Widows Bay OTT Streaming: నవ్వుకు భయం తోడైతే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే కాన్సెప్ట్‌తో ఓటీటీలోకి కామెడీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
దెయ్యాల ఊరిలో పడే ఓ మేయర్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడన్నదే దీని కథ. ఆ ఓటీటీ సిరీస్ పేరే 'విడోస్ బే' (Widow's Bay).
అతీంద్రియ శక్తుల ద్వీపం
అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉండే ఒక వింతైన, అతీంద్రియ శక్తులు ఉన్న ద్వీపం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మూఢనమ్మకాలు, దెయ్యాల కథలు ఎక్కువగా ఉండే ఈ ఊరికి మేయర్‌గా బాధ్యతలు చేపడతాడు టామ్ లాఫ్టిస్ (మాథ్యూ రైస్).
పర్యాటక కేంద్రంగా మార్చాలని
ఒకవైపు ఊరి సమస్యలను పరిష్కరిస్తూనే, మరోవైపు ఆ వింత ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ఆయన చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఎదురయ్యే వింత అనుభవాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హారర్, మిస్టరీ, థ్రిల్లర్‌తోపాటు డార్క్ హ్యూమర్ (Dark Humor) ఇష్టపడే వారికి ఈ ఓటీటీ సిరీస్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు.
100 శాతం ఫ్రెష్ కంటెంట్
అంతేకాకుండా విడోస్ బే సిరీస్‌కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సిరీస్‌కు రొటెన్ టోమాటోస్ సంస్థ నుంచి ఏకంగా 100కు 100 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికేట్ వచ్చింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో ఈ వెబ్ సిరీస్‌కు పదికి 7.7 రేటింగ్ ఉంది. అంటే, విడోస్ బే ఓటీటీ సిరీస్‌లో ఉన్న కంటెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు-ఎపిసోడ్ షెడ్యూల్
ఇలాంటి విడోస్ బే ఓటీటీలోకి నిన్న (ఏప్రిల్ 29) వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV Plus)లో విడోస్ బే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 29న ఆపిల్ ప్లస్ టీవీలో విడోస్ బే నుంచి రెండు ఎపిసోడ్స్ ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సిరీస్‌లో మొత్తం పది ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి బుధవారం ఒక కొత్త ఎపిసోడ్ ఓటీటీ ప్రీమియర్ అవుతుంది.
విడోస్ బే ఓటీటీ సిరీస్ ఎపిసోడ్స్ రిలీజ్ వివరాలు ఇలా:
ఎపిసోడ్ 1, 2: ఏప్రిల్ 29 (ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి)
ఎపిసోడ్ 3 (Inaugural Swim): మే 6
ఎపిసోడ్ 4 (Beach Reads): మే 13
ఎపిసోడ్ 5 (What to Expect on Your Trip): మే 20
ఎపిసోడ్ 6 & 7: మే 27
ఎపిసోడ్ 8 (Your Baggage): జూన్ 3
ఎపిసోడ్ 9 (Emergency Shelter): జూన్ 10
ఎపిసోడ్ 10 (Grand Finale): జూన్ 17
ఎందుకు చూడాలి?
మాథ్యూ రైస్ నటన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ. ఒక మేయర్‌గా ఆయన పడే ఇబ్బందులు, ద్వీపంలో జరిగే వింత సంఘటనల మధ్య కామెడీని పండించిన తీరు మెప్పిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు 'మసూద' లేదా 'ఓం భీమ్ బుష్' వంటి సినిమాల్లో కనిపించే హారర్-కామెడీ మిశ్రమం ఇక్కడ వెస్ట్రన్ స్టైల్‌లో కనిపిస్తుంది. కేవలం భయపెట్టడమే కాకుండా, పర్యాటక రంగం వెనుక ఉండే రాజకీయాలను కూడా వ్యంగ్యంగా చూపించారు.
మరో ఓటీటీలో కూడా
జూన్ మధ్య వరకు సాగే ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణం, హారర్ ప్రేమికులను అలరిస్తుందని చెప్పొచ్చు. మీకు ఆపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉంటే ఈ వారాంతంలో ఈ ఓటీటీ సిరీస్‌ను చూసేయొచ్చు. లేదా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంటల్ పద్ధతిలో విడోస్ బే వెబ్ సిరీస్‌ను వీక్షించవచ్చు.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

