వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీ కెమెరా: ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించనున్నారు. ఇది 100-డిగ్రీల వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూను కలిగి ఉంటుంది. ఎఫ్31 ప్రోలోని 32ఎంపీ సెల్ఫీ కెమెరాతో పోలిస్తే ఇది పెద్ద అప్‌గ్రేడ్.
ఒప్పో ఎఫ్33 ప్రో- బ్యాటరీ, ఛార్జింగ్..
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పరంగా ఒప్పో రాజీ పడలేదు. ఇందులో 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కొనసాగించబోతున్నారు. దీనికి తోడు 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది, ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.
ఒప్పో ఎఫ్33 ప్రో- సరికొత్త డిజైన్..
లీక్ అయిన మార్కెటింగ్ ఇమేజ్ ప్రకారం, ఒప్పో ఎఫ్33 ప్రో.. బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. డిజైన్ పరంగా ఒప్పో పెద్ద మార్పు చేసింది. పాత మోడల్ ఎఫ్31 ప్రోలో మధ్యలో సర్క్యులర్ (గుండ్రటి) కెమెరా మాడ్యూల్ ఉండగా, కొత్త ఎఫ్33 ప్రోలో అంచులు కొంచెం వంగి ఉన్న స్క్వేర్ షేప్ (చతురస్రాకార) కెమెరా మాడ్యూల్‌ను చూడవచ్చు.
లాంచ్ టైమ్ నాటికి.. ఈ ఒప్పో ఎఫ్33 ప్రోపై మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. ఒప్పో ఎఫ్33 ప్రో భారత్‌లో ఎప్పుడు లాంచ్ కావచ్చు? దీని ధర ఎంత ఉండవచ్చు?
లీకైన సమాచారం ప్రకారం, ఒప్పో ఎఫ్33 ప్రో ఏప్రిల్ 14, 2026న లాంచ్ అయ్యే అవకాశం ఉంది; దీని ధర సుమారు రూ. 35,000 లోపు ఉండవచ్చు.
2. ఒప్పో ఎఫ్33 ప్రోలో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్లు ఏమిటి?
ఇందులో 7,000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా, IP69K డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
Chitturi Eswara Karthikeya Sharath

