Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTT Top 10: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, షోస్ ఇవే.. రెండు థ్రిల్లర్ మూవీస్.. రియాలిటీ షోల హవా

OTT Top 10: ఓటీటీలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు, షోస్ ఇవే.. రెండు థ్రిల్లర్ మూవీస్.. రియాలిటీ షోల హవా

OTT Top 10: డిజిటల్ స్ట్రీమింగ్ వరల్డ్‌లో ఊహించని ట్విస్ట్ నమోదైంది. ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన ఓటీటీ మోస్ట్ వాచ్డ్ టాప్ 10 లిస్ట్‌లో ఒక కామెడీ షో ఏకంగా క్రికెట్ మ్యాచ్‌లను, స్టార్ హీరోల బిగ్ బడ్జెట్ సినిమాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

సమయ్ రైనా హోస్ట్ చేసిన 'ఇండియాస్ గాట్ లేటెంట్' డిజిటల్ స్పేస్‌ను పూర్తిగా షేక్ చేస్తోంది.

టాప్ 3 రేసులో నెగ్గింది ఎవరు?

ఈ వారంలో బిగ్గెస్ట్ విన్నర్‌గా స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా రూపొందించిన 'ఇండియాస్ గాట్ లేటెంట్' షో నిలిచింది. ఎలాంటి భారీ ప్రొడక్షన్ సపోర్ట్ లేకుండానే కేవలం యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వేదికలపై మిలియన్ల వ్యూస్‌ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

రెండో స్థానంలో ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ నిలిచింది. క్రికెట్ ప్రేమికులు లైవ్ మ్యాచ్‌లను భారీ ఎత్తున చూడటంతో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ నంబర్ 2 స్పాట్‌ను సొంతం చేసుకుంది.

ఇక మూడో స్థానాన్ని రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న 'ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్ 15' కైవసం చేసుకుంది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ రియాలిటీ షోలో ఈసారి స్టంట్స్ లెవెల్ వేరే రేంజ్‌లో డిజైన్ చేయడంతో ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు.

అక్షయ్ కుమార్, అమితాబ్ షోల హవా

నాలుగో స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మల్టీస్టారర్ మూవీ 'వెల్కమ్ టు ది జంగిల్' నిలిచింది. థియేటర్ల తర్వాత జియోహాట్‌స్టార్‌లో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఐదో స్థానంలో క్లాసిక్ కామెడీ షో 'తారక్ మెహతా కా ఊల్టా చష్మా' తన పట్టును నిలబెట్టుకుంది. యూట్యూబ్, సోనీ లివ్ వేదికలపై ఈ షోను ఇప్పటికీ లక్షలాది కుటుంబాలు రెగ్యులర్‌గా వీక్షిస్తున్నాయి.

ఆరో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో రియాలిటీ సిరీస్ 'ది ట్రెయిటర్స్ సీజన్ 2' నిలవగా, ఏడో స్థానాన్ని అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) కైవసం చేసుకుంది.

పడిపోయిన విజయ్ సినిమా.. చివరి 3 స్థానాల్లో ఇవీ..

ఎనిమిదో స్థానంలో జియోహాట్‌స్టార్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన మలయాళం థ్రిల్లర్ మూవీ 'ఐ నోబడీ' నిలిచింది. తొమ్మిదో స్థానంలో లవ్ అండ్ రివేంజ్ డ్రామా 'ఠుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2' నిలిచింది.

అందరినీ ఆశ్చర్యపరుస్తూ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా పదో స్థానానికి పడిపోయింది. జీ5 ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రారంభంలో మంచి వ్యూస్ సాధించినప్పటికీ, ఇప్పుడు చివరి స్థానానికి చేరుకుంది.

ఓటీటీ ఆడియన్స్ మైండ్‌సెట్ మారిందా?

గతంలోలాగా కేవలం భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద స్టార్ల చిత్రాలకే ఓటీటీలో ఆదరణ లభిస్తుందనే రోజులు పోయాయి. డిజిటల్ ఆడియన్స్ ఇప్పుడు అన్‌స్క్రిప్టెడ్ కామెడీ, రియాలిటీ షోలు, స్పాంటేనియస్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

సమయ్ రైనా షో సృష్టించిన ప్రభావం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీ మరింత బలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆర్మాక్స్ మీడియా ఓటీటీ టాప్ 10

ఇండియాస్ గాట్ లేటెంట్ (కామెడీ రియాలిటీ షో నెట్‌ఫ్లిక్స్)

ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ (క్రికెట్ లైవ్ సోనీ లివ్)

ఖత్రోంకీ ఖిలాడీ సీజన్ 15 (రియాలిటీ షో జియోహాట్‌స్టార్)

వెల్‌కమ్ టు ద జంగిల్ మూవీ (జియోహాట్‌స్టార్)

తారక్ మెహతా కా ఊల్టా ఛష్మా (సోనీ లివ్ ఓటీటీ)

ది ట్రైటర్స్ సీజన్ 2 (ప్రైమ్ వీడియో)

కౌన్ బనేగా క్రోర్‌పతి (సోనీ లివ్ ఓటీటీ)

ఐ నోబడీ మూవీ (జియోహాట్‌స్టార్)

ఠుక్రా కే మేరా ప్యార్ వెబ్ సిరీస్ సీజన్ 2 (జియోహాట్‌స్టార్)

జన నాయగన్ (జీ5 ఓటీటీ)

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu