ఓ గ్రానీ.. వయసు మళ్లిన బామ్మ. కానీ ఆమె గతం ఎంతో భయంకరం. ఆమె చేసే పనులు వెన్నులో వణుకు పుట్టించేవే. చిన్నపిల్లల హత్యలు, శాపాలు ఇలా ఒక సినిమాలో ఎన్నో మలుపులు.
ఇలాంటి అంశాలతో ఓటీటీలో అదరగొడుతున్న ఆ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు.. 'గ్రానీ'. ఈ మిస్టరీ సస్పెన్స్ మూవీ రెండు ఓటీటీల్లోనూ సత్తాచాటుతోంది.
గ్రానీ ఓటీటీ
ఓటీటీలో తమిళ్ హారర్ థ్రిల్లర్ గ్రానీని ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. ఈ సినిమా ఆహా వీడియో, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు ఓటీటీల్లోనూ ఈ హారర్ మూవీ అదరగొడుతోంది. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.
హారర్ థ్రిల్లర్
గ్రానీ సినిమా మిస్టరీ, సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 30, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇందులో వడివుకరాసి, సింగం పులి, దిలీపన్ తదితరులు నటించారు. ఈ మూవీకి విజయ్ కుమారన్ డైరెక్టర్.
గ్రానీ స్టోరీ
ఓ మిస్టీరియస్ బామ్మ చుట్టూ సాగే కథతో తెరకెక్కిన సినిమానే గ్రానీ. కేరళ-తమిళనాడు సరిహద్దులో ఉన్న తమ సొంతూరికి లండన్ నుంచి ఓ ఫ్యామిలీ వస్తుంది. ఆ గ్రామంలో వాళ్లకు వారసత్వంగా వచ్చిన పురాతన ఇల్లు ఉంటుంది.
లండన్ నుంచి వచ్చిన ఆ ఫ్యామిలీకి ఆ ఇంట్లో చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఓ బామ్మ వాళ్లను భయపెడుతుంది.
చిన్నారుల హత్యలు
మరోవైపు గ్రామంలో చిన్నారుల హత్యలు కలకలం రేపుతాయి. ఇదో పెద్ద మిస్టరీగా మారుతుంది. దీనిపై పోలీసులు విచారణ కొనసాగిస్తారు. అయితే ఆ బామ్మ గతం ఏంటీ? ఆ గ్రామంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరిగింది? అన్నది గ్రానీ సినిమాలో చూడాల్సిందే.
ఎందుకు చూడాలంటే?
హారర్ సినిమాలంటే సస్పెన్స్ వేరే లెవల్ లో ఉండాలి. అదే రేంజ్ లో భయపెట్టాలి. గ్రానీ మూవీలో ఇవి రెండు పర్ఫెక్ట్ గా కుదిరాయనే కామెంట్లు వస్తున్నాయి. రూరల్ స్టోరీ లైన్ తో పాటు సైకలాజికల్ సస్పెన్స్, సూపర్ నేచురల్ హారర్ ఎలిమెంట్స్ తో గ్రానీ మూవీ ఎంగేజింగ్ గా సాగుతుంది.
మధ్యలో ట్విస్ట్ లు మైండ్ బ్లాక్ చేస్తాయి. అసలు నెక్ట్స్ ఏం జరుగుతుందో ఊహించలేకుండా వచ్చే సీన్లు వణికిస్తాయి. భయం, సస్పెన్స్, థ్రిల్ కావాలనుకునే ఆడియన్స్ గ్రానీ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. హారర్ థ్రిల్లర్ లవర్స్ కు గ్రానీ సినిమా ఓ మంచి ఆప్షన్.
Chandu Shanigarapu

