Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Thriller: ఓటీటీలోకి ఉదయభాను కొత్త క్రైమ్ థ్రిల్లర్.. ప్రేమిస్తే భరత్ హీరో.. డైరెక్ట్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Thriller: ఓటీటీలోకి ఉదయభాను కొత్త క్రైమ్ థ్రిల్లర్.. ప్రేమిస్తే భరత్ హీరో.. డైరెక్ట్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Thriller: తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ మూవీ డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కు రాబోతుంది. డిజిటల్ వీక్షకుల కోసం మరో ఆసక్తికరమైన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిద్ధమైంది.

భరత్ నివాస్, ఉదయభాను, మేధ ముఖ్య పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'పంచనామా' (Panchanama) నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. థియేట్రికల్ విడుదల లేకుండానే ఈ చిత్రాన్ని నేరుగా డిజిటల్ వేదికపైకి తీసుకొస్తున్నారు.

క్రైమ్ థ్రిల్లర్

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సస్పెన్స్ తో సాగుతూ ఈ తరహా సినిమాలు, సిరీస్ లు ఉత్కంఠ కలిగిస్తాయి. ఇప్పుడు అలాంటి ఎలిమెంట్లతోనే రెడీ అయిన మూవీ 'పంచనామా'. ఈ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తుండటం విశేషం.

జీ5లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ పంచనామా సినిమాను జీ5 ఓటీటీ ఒరిజినల్ మూవీగా తెరకెక్కించింది. 2026 సెప్టెంబర్ 11 నుంచి ఈ చిత్రం జీ5 వేదికగా ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు భాషలోనే ఈ చిత్రం వీక్షకులకు అందుబాటులోకి రానుంది.

''సెప్టెంబర్ 11న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కానుంది. పంచనామా సినిమా సెప్టెంబర్ 11న కేవలం జీ5 తెలుగులో మాత్రం స్ట్రీమింగ్ అవుతుంది'' అని జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఈ అనౌన్స్ మెంట్ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

స్టోరీ ఏంటంటే?

'పంచనామా' చిత్రం పక్కా క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుందని మేకర్స్ చెప్తున్నారు. జై రామ్ అనే పాత్ర నేతృత్వంలో సాగే తీవ్రమైన నేర పరిశోధన చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఊహించని మలుపులతో కూడిన కథనం, చివరి వరకు కొనసాగే సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్రబృందం చెబుతోంది.

ప్రేమిస్తే భరత్

ఈ పంచనామా సినిమాలో 'ప్రేమిస్తే' భరత్ నివాస్ హీరోగా నటించాడు. అతను తనదైన శైలి నటనతో ఆకట్టుకోనుండగా, సుదీర్ఘ విరామం తర్వాత ఉదయభాను ఒక బలమైన పాత్రలో కనిపించనుండటం విశేషం. మేధ హీరోయిన్ గా అలరించనుంది.

నేర పరిశోధన నేపథ్యంతో వచ్చే సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు 'పంచనామా' ఒక మంచి సస్పెన్స్ అనుభూతిని అందిస్తుందని చిత్ర నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి ట్విస్ట్ లతో ఈ మూవీ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu