Dailyhunt
OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్- నోట్లో నుంచి పాములు, జీసస్ చిన్ననాటి కథ- తెలుగులో రిలీజ్!

OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్- నోట్లో నుంచి పాములు, జీసస్ చిన్ననాటి కథ- తెలుగులో రిలీజ్!

బైబిల్‌లోని వివాదాస్పద కథనాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ది కార్పెంటర్ సన్'. ఘోస్ట్ రైడర్ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హాలీవుడ్ స్టార్ హీరో నికోలస్ కేజ్ ఈ మూవీలో మెయిన్ లీడ్‌లో నటించారు.

ఆయనతోపాటు నోవా జుప్, ఎఫ్‌కేఏ ట్విగ్స్, ఐస్లా జాన్‌స్టన్, సౌహీల యాకూబ్, కైతి మనోలిడకి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

హారర్ థ్రిల్లర్ ఫాంటసీ ఎలిమెంట్స్

లోట్ఫీ నాథన్ ది కార్పెంటర్స్ సన్ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే, ఈ సినిమాకు నికోలస్ కేజ్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు. హారర్ థ్రిల్లర్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ది కార్పెంటర్స్ సన్ సినిమా భారీ అంచనాల నడుమ గతేడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదల అయింది.

అయితే, ఈ సినిమా ఊహించినట్లుగా సక్సెస్ సాధించలేకపోయింది. చాలా వరకు నెగెటివిటీ తెచ్చుకుంది. ఈ సినిమాను జీసస్ చిన్ననాటి కథ ఆధారంగా తెరకెకక్కించారని సమాచారం. బైబిల్‌కు సంబంధించిన పలు వివాదాస్పద అంశాలను టచ్ చేశారని, ఒక పవిత్రమైన గాథలా కాకుండా ఇష్టమొచ్చిన రీతిలో రూపొందించారని విమర్శలు వచ్చాయి.

అతీంద్రియ శక్తులు ఉన్నట్లుగా

జీసస్‌గా చూపించిన పాత్రను దైవంలా కాకుండా అతీంద్రియ శక్తులు వచ్చినట్లుగా, నోట్లో పాములు రావడం వంటి సీన్లతో తెరకెక్కించారని కామెంట్స్ వినిపించాయి. హారర్, డ్రామా, ఫాంటసీల కలయికగా వచ్చిన ఈ సినిమా అసలు ఏ ఉద్దేశంతో తీశారో అర్థం కాక విమర్శకులు పెదవి విరిచారు.

హాలీవుడ్ విలక్షణ నటుడు అయిన నికోలస్ కేజ్ ఏదైనా సినిమా చేస్తున్నారంటే అందులో ఏదో ఒక వింత ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. ఈసారి ఆయన సాక్షాత్తూ జీసస్ పెంపుడు తండ్రి అయిన జోసెఫ్ (కార్పెంటర్) పాత్రలో నటించారు. అయితే, ఈ చిత్రం భక్తికి మించి గందరగోళం నిండిన ఒక హారర్ డ్రామాగా మిగిలిపోయిందని ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈజిప్టు సంతతికి చెందిన

ఈజిప్టు సంతతికి చెందిన దర్శకుడు లోట్ఫీ నాథన్ రూపొందించిన ఈ సినిమా బైబిల్‌లో ప్రామాణికం కాని 'ఇన్ ఫాన్సీ గాస్పెల్ ఆఫ్ థామస్' ఆధారంగా తెరకెక్కింది. ది కార్పెంటర్స్ సన్ కథ విషయానికొస్తే.. గుహలో కేకల మధ్య ఒకరి జననం జరుగుతుంది.

ఆ తర్వాత హేరోదు రాజు సైనికులు పసిబిడ్డలను మంటల్లో వేస్తారు. అది చూసి ఆ పసిబిడ్డల తల్లుల రోదిస్తుంటారు. ఆ హింస నుంచి తప్పించుకున్న కార్పెంటర్ (నికోలస్ కేజ్), అతని భార్య (ఎఫ్‌కేఏ ట్విగ్స్) తమ కుమారుడితో (నోవా జూప్) కలిసి ఒక మారుమూల గ్రామానికి వెళ్తారు. అక్కడ ఆ బాలుడు ఎవరు?, తనలోని అసాధారణ శక్తులను ఎలా అర్థం చేసుకున్నాడు అనేదే ప్రధాన కథ.

ది కార్పెంటర్స్ సన్ ఓటీటీ రిలీజ్

ఇలా భిన్నాభిప్రాయాలు తెచ్చుకున్న ది కార్పెంటర్స్ సిన్ ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 4) వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో నేటి నుంచి ది కార్పెంటర్స్ సన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాట తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో ది కార్పెంటర్స్ సన్ ఓటీటీ రిలీజ్ అయింది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu