Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Series: నా గుండె పగిలింది.. సూపర్ హిట్ ఓటీటీ సిరీస్‌పై శ్రియా కామెంట్స్.. నెక్ట్స్ టార్గెట్ ఆ 2 భారీ సినిమాలు!

OTT Series: నా గుండె పగిలింది.. సూపర్ హిట్ ఓటీటీ సిరీస్‌పై శ్రియా కామెంట్స్.. నెక్ట్స్ టార్గెట్ ఆ 2 భారీ సినిమాలు!

Shriya Pilgaonkar About OTT Series Guilty Minds Season 2: ఓటీటీ తెరపై కొన్ని పాత్రలు నటీనటుల మనసులో చెరగని ముద్ర వేస్తాయి. బాలీవుడ్ బ్యూటీ, ' మీర్జాపూర్' ఫేమ్ శ్రియా పిల్గొంకర్‌కు 'గిల్టీ మైండ్స్' సిరీస్‌లోని 'కషాఫ్ ఖాజీ' పాత్ర సరిగ్గా అలాంటిదే.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

2022లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ రిలీజ్ ఈ లీగల్ కోర్ట్ రూమ్ డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా శ్రియ నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదటి సీజన్ అంతటి ఘనవిజయం సాధించినా తర్వాత కూడా గిల్టీ మైండ్స్ సీజన్ 2 రద్దు కావడం తనను ఎంతగానో బాధించిందని శ్రియా ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గుండె పగిలింది.. నటిగా పాఠం నేర్చుకున్నా!

కషాఫ్ పాత్ర తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైనదని శ్రియా పిల్గొంకర్ గుర్తు చేసుకున్నారు. "నా హృదయానికి బాగా దగ్గరైన ఓటీటీ సిరీస్ 'గిల్టీ మైండ్స్'. కషాఫ్ పాత్రను దర్శకులు చాలా అద్భుతంగా రాశారు. సాధారణంగా నేను ఎమోషన్స్‌ను బాగానే నియంత్రించుకుంటాను. కానీ రెండో సీజన్ రావడం లేదని తెలిసినప్పుడు నా గుండె పగిలినంత పనైంది" అని ఎమోషనల్ అయ్యారు శ్రియా పిల్గొంకర్.

"ఆ ఓపెన్ ఎండింగ్‌తో ఉన్న కథను ముందుకు తీసుకెళ్లకపోవడం బాధాకరం. ప్రాణం పెట్టి చేసిన ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం అంత సులభం కాదు. కానీ ఈ చిత్ర పరిశ్రమలో మన చేతుల్లో లేని విషయాలను అంగీకరించి ముందుకు సాగక తప్పదు" అని నటి శ్రియా పిల్గొంకర్ చెప్పుకొచ్చారు.

లీగల్ డ్రామాగా ఆకట్టుకున్న 'గిల్టీ మైండ్స్'

కోర్టురూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఓటీటీ సిరీస్‌లో లా కాలేజీ స్నేహితులు కషాఫ్, దీపక్ రాణా (వరుణ్ మిత్రా) చుట్టూ కథ తిరుగుతుంది. ఇద్దరి మధ్య బలమైన భావోద్వేగాలు ఉన్నప్పటికీ, వృత్తిరీత్యా కోర్టులో ప్రత్యర్థులుగా నిలబడతారు.

బడా కార్పొరేట్ కంపెనీల తరఫున వాదించే దీపక్, న్యాయం కోసం పోరాడే కషాఫ్ మధ్య సాగే లీగల్ వార్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. షెఫాలీ భూషణ్, జయంత్ దిగంబర్ దర్శకత్వంలో తెరకకెక్కిన ఈ ఓటీటీ సిరీస్ గిల్టీ మైండ్స్‌లో నమ్రతా సేథ్, సుగంధ గార్గ్, కుల్ భూషణ్ ఖర్బందా, సతీష్ కౌశిక్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

సెప్టెంబరులో థియేట్రికల్ రచ్చ.. వరుస సినిమాలతో శ్రియా!

వెబ్ సిరీస్ రద్దయిన బాధ ఉన్నప్పటికీ, ప్రస్తుతం శ్రియా పిల్గొంకర్ దృష్టి అంతా బిగ్ స్క్రీన్ పైనే ఉంది. చాలా కాలం తర్వాత సెప్టెంబర్ నెలలో ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఒకే వారం వ్యవధిలో రెండు పెద్ద సినిమాలు విడుదలవుతుండటంతో తీవ్ర ఉత్కంఠ, ఆనందంలో ఉన్నానని శ్రియా చెప్పారు.

కథ ఓకే చేసినప్పటి నుంచి సినిమా పూర్తయి థియేటర్లలోకి వచ్చే వరకు సాగే ప్రయాణం చాలా గొప్పదని, రిలీజ్ రోజంటే తనకు ఎప్పుడూ ప్రత్యేమేనని శ్రియా పిల్గొంకర్ వెల్లడించారు.

'మీర్జాపూర్', 'హైవాన్' చిత్రాలపై భారీ అంచనాలు

సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలోకి రానున్న 'మీర్జాపూర్ ది మూవీ'పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అఖ్తర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, జితేంద్ర కుమార్, రవికిషన్, శ్వేతా త్రిపాఠితో పాటు శ్రియా పిల్గొంకర్ ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా వచ్చిన వారానికే, అంటే సెప్టెంబర్ 11, 2026న ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన 'హైవాన్' చిత్రం విడుదల కానుంది. 'తషాన్' చిత్రం తర్వాత దాదాపు 18 ఏళ్లకు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ ఈ సినిమాతో మళ్లీ వెండితెరపైకి వస్తుండటం విశేషం.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని

ఇందులో సయామీ ఖేర్, శ్రియా పిల్గొంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని శ్రియా ఆశాభావం వ్యక్తం చేశారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu