OTT Releases: ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. క్రేజీ వెబ్ సిరీస్‌ల నుంచి మోస్ట్ అవేటెడ్ సినిమాల వరకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.
గ్లోబల్ స్పై థ్రిల్లర్ 'సిటాడెల్ 2' నుంచి అడివి శేష్ 'డెకాయిట్' వరకు ఈ వారం ఏయే ఓటీటీల్లో ఏమేం రాబోతున్నాయో ఓసారి లుక్కేద్దాం.
సిటాడెల్ సీజన్ 2.. ప్రైమ్ వీడియోలో..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' రెండో సీజన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. మే 6 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
మొదటి సీజన్‌లో ధ్వంసమైన స్పై ఏజెన్సీ సిటాడెల్‌ను పునర్నిర్మించే క్రమంలో, మాజీ ఏజెంట్లు నాదియా సిన్హా (ప్రియాంక), మాసన్ కేన్ (రిచర్డ్ మాడెన్) తిరిగి ఏకమవుతారు. 'మాంటికోర్' అనే ప్రమాదకరమైన సంస్థను వీరు ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సీజన్ హైలైట్. రూసో బ్రదర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సిరీస్‌లో మెర్లే డాండ్రిడ్జ్ వంటి కొత్త నటులు కూడా కనిపించబోతున్నారు. అన్ని ఎపిసోడ్లు ఒకేసారి విడుదల కావడం విశేషం.
డెకాయిట్ కూడా ప్రైమ్ వీడియోలోకే..
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' మే 8 నుంచి ప్రైమ్ వీడియోలోకే అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ణి కీలక పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు.
వాలా 2.. జియోహాట్‌స్టార్‌లోకి..
కేరళ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన 'వాలా 2' మే 8 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఐదు భాషల్లో అందుబాటులో ఉంటుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.220 కోట్లకుపైగా వసూలు చేసిన మూవీ ఇది.
లైక్ (Love Insurance Kompany).. ప్రైమ్ వీడియోలోకి..
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ఫ్యూచరిస్టిక్ రోమ్-కామ్ మూవీ 'లైక్'. థియేటర్లలో ఆశించిన ఫలితం రాకపోయినా, డిజిటల్ ప్రీమియర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మే 6 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రల్లో నటించగా అనిరుధ్ సంగీతం అందించారు.
భరతనాట్యం 2 మోహినియాట్టం.. నెట్‌ఫ్లిక్స్
మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్ 'భరతనాట్యం 2 మోహినియాట్టం' మే 8న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సాయిజు కురుప్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2024లో వచ్చిన భరతనాట్యం చిత్రానికి సీక్వెల్‌గా వస్తోంది.
లుక్కే.. ప్రైమ్ వీడియో
డ్రగ్ మాఫియా, గ్యాంగ్ వార్ల నేపథ్యంలో రూపొందిన 'లుక్కే' వెబ్ సిరీస్ మే 8న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇందులో రాశీ ఖన్నా, పాలక్ తివారీ కీలక పాత్రలు పోషించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. సిటాడెల్ సీజన్ 2 ఎప్పుడు, ఏ ఓటీటీలో విడుదలవుతుంది?
ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ సీజన్ 2 మే 6న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతుంది.
2. అడివి శేష్ 'డెకాయిట్' ఏయే భాషల్లో అందుబాటులో ఉంటుంది?
డెకాయిట్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
3. 'లైక్' (Love Insurance Kompany) మూవీ ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడు?
ఈ చిత్రం మే 6 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.
4. ఈ వారం విడుదలయ్యే మలయాళ హిట్ చిత్రాలేవి?
వాలా 2 (మే 8న జియో హాట్‌స్టార్‌లో), భరతనాట్యం 2 (మే 8న నెట్‌ఫ్లిక్స్‌లో) విడుదలవుతున్నాయి.
Hari Prasad S, Hyderabad

