Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pallaburusu OTT: సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పళ్లబురుసు-ఇవాళే ఓటీటీలోకి-20 రోజుల్లోనే స్ట్రీమింగ్‌-బ్రష్ కొనివ్వలేదని!

Pallaburusu OTT: సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన పళ్లబురుసు-ఇవాళే ఓటీటీలోకి-20 రోజుల్లోనే స్ట్రీమింగ్‌-బ్రష్ కొనివ్వలేదని!

Pallaburusu OTT: తెలుగు ఓటీటీ లవర్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చేసింది. ఎవరూ ఊహించని విధంగా లేటెస్ట్ తెలుగు మూవీ 'పళ్లబురుసు' ఓటీటీలోకి వచ్చేసింది.

థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోపే మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అక్కినేని నాగార్జున మెచ్చిన ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వైరల్ గా మారింది.

పళ్లబురుసు మూవీ

ఇటీవల తెలుగు సినిమాల్లో రూటెడ్ స్టోరీస్ కు జనాలు జై కొడుతున్నారు. అదే సమయంలో తెలంగాణ పల్లెల్లోని జీవితాలు, అనుబంధాలు, సహజ కథలు వెండితెరపై వెలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి రూటెడ్ స్టోరీతో వచ్చిన సినిమానే 'పళ్లబురుసు'. టూత్ బ్రష్ ను తెలంగాణలో పళ్లబురుసు అని పిలుస్తారు.

నాగార్జున మెచ్చిన మూవీ

పళ్లబురుసు సినిమాకు ఇంత పాపులారిటీ రావడం వెనుక ప్రధాన కారణం ఉంది. అక్కినేని నాగార్జునకు ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది. అందుకే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమాను థియేటర్లకు తీసుకొచ్చారు. అయితే థియేటర్లో మాత్రం ఊహించిన రిజల్ట్ రాలేదు.

పళ్లబురుసు ఓటీటీ

ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన పళ్లబురుసు మూవీ 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 2) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాతు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ పళ్లబురుసు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

కథ ఏమిటంటే?

మన చుట్టూ ఉండే మనుషులు మధ్య జరిగే కథనే పళ్లబురుసు సినిమా. తెలంగాణలోని ఓ ఊర్లో శంభు అనే ముసలాయన ఉంటాడు. అతనికి పంటి నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే మందులు ఇస్తాడు. అయితే వేపపుల్లతో కాకుండా టూత్ బ్రష్ తో బ్రష్ చేసుకోమని చెప్తాడు. దీంతో కొడుకు తిరుపతిని పళ్లబురుసు కొనివ్వమని ఆ తండ్రి అడుగుతాడు.

కానీ తండ్రి మాటలను ఆ కొడుకు పట్టించుకోడు. అంతే కాకుండా తన తండ్రిని పిలవకుండా తన కొడుకుకు పెళ్లి కూడా చేస్తాడు తిరుపతి. దీంతో శంభు అవమానంతో రగిలిపోతాడు. నేరుగా వెళ్లి కొడుకుపై కేసు పెడతాడు. పళ్లబురుసు కొనివ్వడం లేదంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేదే పళ్లబురుసు మూవీ కథ.

ఈ నటీనటులు

పళ్లబురుసు సినిమాలో ఎంతో టాలెంట్ ఉన్న సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ నటించారు. వీళ్లతో పాటు గోమతి, ప్రజ్వల్ యాద్మ, అంజి మామ, సుజాత, రమేశ్ తదితరులు సినిమాలో పాత్రలు పోషించారు. ఈ పళ్లబురుసు మూవీని ఉదయ్ చౌహాన్ తెరకెక్కించాడు. లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ కావాలనుకునేవాళ్లకు పళ్లబురుసు ఓటీటీలో మంచి ఆప్షన్.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu