Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Today: 23 రోజుల్లో పెళ్లి.. అమ్మాయి మనసు మారుస్తానని ఛాలెంజ్.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

OTT Today: 23 రోజుల్లో పెళ్లి.. అమ్మాయి మనసు మారుస్తానని ఛాలెంజ్.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

OTT Today: ప్రతి ఆదివారం ఓ చిన్న సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్. కథా సుధ వీక్లీ సిరీస్ లో భాగంగా ఇవాళ (ఆగస్టు 30) 'నందిని' మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది.

ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ విశేషాలపై ఓ లుక్కేయండి.

ఈటీవీ విన్ కథాసుధ

పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఒరిజినల్ సిరీస్ లు, సినిమాలతో సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంటోంది. అదే క్రమంలో కథాసుధ సిరీస్ లో ప్రతి సండే ఓ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తోంది.

నందిని మూవీ

ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కథాసుధ వీక్లీ సిరీస్ లో భాగంగా 'నందిని' మూవీ ఇవాళ డైరెక్ట్ గా డిజిటల్ డెబ్యూ చేసింది. ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఇందులో ఆకాంక్ష, పవన్ సింగులూరి, మీనా వాసు, శరణ్య, నళిని దేవి, రమా, శరత్ చంద్ర తదితరులు నటించారు.

ఈ నందిని సినిమాకు రామారావు సిరిపురం డైరెక్టర్. కథ కూడా ఆయనే అందించారు. సాయి కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. వెంకట్ తళారి నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

నందిని మూవీ ఓ యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది. కాలేజీ రోజుల నుంచి నందినిని శివ ప్రేమిస్తాడు. కానీ ఆ మాటను డైరెక్ట్ గా చెప్పలేకపోతాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చూపులు అరెంజ్ చేస్తాడు. శివ, నందిని పెళ్లికి పెద్దలు ఒప్పుకొంటారు. కానీ నందిని మాత్రం ఈ పెళ్లికి రెడీగా ఉండదు.

నందినిని ఒప్పించడానికి శివ అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ నందినిని గతం వెంటాడుతూ ఉంటుంది. చివరకు పెళ్లికి 23 రోజులు ఉందని, నందిని మనసు మార్చే పెళ్లి చేసుకుంటానని శివ ఛాలెంజ్ చేస్తాడు. మరి చివరకు ఏం జరిగిందన్నది నందిని మూవీలో చూడాల్సిందే.

ఫ్యామిలీతో కలిసి

నందిని మూవీని సండే ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో హాయిగా చూసేయొచ్చు. పైగా ఇది కేవలం 38 నిమిషాల్లోనే కంప్లీట్ అవుతుంది. సో సండే రోజు కంప్లీట్ ఫ్యామిలీకి ఓటీటీలో ఇది బెస్ట్ స్ట్రీమింగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu