Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రోజా రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా.. రీ ఎంట్రీపై సీనియర్ హీరోయిన్ కామెంట్స్

OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రోజా రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా.. రీ ఎంట్రీపై సీనియర్ హీరోయిన్ కామెంట్స్

Anbe Diana OTT Release Today: ఎప్పటికప్పుడు ఓటీటీల్లో డిఫరెంట్ సినిమాలు అలరిస్తూనే ఉంటాయి. అలా ఇవాళ (ఆగస్టు 28) ఓటీటీలోకి రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా వచ్చేసింది.

ఇందులో సీనియర్ హీరోయిన్ ఆర్కే రోజా కీలక పాత్ర పోషించింది.

ఐఎమ్‌డీబీ రేటింగ్

ఒకప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆర్కే రోజా కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా వచ్చిన సినిమానే అన్బే డయానా. జూలై 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా ఐఎమ్‌బీలో 7.5 రేటింగ్ కూడా దక్కించుకుంది. అలాంటి అన్బె డయానా ఓటీటీ వివరలాపై మంచి క్యూరియాసిటీ నెలకొంది.

చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంగా తెరకెక్కిన 'అన్బే డయానా' సినిమా కథ, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే ఊహించని మలుపుతో ఏం జరిగిందనే పాయింట్‌ చుట్టూ సాగుతుంది. స్వేచ్ఛగా జీవించే ఓ ఆంగ్లో-ఇండియన్ యువతితో అతడు ప్రేమలో పడటంతో రెండు విభిన్న ప్రపంచాలు ఏకమవుతాయి.

గుర్తింపు కోసం యువకుడి పోరాటం

కుటుంబంలో ఉండే అంచనాలు, తనకంటూ ఓ గుర్తింపు కోసం యువకుడు చేసే ప్రయాణం మధ్య ఎదురయ్యే సంక్లిష్టతలే ఈ కథలో ప్రధాన అంశాలుగా కనిపిస్తాయి. మిలియన్-డాలర్ స్టూడియోస్, నియో క్యాసిల్ క్రియేషన్స్, ఎరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన 'అన్బే డయానా' చిత్రంతో రోజా సెల్వమణి మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు.

ఇందులో ఆర్కే రోజా పరి తల్లి సరళ పాత్రలో కనిపించారు. పరి ఎలవళగన్ కథ రాసి, దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించారు. రమ్య రంగనాథన్ కథానాయికగా నటించారు. రోజా పాత్ర కథకు మరింత ఆత్మీయతను, భావోద్వేగాన్ని తీసుకొచ్చింది.

అన్బే డయనా ఓటీటీ రిలీజ్

ఇలా డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన అన్బే డయనా ఓటీటీలోకి నేడు వచ్చేసింది. సోనీ లివ్‌లో అన్బే డయనా ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ 5 భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో అన్బే డయనా స్ట్రీమింగ్ అవుతోంది.

అన్బే డయనా ఓటీటీ రిలీజ్ సందర్భంగా రోజా సెల్వమణి మాట్లాడుతూ.. "అన్బే డయానా చిత్రంతో మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇవ్వటం నాకెంతో ప్రత్యేకం. ఈ సినిమాలోని ప్రేమ, ఆత్మీయత, కామెడీ, కుటుంబం, బంధాలు, భిన్నమైన సంస్కృతులను కలిపి చూపించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది" అని అన్నారు.

ఆర్కే రోజా కామెంట్స్

"సరళ పాత్రకు తనదైన వ్యక్తిత్వం, భావోద్వేగాలు ఉంటాయి. ఆ పాత్రకు జీవం పోయడాన్ని నేను ఆస్వాదించాను. ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండటం చాలా ఆనందంగా ఉంది" అని ఆర్కే రోజా చెప్పారు.

"థియేటర్లలో అన్బే డయానా సినిమాను ఆస్వాదించిన ప్రేక్షకులతో పాటు, అక్కడ చూడలేకపోయిన వారు కూడా ఇప్పుడు తమ ఇంటి నుంచే ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. మేం ఈ సినిమా కోసం కలిసి పనిచేసినప్పుడు ఎంతగా ఆస్వాదించామో, అంతే స్థాయిలో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను" అని సీనియర్ హీరోయిన్ అన్బే డయానా ఆకాంక్షించారు.

సోనీ లివ్ ఓటీటీలో

రోజా సెల్వమణి కమ్‌బ్యాక్ చిత్రం 'అన్బే డయానా'ను ఇప్పుడు సోనీ లివ్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్‌లో చూసి ఆస్వాదించండి అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, కామెడీ, మన నెటివిటీకి, మన సంస్కృతి, కుటుంబ అనుబంధాల మేళవింపుగా రూపొందిన అన్బే డయానా సినిమా ఇప్పుడు మరింతగా ఓటీటీ ప్రేక్షకులకు చేరువ కానుందని సోనీ లివ్ పేర్కొంది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu