Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Bold: ఓటీటీలోకి 3½ నెలలకు వచ్చిన బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామా- మసాజ్ సెంటర్‌లో విచిత్రాలు- 6.3 రేటింగ్- ఎక్కడంటే?

OTT Bold: ఓటీటీలోకి 3½ నెలలకు వచ్చిన బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామా- మసాజ్ సెంటర్‌లో విచిత్రాలు- 6.3 రేటింగ్- ఎక్కడంటే?

Bold Romantic Comedy Drama Spa OTT Release: ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు తెలుగు ఓటీటీ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. వైవిధ్యమైన కథలు, సహజమైన నటనతో ఆకట్టుకునే మాలీవుడ్ చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటున్నాయి.

స్పా ఐఎమ్‌డీబీ రేటింగ్

ఈ క్రమంలోనే, ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న సరికొత్త మలయాళ బోల్డ్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా స్పా ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజ్ అయిన స్పా మూవీ భిన్నమైన కథాంశంతో రూపొందింది. స్పా చిత్రానికి ఐఎమ్‌డీబీలో పదికి 6.3 రేటింగ్ వచ్చింది.

'లా పారడైజ్' మసాజ్ సెంటర్ చుట్టూ తిరిగే కథ

స్పా సినిమా కథ అంతా 'లా పారడైజ్' అనే ఒక అర్బన్ మసాజ్ థెరపీ సెంటర్ లోపల జరుగుతుంది. విభిన్న నేపథ్యాలు, రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్‌ను దర్శకుడు ఎంతో వినోదాత్మకంగా చూపించారు. విచిత్రమైన మనసులు కలిగిన వ్యక్తులు మసాజ్ సెంటర్‌లో ప్రవర్తన ఎలా ఉంటుందనే పాయింట్ ఆకట్టుకునేలా ఉంటుంది.

ఊహల్లో బతికే వ్యక్తి

ప్రధానంగా 'మాథన్' అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రేమపై అతడికున్న అంచనాలు, ఊహల్లో బతికే అతడి మనస్తత్వం.. నిజ జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలకు ఎలా ప్రభావితం అయ్యాయనేది ఇందులో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదొక సాదాసీదా ప్రేమకథలా కాకుండా, అక్కడక్కడా హాస్యాన్ని పండిస్తూనే, జీవిత సత్యాలను, భ్రమలను హృద్యంగా, కొంచెం బోల్డ్‌గా ఆవిష్కరించే కథలతో సాగుతుంది.

ఎబ్రిడ్ షైన్ మార్క్

గతంలో '1983', 'యాక్షన్ హీరో బిజు' వంటి సూపర్ హిట్ చిత్రాలతో మలయాళంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఎబ్రిడ్ షైన్ ఈ స్పా చిత్రానికి దర్శకత్వం వహించారు. మనుషుల ప్రవర్తన, వారి మధ్య ఉండే సంబంధాలను సునిశితంగా పరిశీలించి సినిమాలు తీయడంలో ఆయన స్టైలే వేరు. స్పా మూవీలో కూడా వింత ప్రవర్తన గల వ్యక్తులు మసాజ్ సెంటర్‌లో చేసే విచిత్రాలు ఎలా ఉంటాయో రియలిస్టిక్‌గా చూపించారు.

స్పా నటీనటులు

స్పా సినిమాలో వినీత్ తట్టిల్ డేవిడ్, సిద్ధార్థ్ భరతన్, శ్రుతి మీనన్, రాధిక రాధాకృష్ణన్, శ్రీజ దాస్, ప్రశాంత్ అలెగ్జాండర్, మేజర్ రవి వంటి మాలీవుడ్ పాపులర్ నటీనటులు యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇషాన్ ఛాబ్రా అందించిన సంగీతం సినిమా మూడ్‌ను మరింత ఎలివేట్ చేసింది.

స్పా ఓటీటీ రిలీజ్

స్పా క్రియేషన్స్, సంజు జె ఫిల్మ్స్ సంయుక్తంగా స్పా సినిమాను ఈ చిత్రాన్ని నిర్మించాయి. బోల్డ్, కామెడీ, లవ్, కాస్తా యాక్షన్, డ్రామా వంటి అంశాలతో తెరకెక్కిన స్పా ఓటీటీలోకి వచ్చేసింది. మే 28వ తేది నుంచి స్పా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మనోరమ మ్యాక్స్ (ManoramaMAX)లో స్పా ఓటీటీ రిలీజ్ అయింది.

మనోరమ మ్యాక్స్ ఓటీటీలో

ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన స్పా సినిమా మూడున్నర నెలలకు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చింది. థియేటర్లకు వెళ్లి చూడలేకపోయిన సినిమా ప్రియులకు, వినూత్నమైన కథలను ఇష్టపడే డిజిటల్ ప్రేక్షకులకు ఈ వీకెండ్‌లో మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్ స్పా సినిమా మంచి చాయిస్‌గా నిలుస్తుంది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu