Dailyhunt
OTT Release: ఓటీటీలోకి నిన్న రిలీజైన రాకాస, బైకర్, కార్మేని సెల్వం- ఒకేదాంట్లో 2 స్ట్రీమింగ్- 7కిపైగా రేటింగ్- ఎక్కడంటే?

OTT Release: ఓటీటీలోకి నిన్న రిలీజైన రాకాస, బైకర్, కార్మేని సెల్వం- ఒకేదాంట్లో 2 స్ట్రీమింగ్- 7కిపైగా రేటింగ్- ఎక్కడంటే?

థియేటర్లలో విడుదలైన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. అలా, నిన్న అంటే ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలైన మూడు సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఆసక్తి నెలకొంది.

వాటిలో రెండు సినిమాలు ఒక్క ఓటీటీలోనే రిలీజ్ కానున్నాయి. అలాగే, వాటికి 7కిపైగా ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉండటం విశేషం. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.

రాకాస ఓటీటీ

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన హారర్ ఫాంటసీ కామెడీ మూవీ రాకాస. సంగీత్ శోభన్ సోలో హీరోగా నయన్ సారిక హీరోయిన్‌గా చేసిన సినిమా ఇది. ఓటీటీ సిరీసులకు దర్శకత్వం వహించిన మానస శర్మ రాకాస చిత్రాన్ని తెరకెక్కించారు. గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న రాకాస ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది.

రాకాస సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో పదికి 7 రేటింగ్ కూడా ఉంది. కడుపుబ్బా నవ్వించే కామెడీతో, ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాకాస సినిమాను తెరకెక్కించినట్లు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రాకాస ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి నెలకొంది.

రాకాస ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మంచి ధర వెచ్చించే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఈ డీల్ కుదుర్చుకుందని సమాచారం. ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే రాకాస ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 నుంచి 6 వారాల మధ్య రాకాస ఓటీటీ స్ట్రీమింగ్ కానుందట. అంటే, ఏప్రిల్ చివరి వారం, లేదా మే మొదటి 2 వారాల్లో రాకాస ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

బైకర్ ఓటీటీ

నారీ నారీ నడుమ మురారి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీనే బైకర్. మోటోక్రాస్ రేసింగ్ అనే కొత్త స్పోర్ట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన బైకర్ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు.

తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు కూడా మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో ఎమోషన్స్, డ్రామా బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. ఫలితంగా ఐఎమ్‌డీబీలో బైకర్ సినిమాకు 10కి 7.7 రేటింగ్ వచ్చింది.

దీంతో బైకర్ ఓటీటీ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. బైకర్ ఓటీటీ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లో బైకర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మరో నాలుగు వారాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో బైకర్ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇలా 7కిపైగా రేటింగ్ సాధించిన రెండు సినిమాలు ఒక నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ ప్రీమియర్ అవనున్నాయి.

కార్మేని సెల్వం ఓటీటీ

ప్రముఖ నటుడు సముద్రఖని మెయిన్ లీడ్ రోల్‌లో డైరెక్టర్ గౌతమ్ మీనన్ కీలక పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా కార్మేని సెల్వం. రామ్ చక్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా నిన్న (ఏప్రిల్ 3) థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. మధ్య తరగతి వ్యక్తుల ఆలోచన, అప్పుల వంటి విషయాలతో హృద్యంగా తెరకెక్కించారు.

ఇలాంటి కార్మేని సెల్వం ఓటీటీ హక్కులను సన్ నెక్ట్స్ సంస్థ దక్కించుకుందని సమాచారం. అంటే, థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత సన్ నెక్ట్స్‌లో కార్మేని సెల్వం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu