Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Horror: 7 లక్షలకు 3 వేల కోట్లు- 2 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- సెన్సార్ కట్ సీన్లతోనూ- కానీ, అదొక్కటే మైనస్!

OTT Horror: 7 లక్షలకు 3 వేల కోట్లు- 2 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- సెన్సార్ కట్ సీన్లతోనూ- కానీ, అదొక్కటే మైనస్!

Obsession OTT Released In 2 Platforms: సినీ ప్రపంచంలో ఒక్కోసారి చిన్న బడ్జెట్ చిత్రాలు సృష్టించే సంచలనాలు అంతా ఇంతా కాదు. భారీ తారాగణం, కోట్లాది రూపాయల గ్రాఫిక్స్ లేకపోయినా కేవలం బలమైన కథ, ఉత్కంఠ రేపే కథనంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయవచ్చని హాలీవుడ్ చిత్రం ' అబ్సెషన్' (Obsession) నిరూపించింది.

7 లక్షల బడ్జెట్‌తో

కేవలం రూ. 7 లక్షల అత్యల్ప బడ్జెట్‌తో తెరకెక్కి, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 370 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 3,100 కోట్లు) కలెక్షన్స్ రాబట్టిన ఈ హారర్ సెన్సేషన్ అబ్సెషన్ ఇప్పుడు 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడానికి వచ్చేసింది.

20 ఏళ్ల యూట్యూబర్ సృష్టించిన అద్భుతం

కేవలం 20 ఏళ్ల వయసున్న కర్రీ బార్కర్ అనే యూట్యూబర్ ఈ చిత్రానికి కథ అందించి, తొలిసారిగా దర్శకత్వం వహించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఫోకస్ ఫీచర్స్' ఏకంగా 15 మిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఒక సాధారణ యూట్యూబర్ హాలీవుడ్‌లో ఈ స్థాయి విజయం అందుకోవడం విశేషం.

"సంబంధాలలో పరస్పర అంగీకారం, పురుషుల అహంకారం ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తాయో ఈ హారర్ డ్రామాలో చర్చించాం" అని దర్శకుడు కర్రీ బార్కర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

వన్ విష్ విల్లో (One Wish Willow) అనే ఒక రహస్య శక్తులున్న వస్తువు సహాయంతో తాను ఇష్టపడిన అమ్మాయి నిక్కీ (ఇండే నవరెట్)ని ప్రేమలో పడేలా చేసుకుంటాడు హీరో బేర్ (మైఖేల్ జాన్‌స్టన్). ఆ తర్వాత ఆ ప్రేమ కాస్తా విపరీతమైన పిచ్చిగా, సైకోలాంటి అబ్సెషన్‌గా మారి ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీసిందనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

భారత్‌లో సెన్సార్ కత్తెర.. అయినా సరే!

అబ్సెషన్ సినిమా భారతదేశంలో థియేటర్లలో విడుదలైనప్పుడు ఇక్కడి సెన్సార్ బోర్డ్ (CBFC) ఈ చిత్రానికి భారీగా కత్తెర వేసింది. సినిమాలో అత్యంత కీలకమైన, ఒక భయంకరమైన మరణానికి సంబంధించిన సీన్‌తో సహా రెండు ప్రధాన సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించింది.

ఈ కట్స్ పట్ల భారతీయ హారర్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఇక్కడి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధించింది. ఇప్పుడు విడుదలైన ఓటీటీ వెర్షన్‌లో తెరవెనుక విశేషాలు (బిహైండ్ ది సీన్స్), సెన్సార్ కట్ సీన్స్, డైరెక్టర్ కామెంటరీ వంటి అదనపు కంటెంట్‌ను కూడా జోడించారు.

అదొక్కటే మైనస్

హారర్ సినీ ప్రియులను థియేటర్లలో వణికించిన అబ్సెషన్ అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లాట్‌ఫామ్‌లలో జూన్ 30 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ డిజిటల్ ఎంట్రీ వెనుక ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదొక్కటే దీనికి మైనస్ అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతానికి అబ్సెషన్ సినిమా ఓటీటీ సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా అందుబాటులో లేదు. కేవలం 'రెంట్' (అద్దె), 'బై' (కొనుగోలు) పద్ధతిలోనే అబ్సెషన్ మూవీని ఓటీటీ రిలీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాల ప్రకారం ఈ సినిమాను పూర్తిగా కొనుగోలు చేయడానికి 24.99 డాలర్లు, లేదా కేవలం వీక్షించడానికి 19.99 డాలర్లు చెల్లించి అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది.

ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్

సాధారణ సబ్‌స్క్రైబర్ల కోసం అబ్సెషన్ ఫ్రీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ఈ నెల ఆఖర్లో ప్రకటించనున్నారు. జూలై 14న బ్లూ-రే, 4K యూహెచ్‌డీ ఫిజికల్ మీడియా రూపంలో విడుదల కానున్న ఈ అబ్సెషన్ త్వరలోనే పీకాక్ (Peacock) ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కానుంది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu