Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT: రిలీజ్‌కు ముందే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న తెలుగు ఓటీటీ సిరీస్‌.. ప్రీమియర్స్‌కు ఫిదా.. అంతలా ఏముంది?

OTT: రిలీజ్‌కు ముందే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న తెలుగు ఓటీటీ సిరీస్‌.. ప్రీమియర్స్‌కు ఫిదా.. అంతలా ఏముంది?

OTT: ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ ఏదైనా ఉందంటే.. అది 'గుర్తుకొస్తున్నాయి' సిరీసే. ఇంకా ఓటీటీలో రిలీజ్ కాని ఈ సిరీస్ గురించి ట్విటర్ లో మోత మోగుతోంది.

ఎక్స్ లో అందరూ పాజిటివ్ రివ్యూస్ తో ఈ సిరీస్ పై హైప్ ను మరింత పెంచేస్తున్నారు. ఇది ప్యూర్ నోస్టాల్జియా మూమెంట్ అని అందరూ అంటున్నారు.

గుర్తుకొస్తున్నాయి ఓటీటీ

సింపుల్ కథలనే మనసులకు హత్తుకునేలా తీస్తూ ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ బ్లాక్ బస్టర్లు కొడుతోంది. '90స్ మిడిల్ క్లాస్ బయోపిక్', 'అనగనగా' అలాంటి కథలే. ఇప్పుడు ఇదే కోవలో 'గుర్తుకొస్తున్నాయి' సిరీస్ వచ్చేస్తోంది. ఈ నోస్టాల్జియా సిరీస్ రేపటి (జూలై 3) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ముందుగానే థియేటర్లలో వేసిన ఈ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్సాన్స్ వస్తోంది.

ప్యూర్ నోస్టాల్జియా

కొన్ని సినిమాలు లేదా సిరీస్ లు చూసినంత సేపు ఎంటర్ టైన్ చేస్తాయి. కానీ ఆ తర్వాత మర్చిపోతాం. కానీ కొన్ని మాత్రం మనతోనే ట్రావెల్ అవుతాయి. మనల్ని ఆ కథలోకి తీసుకెళ్తాయి. తెరపై మనల్ని మనం చూసుకునేలా చేస్తాయి. ఈ గుర్తుకొస్తున్నాయి సిరీస్ కూడా అలాంటిదేననే టాక్ వినిపిస్తోంది. ముఖ్యం 30 ఏళ్ల యూత్ ను తమ బాల్యంలోకి తీసుకెళ్లే పర్ఫెక్ట్ ప్యూర్ నోస్టాల్జియా ఇది అని అంటున్నారు.

అన్ని ఎమోషన్లు

తాడు కట్టే తిప్పే బొంగరం నుంచి గోలీల వరకు 90స్ కిడ్స్ చిన్నప్పుడు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పుడీ గుర్తుకొస్తున్నాయి సిరీస్ లో ఈ అల్లరినంతా మరోసారి చూడొచ్చని నెటిజన్లు మెన్షన్ చేస్తున్నారు. చిన్నప్పటి అల్లరి, ఫ్రెండ్ షిప్, లవ్, తల్లిదండ్రుల అనుబంధం.. ఇలా ఈ సిరీస్ లో అన్ని ఎమోషన్లు ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్టోరీ ఏంటంటే?

గుర్తుకొస్తున్నాయి సిరీస్ లో 'బేబీ' ఫేమ్ విరాజ్ హీరోగా నటించాడు. యశశ్రీ రావు హీరోయిన్. సంతోష్ (విరాజ్), వైశాలి (యశశ్రీ) స్కూల్ లో క్లాస్ మేట్స్. వీళ్లు లవ్ చేసుకుంటారు. వైశాలి తండ్రి ఏమో అదే స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్). రఘునాథ్ ను ఒప్పించి మరీ సంతోష్ పెళ్లికి రెడీ అవుతాడు.

అయితే గోవాలో బ్యాచిలర్స్ పార్టీ కోసం తన ఫ్రెండ్స్ గణేష్, శ్రీకాంత్, ఆనంద్ తో కలిసి సంతోష్ వెళ్తాడు. ఆ క్రమంలో యాక్సిడెంట్ కావడంతో సంతోష్ గతాన్ని మర్చిపోతాడు. మరి సంతోష్ కు గతం గుర్తొచ్చిందా? వైశాలితో పెళ్లి జరిగిందా? అన్నదే గుర్తుకొస్తున్నాయి సిరీస్ స్టోరీ.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu