Dailyhunt
OTT Horror: ఓటీటీలోకి వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. అడవిలో రాక్షసి.. అమ్మాయిని చిన్నపిల్లలా.. సస్పెన్స్!

OTT Horror: ఓటీటీలోకి వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. అడవిలో రాక్షసి.. అమ్మాయిని చిన్నపిల్లలా.. సస్పెన్స్!

డవిలో ముసుగు వెనుకాల ఉన్న రాక్షసి అక్కడికి వచ్చిన జనాలను అత్యంత క్రూరంగా చంపుతుంది. కన్న తండ్రిని కూడా వదలదు. వెన్నులో వణుకు పుట్టించే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు..

'డాలీ'. ఈ హాలీవుడ్ ఫిల్మ్ ఈ రోజు (ఏప్రిల్ 4) ఓటీటీలోకి వచ్చింది.

డాలీ ఓటీటీ

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ 'డాలీ' ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డాలీ సినిమా డిజిటల్ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీని ఇప్పుడు రెంట్ పే చేసి మాత్రమే చూడొచ్చు. ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ డాలీ సినిమా చూడాలంటే మనీ కట్టాల్సిందే.

తెలుగులోనూ

హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'డాలీ' మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో చూడొచ్చు. ఒళ్లు గగుర్పొడిచే భయంకరమైన సీన్లు ఈ సినిమాలో ఉన్నాయి.

హారర్ థ్రిల్లర్

డాలీ మూవీ ఓ హారర్ థ్రిల్లర్. ఇందులో సస్పెన్స్, సైకో తరహా అంశాలు కూడా ఉంటాయి. ఈ సినిమాకు రాడ్ బాక్ల్ హర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం మార్చి 6, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇందులో ఫాబియానె థెరీసా, రస్ టిలర్, కేట్ కాబ్, ఈవ్ తదితరులు నటించారు.

డాలీ స్టోరీ

మేసీ, చేజ్ ఫ్రెండ్స్. ఓ రోజు అడవికి ట్రెక్కింగ్ కు వెళ్తారు. అక్కడ మేసీకి ప్రపోజ్ చేయాలని చేజ్ అనుకుంటాడు. అయితే ట్రెక్కింగ్ చేస్తూ వాళ్లు విడిపోతారు. అప్పుడే ఓ బొమ్మ ముసుగు వేసుకున్న ఓ వింత మహిళ డాలీ.. తల లేని శవాన్ని పూడ్చి పెట్టడం చేజ్ చూస్తాడు. చేజ్ ను డాలీ చంపాలనుకుంటుంది. అతనిపై దాడి చేస్తుంది.

చిన్నపిల్లలా

ఆ తర్వాత మేసీని డాలీ తన ఇంట్లో బంధిస్తుంది. మేసీని పెద్ద ఊయలలో వేసి చిన్నపిల్లలా చూసుకుంటుంది. చిత్రహింసలు పెడుతుంది. డాలీ తన సొంత తండ్రిని కూడా చంపుతుంది. మేసీ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేస్తుంది.

మేసీకి ఒక కీ దొరుకుతుంది. మరి మేసీ అక్కడి నుంచి తప్పించుకుందా? అసలు డాలీ ఎవరు? చేజ్ బతికే ఉన్నాడా? అనేది డాలీ మూవీ చూస్తే తెలుస్తుంది. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ఫ్యాన్స్ కు ఈ డాలీ ఓ మంచి ఆప్షన్. ఇంకెందుకు లేట్, ఈ వీకెండ్ కు ఓ లుక్కేయండి.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu