Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Releases: ఓటీటీలోకి ఇరుముడి, టాక్సిక్.. రవితేజ బ్లాక్ బస్టర్, యశ్ బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

OTT Releases: ఓటీటీలోకి ఇరుముడి, టాక్సిక్.. రవితేజ బ్లాక్ బస్టర్, యశ్ బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

OTT Releases: ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన పెద్ద చిత్రాల ఓటీటీ విడుదలపై సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా 'ఇరుముడి'తో పాటు, రాకింగ్ స్టార్ యశ్ నటించిన మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ మూవీ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రాల డిజిటల్ హక్కుల వివరాలు, ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఇరుముడి ఓటీటీ

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ చిత్రం 'ఇరుముడి'. ఈ సినిమా ఆగస్టు 21, 2026న థియేటర్లలోకి అడుగుపెట్టింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో సాగే ఈ విభిన్నమైన కథాంశానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఇరుముడి ఓటీటీ రిలీజ్ పై క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

నెట్‌ఫ్లిక్స్ డీల్

'ఇరుముడి' పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.14 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. నాన్-థియేట్రికల్ హక్కుల పరంగా రవితేజ కెరీర్‌లో ఇది ఒక మెగా డీల్‌గా నిలిచింది.

అయితే, థియేటర్లలో ఇరుముడి సినిమా ప్రదర్శన విజయవంతంగా సాగుతుండటంతో, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అధికారిక తేదీని నిర్మాతలు ఇంకా వెల్లడించలేదు. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాతే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం డిజిటల్‌గా ప్రసారమయ్యే అవకాశం ఉంది.

టాక్సిక్ డిజిటల్ డీల్

మరోవైపు 'కేజీఎఫ్ 2' తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రం ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ భారీ పాన్-ఇండియా సినిమాకు నెగెటివ్ టాక్ వినిపిస్తోంది.

తాజాగా టాక్సిక్ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. 'టాక్సిక్' డిజిటల్, శాటిలైట్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5' (Zee5) సొంతం చేసుకుందని సమాచారం. అయితే, మేకర్స్ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఓటీటీలోకి ఎప్పుడు?

సాధారణంగా రూ.వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే పాన్-ఇండియా చిత్రాలు థియేటర్లలో విడుదలైన 4 నుంచి 8 వారాల వ్యవధి తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి వస్తాయి. 'టాక్సిక్' కూడా అదే బాటలో థియేట్రికల్ విండో ముగిసిన అనంతరమే ఓటీటీలోకి రానుంది. చిత్రబృందం త్వరలోనే ఓటీటీ విడుదల తేదీపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu